వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

బ్రహ్మ యొక్క భ్రూమధ్యము నుండి వెలువడిన రుద్రుని యొక్క రూపములు. ఈ యష్టమూర్తులకు వేర్వేఱు నామములును స్థానములును కలవు.

నామము స్థానము లేక-రూపము భార్య పుత్రుడు భవుడు జలము ఉష శుక్రుడు శర్వుడు మహి సుకేశి అంగారకుఁడు ఈశానుడు వాయువు శివ హనుమంతుడు పశుపతి వహ్ని స్వాహ స్కందుఁడు భీముడు ఆకాశము దిశ స్వర్గము ఉగ్రుడు స్వధర్మనిష్ఠుడైన బ్రాహ్మణుడు దీక్ష సంతానుడు మహాదేవుడు సోముడు రోహిణి బుధుడు రుద్రుడు సూర్యుడు సువర్చల శనైశ్చరుడు

  1. లలితా సహస్రనామాలలో ఆరు వందల అరవై రెండవదైన (662) ‘అష్టమూర్తిః’ శబ్దానికి వివిధ గ్రంథాలలో వివిధ వ్యాఖ్యలు ఉన్నాయి. (భాస్కరరాయల వ్యాఖ్యానం అందులో ఒకటి)
   1. లక్ష్మి, మేధ, ధర, పుష్టి, గౌరి, తుష్టి, ప్రభ, ద్యుతి.(మత్స్య పురాణంలో ఇలా ఎనిమిది రూపాలుగా తనను పాలించమని సరస్వతికి ప్రార్థన ఉంది.)
   2. గుణ భేదం చేత ఆత్మ ఎనిమిది రకాలు- జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నిర్మలాత్మ, శుద్ధాత్మ, జ్ఞానరూపాత్మ, మహాత్మ, భూతాత్మ. (యోగ శాస్త్రం)
   3. భూమి, ఆపస్సు (నీరు), అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. (భగవద్గీత)
   4. సూర్యుడు, నీరు, పృథివి, అగ్ని, వాయువు, ఆకాశం, సోమయాజి (దీక్షితుడైన బ్రాహ్మణుడు), చంద్రుడు.(విష్ణు పురాణం)
   5. శని, శుక్ర, లోహితాంగ, జీవ, స్కంద, స్వర్గ, సంతాన, బుధ. (ఈ ఎనమండుగురూ సువర్చల మొదలైన స్త్రీమూర్తుల కుమారులు)
   6. బ్రహ్మ భ్రూమధ్యం నుంచి వెలువడిన రుద్ర మూర్తులు (వారి వారి స్థానాలు, భార్యల, కుమారుల పేర్లతో సహా - ఇదే క్రమంలో) : భవుడు (జలం- ఉష- శుక్రుడు), శర్వుడు (మహి - సుకేశి - అంగారకుడు), ఈశానుడు (వాయువు -శివ - హనుమంతుడు), పశుపతి (వహ్ని- స్వాహ- స్కందుడు), భీముడు (ఆకాశం - దిశ- స్వర్గం), ఉగ్రుడు (స్వధర్మ నిష్ఠుడైన బ్రాహ్మణుడు- దీక్ష- సంతానం లేదు), మహాదేవుడు (సోముడు - రోహిణి - బుధుడు), రుద్రుడు (సూర్యుడు - సువర్చల - శనైశ్చరుడు). (పు. నా. చం.)
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>