అనుబంధం:లలితా సహస్ర నామములు/201-300
ఈ పేజీ ఏ ఇతర పేజీ లింక్ లేదు. ఈ పేజీకి ఒక లింక్ జోడించడం ద్వారా విక్షనరీ సహాయం చేయండి. |
లలితా సహస్రనామ స్తోత్రములోని మూడవ నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.
శ్లోకము 52
<small>మార్చు</small>- సర్వశక్తిమయీ - సర్వశక్తి స్వరూపిణి.
- సర్వమంగళా - సర్వమంగళ స్వరూపిణి.
- సద్గతిప్రదా - మంచి మార్గమును ఇచ్చునది.
- సర్వేశ్వరీ - జగత్తు లేదా విశ్వమునంతకు ప్రధానాధికారిణి.
- సర్వమయీ - సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉంది.
- సర్వమంత్ర స్వరూపిణీ - అన్ని మంత్రములును తన స్వరూపముగా గలది.
శ్లోకం 53
<small>మార్చు</small>- సర్వయంత్రాత్మికా - అన్ని యంత్రములకు స్వరూపముగా గలది.
- సర్వతంత్రరూపా - అన్ని తంత్రములను తన రూపముగా గలది.
- మనోన్మనీ - మననస్థితిలో మేల్కాంచిన మననము చేయబడునట్టిది.
- మాహేశ్వరీ - మహేశ్వర సంబంధమైనది.
- మహాదేవీ - మహిమాన్వితమైన ఆధిపత్యము కలది.
- మహాలక్ష్మీ - గొప్పవైన లక్ష్మలు గలది.
- మృడప్రియా - శివుని ప్రియురాలు.
శ్లోకం 54
<small>మార్చు</small>- మహారూపా - గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపము గలది.
- మహాపూజ్యా - గొప్పగా పూజింపబడునది.
- మహాపాతక నాశినీ - ఘోరమైన పాతకములను నాశనము చేయునది.
- మహామాయా - మహిమాన్వితమైన మాయా లక్షణం కలది.
- మహాసత్వా - మహిమాన్వితమైన ఉనికి గలది.
- మహాశక్తిః - అనంతమైన శక్తి సామర్థ్యములు గలది.
- మహారతిః - గొప్ప ఆసక్తి గలది.
శ్లోకం 55
<small>మార్చు</small>- మహాభోగా - గొప్ప భోగమును పొందునది లేదా అనుభవించునది.
- మహైశ్వర్యా - విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చునది.
- మహావీర్యా - అత్యంత శక్తివంతమైన వీర్యత్వము గలది.
- మహాబలా - అనంతమైన బలసంపన్నురాలు.
- మహాబుద్ధిః - అద్వితీయమైన బుద్ధి గలది.
- మహాసిద్ధిః - అద్వితీయమైన సిద్ధి గలది.
- మహాయోగేశ్వరేశ్వరీ - గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ప్రభవి.
శ్లోకం 56
<small>మార్చు</small>- మహాతంత్రా - గొప్పదైన తంత్ర స్వరూపిణి.
- మహామంత్రా - గొప్పదైన మంత్ర స్వరూపిణి.
- మహాయంత్రా - గొప్పదైన యంత్ర స్వరూపిణి.
- మహాసనా - గొప్పదైన ఆసనము గలది.
- మహాయోగ క్రమారాధ్యా - గొప్పదైన యోగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడునది.
- మహాభైరవ పూజితా - ఆదిత్య మండలంలో మధ్యనవుండే మహాభైరవుడు (నారాయణుడు) చేత పూజింపబడింది.
శ్లోకం 57
<small>మార్చు</small>- మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ - సదాశివునిచే మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్యమును సాక్షి స్వరూపిణి.
- మహా కామేశ మహిషీ - మహేశ్వరుని పట్టపురాణి.
- మహాత్రిపుర సుందరీ - గొప్పదైన త్రిపురసుందరి.
శ్లోకం 58
<small>మార్చు</small>- చతుష్షష్ట్యుపచారాఢ్యా - అరువది నాలుగు ఉపచారములతో సేవింపబడునది.
- చతుష్షష్టి కళామయీ - అరువది నాలుగు కళలు గలది.
- మహాచతుష్షష్టి కోటియోగినీ గణసేవితా - గొప్పదైన అరువది కోట్ల యోగినీ బృందముచే సేవింపబడునది.
శ్లోకం 59
<small>మార్చు</small>- మనువిద్యా - మనువు చేత ఉపాసింపబడిన విద్యారూపిణి.
- చంద్రవిద్యా - చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి.
- చంద్రమండలమధ్యగా - చంద్ర మండలములో మధ్యగా నుండునది.
- చారురూపా - మనోహరమైన రూపము కలిగినది.
- చారుహాసా - అందమైన మందహాసము కలది.
- చారుచంద్రకళాధరా - అందమైన చంద్రుని కళను ధరించునది.
శ్లోకం 60
<small>మార్చు</small>- చరాచర జగన్నాథా - కదిలెడి, కదలని ఈ జగత్తుకు అధినాథురాలు.
- చక్రరాజ నికేతనా - చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా కలిగినది.
- పార్వతీ - పర్వతరాజ పుత్రి.
- పద్మనయనా - పద్మములవంటి నయనములు కలది.
- పద్మరాగ సమప్రభా - పద్మరాగముల కాంతికి సమానమగు శరీరకాంతి కలది.
శ్లోకం 61
<small>మార్చు</small>- పంచప్రేతాసనాసీనా - పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది.
- పంచబ్రహ్మస్వరూపిణీ - పంచబ్రహ్మల స్వరూపమైనది.
