అటమటించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సకర్మక క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వంచించి హరించుట/ అపహరించు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- 1. దుఃఖించు. 2. మోసపుచ్చు. 3. దొంగిలించు. 4. ధిక్కరించు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- చలించు. "వ. మెఱుఁగుతుమ్మెదవన్నె పెన్నెఱుల నటమటించు నెన్నడుముల విన్ను వెన్నుదన్ని." స్వా. ౫, ఆ.
- స.క్రి. 1. వంచించు; "గీ. యతిననుచు వేషభాషల నటమటించి, పొంచి తఱివేచి కన్నియ గొంచునరిగె." విజ. ౩, ఆ.
- 2. అపహరించు. "క. తమ్ముడవని నిన్నేగతి, నమ్మంగావచ్చు నిట్లు నాకొసగక ర, త్నమ్మటమటించుకొంటివి, పొమ్మిఁక నీతోడిపొత్తు పొరపొచ్చెమగున్." వి, పు. ౯, ఆ.
- "తమ్ముడవని నిన్నేగతి నమ్మంగా వచ్చునిట్లు నాకొసగక ర త్నమ్మటమటించుకొంటివి." Vish.vi.307.
- ధిక్కరించు, మించు; (ఔపమ్యమును దెలుపును.) ...... "వ. మెఱుంగుఁజన్నులఁ గన్నెతమ్మి మొగ్గలవన్నె నటమటించి పెన్నెఱుల మెఱుంగుఁ దుమ్మెదవన్నెఁ దటమటించి నెన్నడుముల విన్ను వెన్నుదన్ని." స్వా.౫,ఆ. ౧౦౧.