ఉండు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఉండు క్రియ/దే. అ.క్రి
- వ్యుత్పత్తి
- దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>- వసించు ఉదా: ఇక్కడే వుండు (ఉండు) ఇప్పుడే వస్తాను/అవు
- వత్రించు
- శేషించు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
దీనికి ఉందురు, ఉంద్రు, ఉండ్రు, ఉంటివి, ఉన్నను, ఉన్నది, ఉన్నె, ఉన్నే మున్నగు రూపములు సిద్ధించును.
- పర్యాయపదాలు
- అలవడు, ఆవాసించు, కలుగు, చెలంగు, దొరయు, నడచు, నడయాడు, నిలుచు, నెలయు, నెలవుకొను, పంటించు, పరిఢవించు, పాటిల్లు, పాఱు, పొందు, ప్రబలు, ప్రవర్తిల్లు, మను, మలయు, మసలు, మెలయు, వనరు, వర్తించు, వర్తిల్లు, వసించు, వెలయు, హత్తు. [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) ]
1. స్థితమగు.
- సంబంధిత పదాలు
ఏకవచనం | బహువచనం | |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | ఉన్నాను | ఉన్నాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | ఉన్నావు | ఉన్నారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | ఉన్నాడు | ఉన్నారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | ఉన్నది | ఉన్నారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వాడు అందంగా ఉన్నాడు.
- ఇక్కడే వుండు ఉండు ఇప్పుడే వస్తాను [వ్యహ]
- మీ నాన్న బాగా ఉన్నాడా?
- అక్కడ అందరు వున్నారా?
- ఉన్నట్టుండి వర్షం కురిసింది
- "గీ. వచ్చి యరదంబు డిగ్గి తద్ద్వారసీమ, దారుకుని నుండ నియమించి..." పారి. ౧,ఆ. ౧౦౫.
- "ఆ. ...సంశయోపేతచిత్తయై, యుండి యుండనోప కొక్కనాడు, భోజనావసానమున నున్న యాముని, కిందువదన ప్రీతి నిట్టు లనియె." భార. ఆది. ౮,ఆ. ౧౮౫.
- "చ. ఇది గొనిపోయి భర్తృహరి కిచ్చెద నిచ్చిన నాత డాయుర, భ్యుదయము బొందియుండు..." విక్ర. ౩,ఆ. ౧౧.
- "క. ...హరి నిజ, పురమున సుఖ ముండె..." భాగ. ౧౦,స్కం. ఉ. ౫౨౫.
- ఉండమ్మా బొట్టు పెడతా ఇదొక సినిమా పేరు
- ఏనుగు ఎంత పెద్ద జంతువైనను చిన్న అంకుశమునకు లోబడవలసి ఉండును