అసలే కోతి,ఆపై కల్లు తాగినట్టు
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
ఇది తెలుగు భాషలో వాడే ఒక సామెత.
మామూలుగానే కోతి ఒక అతి చంచలమయిన జంతువు. ఇక అటుపై అది కల్లు(తాడి చెట్టు నుండి లభించు ఒక మత్తును కలిగించు ద్రవ పదార్థము) త్రాగినచో, దాని ప్రవర్తన అత్యంత విచిత్రముగా, విధ్వంసకరముగా ఉండును. ఇదే విధమయిన లక్షణములు గల వ్యక్తిని ఉద్ధేశించి ఈ సామెతను వాడెదరు. కోతికి అసలే చిలిపి చేష్టలు ఎక్కువ. కల్లు తాగిన తరువాత ఆ మత్తులో అది చేసే చిలిపి పనులు ఇంకా ఎక్కువ అని అర్థము. ముఖ్యంగా చిన్నపిల్లల అల్లరిని ఉద్దేశించి ఈ సామెత వాడడం జరుగుతుంది.
- వాడుక
- ఈ సామెత లోని అర్థానికి మరింత గాఢతనిస్తూ ఇలా కూడా చెప్తారు - అసలే కోతి, పైగా పిచ్చెక్కింది, ఆపై కల్లు తాగింది, ఆపై నిప్పు తొక్కింది.
- ఒకో మారు ఆఫీసులో బాసు ప్రవర్తన (మరీ రెచ్చిపోయినట్లు ఉంటే) కూడా ఈ సామెత వాడుతారు.
- ఎక్కువగా వాడుకలో అసలే కోతి అని చెప్పి ఆపేస్తారు. తక్కిన భాగం అర్ధం చేసుకోవాలన్నమాట.