వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. శ్రీరాముని దాసుడు. భద్రాచలంలో రాముడికి గుడికట్టించి, కైంకర్యానికి ఏర్పాట్లు చేసిన రామ భక్తుడు. రామదాసు మధ్యలో వచ్చిన పేరు. మొదట ఆయన కంచర్ల గోపన్న. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి ఆయన జన్మ స్థలం. 17 వ శతాబ్దివాడు. అప్పటి గోలకొండ నవాబు అబుల్‌ హసన్‌ తానాషా వద్ద మంత్రులుగా ఉండిన అక్కన్న మాదన్నలకు మేనల్లుడు. పన్నుల వసూలు అధికారిగా ఉండేవాడు. సొంత డబ్బునూ, భక్తులు ఇచ్చిన విరాళాలనూ మాత్రమే గాక, అవి చాలనప్పుడు ప్రభువుల సొమ్మును కూడా ఆలయ నిర్మాణానికి ఖర్చు చేసినందుకు ఆయన పన్నెండు సంవత్సరాల కాలం ఖైదులో గడిపారు. రామదాసు కీర్తనలూ, దాశరథీ శతకం ఆయనకు చిరకీర్తిని సంపాదించి పెట్టాయి. కబీరు ఆయనకు గురువనీ, ‘‘శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే/ సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’’ అనే మంత్ర శ్లోకాన్ని ఆయనే రామదాసుకు ఇచ్చాడనీ అంటారు. రామ లక్ష్మణులే తానాషాకు డబ్బు చెల్లించి గోపన్నను బందిఖానా నుంచి విడిపించారని అనుశ్రుతంగా వినవస్తున్న గాధ. రామ లక్ష్మణులు ఇచ్చినవిగా ప్రజలు విశ్వసిస్తున్న నాణేలు కొన్ని ఇప్పటికీ భద్రాద్రి ఆలయం లోని ప్రదర్శన మందిరంలో ఉన్నాయి. కొందరి పూజా మందిరాల లోనూ ఉన్నాయంటారు.
  2. తెలుగువారిలో కొందరి ఒక .
  • ఇది ఒక పిట్ట పేరు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=రామదాసు&oldid=842179" నుండి వెలికితీశారు