వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. మధ్యమపురుష బహువచనమునందు ప్రార్ధనాద్యర్ధమున ఎ,అ, అయ్య మొదలగువానివలె క్రియల కనుప్రయుక్తము. ఇది యనుప్రయుక్తమైనపుడు ఎదాదు లనుప్రయుక్తమైనపుడు వలె వ్యతిరేకరూపమువచ్చును. ఒక్కొకప్పుడు వ్యతిరేకరూపమందలి 'అరు' లోపించుటయుఁ గలదు. ప్రక్రియ: చేయుడు అనుదానికి అయ్య అనుప్రయుక్తమగునపుడు చేయరయ్య అనురూపమగును. అట్లే చేయుఁడు+అండి = చేయరండి అను రూపము సిద్ధించును. దానిపైని అయ్య, అమ్మ, ఓయి అనుప్రయుక్త మగుటయుఁ గలదు. చేయరండయ్య, చేయండయ్య, చేయరండమ్మ, చేయండమ్మ, చేయరండోయి, చేయండోయి మొ. చేయరండి అనఁగా చేసెదరా! చేయరా! అను నర్థమును గలదు. ఇట్లే ప్రార్ధనాద్యర్ధమున ఏకవచనము 'రా' వచ్చును. 'రా' వచ్చినప్పుడు వ్యతిరేకరూపము వచ్చును. వినవురా అనియు 'వు' లోపించినచో వినరా అనియు నగును. చేయుఁడి, చేయుండి అనువాని భ్రష్టరూపమనియుఁ జెప్పుకొనవచ్చును. కొన్ని చోట్ల నేఁటికిని వాడుకలోఁగూడ చేయుండి, చూడుండి అను రూపములు గలవు; 2. వాక్య మధ్యమునఁ గాని వాక్యాంతమునఁగాని మధ్యమ పురుష బహువచనమున ఎదుటివారి గౌరవమును సూచించుటకు ఊతపదముగ ననుప్రయుక్తము. ఏకవచనమున 'రా' యును, బహువచనమున 'అండి' అనునదియు ఉపయుక్తములు. "ఏమిరా, ఏమండి, ఏమండోయి, ఏమండమ్మా, ఈ సంగతి వినరండి, ఇది న్యాయమా అండి; నిన్ననురా అది జరిగినది; నిన్నానండి అది జరిగినది." ఏకవచనమయిన 'రా' వలెనే బహువచనమయిన 'రండి' అయినది యనుప్రయక్తము కాఁగా ఉచ్చారణయందు రేఫము లోపించుటచే 'అండి' యను రూపము ఏర్పడియుండుననియు అనవచ్చును.

  1. దే.వి..... నీరు కాఁచుట కుపయోగించు లోహ పాత్రము./ అండా
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అండి&oldid=884730" నుండి వెలికితీశారు