ఊదు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఊదు క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నోటి పెదాలను దగ్గరిగా చేర్చి గాలిని బలంగా బయటకు వేగంగా వదలటం.వేడి వస్తువును చల్లార్చుటకు లేదా చిన్న మంటను, దీపాన్ని/కొవ్వొత్తిని ఆర్పుటకు గాలిని ఊదెదరు.
- 1. బంగారము వెండి యందలి మాలిన్యమును కాకలతో తొలగించు. [కర్నూలు; గుంటూరు]
- 2. జలాశయములలో, ముఖ్యముగా ఊతతో చేపలుపట్టుట. [నెల్లూరు; వరంగల్లు]
- 3. రహస్య విషయములను మెల్లిగా చెవిలోచెప్పి ప్రోత్సహించు. [నెల్లూరు]
- ఏదో చెవిలో ఊది పోయినాడు.
- 4. దేహము నీరెక్కి ఉబ్బుట. [నెల్లూరు; తెలంగాణము; అనంతపురం]
- వాడు ఊదెక్కినాడు. (ఊదోడు)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- శంఖము వంటి వాటిని ఊదుట
- పట్టు
- ఉంచు
- అదుము
- చేపలను బట్టుయూత
- వాపు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు. (ఇది ఒక సామెత.)
- దనుజు చందమెల్లఁ దనదుచిత్తంబున, నెఱిగి శంకరుండు చిఱునగవునఁ, గాంతిమోము చెన్నువింత గావింపంగ, నుంగుటమున నల్లనూదుటయును
- పట్టు ........... "క. ఉరగపతితల లవల నురు, తరజవమున నసురులూఁదితత్పుచ్ఛము ని, ర్జరవరులూఁది మహామ, త్సరమునవడిఁ ద్రచ్చిత్రచ్చి జన మఱియున్నన్." భార. ఆది. ౨, ఆ.
- ఉంచు ............... "వీనులఁగప్పురమూఁది." కళా. ౬, ఆ.
- అదుము ......"గీ. దనుజు చందమెల్లఁ దనదుచిత్తంబున, నెఱిఁగి శంకరుండు చిఱునగవునఁ, గాంతిమోము చెన్నువింత గావింపంగ, నుంగుటమున నల్లనూఁదుటయును." నిర్వ. ౪, ఆ.
- నొక్కు ..................... "అని యూఁది చెప్పి." భార. ఆను. ౧, ఆ
- చేఁపలను పట్టెడియూఁత ..................."క. వెరవున నూఁదుల నెత్తెల, గరముల మత్స్యములఁబట్టి." భార. శాం. ౩, ఆ.