- చిన్మయీ - జ్ఞానముతో నిండినది.
- పరమానందా - బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము.
- విజ్ఞానఘనరూపిణీ - విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది.
శ్లోకం 62
<small>మార్చు</small>- ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపా - ధ్యానము యొక్క, ధ్యానము చేయువాని యొక్క, ధ్యాన లక్ష్యము యొక్క సమన్వయ రూపము కలది.
- ధర్మాధర్మ వివర్జితా - విహితకర్మలు, అవిహిత కర్మలు లేనిది.
- విశ్వరూపా - విశ్వము యొక్క రూపమైనది.
- జాగరిణీ - జాగ్రదవస్థను సూచించునది.
- స్వపంతీ - స్వప్నావస్థను సూచించునది.
- తైజసాత్మికా - తేజస్సువంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్ఠాత్రి.
శ్లోకం 63
<small>మార్చు</small>- సుప్తా - నిద్రావస్థను సూచించునది.
- ప్రాజ్ఞాత్మికా - ప్రజ్ఞయే స్వరూపముగా గలది.
- తుర్యా - తుర్యావస్థను సూచించునది.
- సర్వావస్థా వివర్జితా - అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండునది.
- సృష్టికర్త్రీ - సృష్టిని చేయునది.
- బ్రహ్మరూపా - బ్రాహ్మణ లక్షణము గల రూపము గలది.
- గోప్త్రీ - గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణం కలది.
- గోవిందరూపిణీ - విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది.
శ్లోకం 64
<small>మార్చు</small>- సంహారిణీ - ప్రళయకాలంలో సమస్త వస్తుజీవజాలాన్ని తనలోనికి ఉపసంహరణ గావించి, లీనము చేసుకొనునది.
- రుద్రరూపా - రుద్రుని యొక్క రూపు దాల్చింది.
- తిరోధానకరీ - మఱుగు పరచుటను చేయునది.
- ఈశ్వరీ - ఈశ్వరుని యొక్క శక్తిరూపములో ఉండునది.
- సదాశివా - సదాశివ స్వరూపిణి.
- అనుగ్రహదా - అనుగ్రహమును ఇచ్చునది.
- పంచకృత్య పరాయణా - సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే అయిదు కృత్యముల యందు ఆసక్తి కలది.
శ్లోకం 65
<small>మార్చు</small>- భానుమండల మధ్యస్థా - సూర్య మండలములో కేంద్రము వద్ద ఉండునది.
- భైరవీ - భైరవీ స్వరూపిణి.
- భగమాలినీ - వెలుగుతూ గమనము చేయువారిచే హారముగా అగుపించునది.
- పద్మాసనా - పద్మమును నెలవుగా కలిగినది.
- భగవతీ - భగశబ్ద స్వరూపిణి.
- పద్మనాభ సహోదరీ - విష్ణుమూర్తి యొక్క సహోదరి.
శ్లోకం 66
<small>మార్చు</small>- ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళి - తెరువబడుటతోను, మూయబడుటతోను పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలది.
- సహస్రశీర్షవదనా - వెయ్యి లేదా అనంతమైన శిరస్సులతో, ముఖములు కలది.
- సహస్రాక్షీ - వెయ్యి లేదా అనంతమైన కన్నులు కలది
- సహస్రపాత్ - అనంతమైన పాదములు కలది.
శ్లోకం 67
<small>మార్చు</small>- ఆ బ్రహ్మకీటజననీ - బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి.
- వర్ణాశ్రమ విధాయినీ - వర్ణములను, ఆశ్రమములను ఏర్పాటు చేయునది.
- నిజాజ్ఞారూపనిగమా - తనయొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు అయినది.
- పుణ్యాపుణ్యఫలప్రదా - మంచిపనులకు, చెడ్డపనులను వాటి వాటికి తగిన ఫలములను చక్కగా ఇచ్చునది.
శ్లోకం 68
<small>మార్చు</small>- శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా - వేదములనెడు స్త్రీలయొక్క పాపిటలను, సిందూరము ధరించునట్లు చేసిఅన్ పాదపద్మము యొక్క ధూళిని కలిగినది.
- సకలాగమ సందోహశుక్తి సంపుటమౌక్తికా - అన్ని ఆగమ శాస్త్రములనెడు ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము.
శ్లోకం 69
<small>మార్చు</small>- పురుషార్థప్రదా - పురుషునకు కావలసిన ప్రయోజనములను చక్కగా ఇచ్చునది.
- పూర్ణా - పూర్ణురాలు.
- భోగినీ - భోగములను అనుభవించునది లేదా భోగములను ఇచ్చునది.
- భువనేశ్వరీ - చతుర్దశ భువనములకు అధినాథురాలు.
- అంబికా - తల్లి.
- అనాదినిధనా - ఆది, అంతము లేనిది.
- హరిబ్రహ్మేంద్ర సేవితా - విష్ణువు చేత, బ్రహ్మ చేత, ఇంద్రుని చేత సేవింపబడునది.
శ్లోకం 70
<small>మార్చు</small>- నారాయణీ - నారాయణత్వ లక్షణము గలది.
- నాదరూపా - నాదము యొక్క రూపము అయినది.
- నామరూపవివర్జితా - పేరు, ఆకారము లేనిది
- హ్రీంకారీ - హ్రీంకార స్వరూపిణి.
- హ్రీమతీ - లజ్జాసూచిత బీజాక్షర రూపిణి.
- హృద్యా - హృదయమునకు ఆనందము అయినది.
- హేయోపాదేయవర్జితా - విడువదగినది, గ్రహింపదగినది, లేనిది.