వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. తెలుగువారిలో ఒక పురుషుల పేరు.
  • కాళిదాసు ఒక సంస్కృతకవి. కాళికాదేవిని కొలిచి ఆదేవి యొక్క వరప్రసాదమును పొందినందున ఇతనికి ఈ పేరు కలిగెను. ఇతడు మిక్కిలి ప్రసిద్ధుడు. కవిసమయము చక్కగా తెలిసినవాడు. ఉపమానోపమేయములను పోల్చి చెప్పుటయందు మిక్కిలి సమర్ధుడు కాబట్టి ఇతడు చెప్పెడు ఉపమాలంకారము శ్లాఘింప దగినదిగా ఉండును. కనుకనే "ఉపమా కాళిదాసస్య" అను వచనము లోకమునందు ప్రసిద్ధముగా వాడబడుచున్నది. మఱియు ఈమహాకవి విక్రమార్కుని ఆస్థానమునందలి కవులలో ఒకడు

"శ్లో|| ధన్వంతరి క్షపణ కామరసింహశంకు, బేతాళభట్టిఘటఖర్ప కాళిదాసాః|, ఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయం, రత్నానివై వరరుచే ర్నవ విక్రమస్య|| " అను ఈ శ్లోకమునందు చెప్పబడిన ధన్వంతరి, క్షపణకుడు, అమరసింహుడు, శంకువు, బేతాళుడు, భట్టి, ఘటఖర్పరుడు, కాళిదాసుడు, వరాహమిహిరుడు అను కవులు తొమ్మండ్రును విక్రమార్కుని సభయందలి నవరత్నములు అని తెలియబడుచున్నది. శాకుంతలము, మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము అను నాటకములును, రఘువంశము, మేఘసందేశము, కుమారసంభవము అను కావ్యములును ఇతనిచే రచియింప బడెను.

ఇదిగాక భోజప్రబంధమువలన భోజరాజు యొక్క సభలోను ఒక కాళిదాసు ఉన్నట్టు తెలియవచ్చుచు ఉన్నది. ఇతఁడు సకల విషయములందును మొదటియాతనిని పోలినవాడు. ఒకానొక కాలమున భోజుని సభయందలి కవులలో ఒకఁడు అగు దండి అనువానికిని ఇతనికిని వివాదము కలిగి అప్పుడు సరస్వతిని ఆరాధించి మాయిరువురిలో కవి ఎవఁడో తెలుపవలయును అని ప్రార్థింపఁగా వారికి సరస్వతి ప్రత్యక్షమై "కవిర్దండీ కవిర్దండీ నసంశయః" అనఁగా కాళిదాసునికి కోపము వచ్చి "రండే అహం కః" అనఁగా "త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం నసంశయః" అని సరస్వతి చెప్పినందున ఈ కాళిదాసుఁడు సరస్వతి అవతారము అని చెప్పుదురు. ఈయన నళోదయము, శృంగార తిలకము, ప్రశ్నోత్తరమాల, కవికంఠ పాశము, కర్పూరమంజరి, భోజచంపువు అనెడు గ్రంథములను, శ్యామలా దండకమును రచియించెను. ఇందు కడపట ఉదహరించిన దండకము తనకు కాళికాదేవి ప్రత్యక్షము అయినప్పుడు చెప్పినది. ఇంతటి కవులు లోకములో మఱియెవరును కారు. కనుకనే,

"పురా కవీనాం గణనాం ప్రసంగే, కనిష్ఠకాధిష్ఠితకాళిదాసా|, అద్యాపి తత్తుల్యకవే రభావా, దనామికా సార్థవతీ బభూవ|| " అని చెప్పబడి ఉన్నది. ఈతని విషయమై కట్టుకథలు అనేకములు ఉన్నవి. అయినను మీఁద ఉదహరించిన విషయములనుపట్టి కాళిదాసులు ఇరువురు అనియు వాస్తవము ఐన చరిత్రము ఇదియే అనియు ఊహింపవలసి ఉన్నది

...................పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కాళిదాసు&oldid=952902" నుండి వెలికితీశారు