ఒత్తు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ/నామవాచకము/దే.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- పొడచుకొను
- ఒఱగు
- ఘనమగు
- అదుము
- బలాత్కరించు
- (పంట)నొక్కు
- తీర్చు
- ఆక్రమించు
- (అంట్లు)తొక్కు
- అదుముడు
- తఱచుదనము
- మొత్త
- ఆక్రమణము
దే.వి.
- 1. నొక్కుడు. 2. నొక్కిన యానవాలు. 3. సాంద్రత. 4. తుడుచుట. అద్దుట. 5. మెత్త. 6. ఆక్రమణ. బాధ. 7. వ్రాయునపుడు కాగితముక్రింద ఎత్తు పెట్టుకొను అట్ట మొ॥ 8. ద్విత్వము. 9. పిల్లల చేతులకు పెట్టు ఆభరణ విశేషము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఒత్తుగా/ఒత్తిడిచేయు/ఒత్తుట/ ఉదా: కాళ్ళు ఒత్తుట,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆతనికి జుట్టు ఒత్తుగా వున్నది
- సాంద్రము.= "ఉ. ఒత్తుగ మౌళి బింఛములు నుత్పలపత్త్రము కర్ణపాళి నా,యత్తము చేసి..." గంధ. ౨౩౧.
- అదుముడు;......."సీ. చేదోయి యొత్తునఁజేసి నెత్తురులైన యవయవంబులు నోర సవరచేయు." నై. ౨, ఆ.
- 1. అధిక మగు. "క. కఱ వంతంతకు నొత్తఁగ... మనుజుల్, సురసుర స్రుక్కిరి..." కాళ. ౩,ఆ. ౧౫౫., జై. ౭,ఆ. ౫౦.
- 2. కేకవేయు. "శా. ...ఒత్తెం జిన్నికుమార రార యని..." హర. ౨,ఆ. ౧౩౮.
- 3. మీఁదికి వచ్చు. "క. పగవా రొత్తిన యప్పుడ, జగ మెఱుఁగఁగఁ దెగుట యొండె సైరణ యొండెన్, దగు..." ద్వా. ౮,ఆ. ౧౧౯.
- 4. గ్రుచ్చుకొను. "గీ. హంసతూలిక పాన్పుపై యలరుమొగ్గ, యొత్తు నునుమేను గల్గు నీలోత్పలాక్షి." హర. ౪,ఆ. ౧౨.
- 5. పొడము. "సీ. సమ్మదంబునఁ గామిజనుల చిత్తంబులు చిగురొత్తఁ దరులందుఁ జిగురులొత్తె." కు.సం. ౪,ఆ. ౮౯.
- 6. ఒఱగు. "చ. గరువున కొత్తఁ జెంగలువ కచ్చు ఘటించిన మౌళిఁ జుట్టె... జిల్గుపాగ..." స్వా. ౫,ఆ. ౫౮.
- స.క్రి.
- 1. నొక్కు. "సీ. ...అవనిఁ బెట్టి యొత్తిన..." భార. విరా. ౨,ఆ. ౩౪౭., కళా. ౧,ఆ. ౯౦.
- 2. బాధించు. "ఉ. ...సుతునిం దగుపల్కుల నంత యొత్తుదే." భార. శల్య. ౨,ఆ. ౩౭౦., భా. రా. యు. ౭౭.
- 3. ఊఁదు; వాయించు. "ఉ. ఒత్తిరి శంఖకాహళములు..." కాశీ. ౬,ఆ. ౧౪౫., భాగ. ౧,స్కం. ౨౪౫. "సీ. ...లోలలోచన యోర్తు తాళ మొత్త." వాల్మీ. ౩,ఆ. ౧౨౧.
- 4. సవరించు. "గీ. జాఱుసిగ కేల నొత్తుచు..." దశా. ౩,ఆ. ౧౪౪.
- 5. పిసుకు. "సీ. ...కరము పాదము లొత్తి కరుణ వడసె." నైష. ౭,ఆ. ౧౯౨.
- 6. తుడుచు, అద్దు. "గీ. కన్నుఁగవ నశ్రుకణములు గ్రమ్ముదేరఁ, బాదతలమున నొత్తి..." భార. ద్రో. ౫,ఆ. ౩౩౮., నైష. ౨,ఆ. ౧౪౦.
- 7. గెంటు. "సీ. జిగివెండ్రుకల కప్పు జిష్ణునీలమహాంధకారపంక్తుల నైనఁ గడకు నొత్తు." పరమ. ౨,ఆ. ౩౭.
- 8. పరిహసించు. "గీ. ...ఎంత, తనదు తీవ్రత్వ మని తీవ్రధాము నొత్తు." కు. సం. ౧౦,ఆ. ౧౯౧.
- 9. బలిమి నాక్రమించు. "వ. కొందఱు కొందఱ నివేశనంబు లధికాభిలాషంబున నొత్తికొనుట కారణంబుగా వివాదంబు వుట్టిన..." భార. మహా. ౧౯.
- 10. పరీక్షించు. "ద్వి. మాటసందులు వట్టి మన సొత్తి చూడ." ద్వి. హరిశ్చ. పూ. ౪౦౦.