వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ఇది ఒక నక్షత్రము పేరు.
  2. అశ్విన్యాది నక్షత్రములలో మూడవది. ఇది ఆఱునక్షత్రముల గుంపు. ఒకప్పుడు అగ్నిదేవుఁడు సప్తఋషుల భార్యలను చూచి మోహింపఁగా అతని భార్య అగు స్వాహాదేవి, తన భర్త ఆ ఋషి భార్యలచేత శపింపఁబడును అని భయపడి వసిష్ఠుని భార్య అయిన అరుంధతి తప్ప తక్కిన ఆఱుగురి రూపములను తాను ధరించి ఆయనతో కూడెను. అంతట ఆఋషులు తమ భార్యలే అగ్నితో కూడిరి అని ఎంచి వారిని విడనాడిరి. అప్పుడు వారు తాము అట్టి అకృత్యము చేయలేదు అనియు అగ్ని భార్యయే తమరూపములను వహించెను అనియు దోషములేని తమ్ము పరిగ్రహింపవలెను అనియు ప్రార్థింపఁగా వారు అది నిజము అని తెలిసియు వారితోడిది అగు అరుంధతియొక్క రూపమును స్వాహాదేవి వహింపలేక పోయెను. అట్టి పాతివ్రత్య మహిమ వీరియందు ఉండినయెడ వీరి రూపములను మాత్రము ఎట్లు తాల్చును అని వారి ప్రార్థనమును అంగీకరింపక పోయిరి. ఆముని భార్యలనే షట్కృత్తికలు అందురు. కొందఱు అపుడు కుమారస్వామి వీరివల్ల అగ్నికి పుట్టినట్లు వక్కాణింతురు. కొందఱు ఱెల్లునందు పుట్టిన కుమారస్వామికి ఈకృత్తికాదేవులు స్తన్యము ఇచ్చి అతనిని తమ కుమారునిఁగా చేసికొనిరి అని చెప్పుదురు. కనుకనే కుమారస్వామికి కార్తికేయుఁడు అను పేరు కలిగెను.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కృత్తిక&oldid=900522" నుండి వెలికితీశారు