బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, and prepo. పైన, మీద, మీదికి, పైకి, నిండా, తీరా.

 • the porcupine bristled up ముండ్ల పంది తన శరీరము యొక్క ముండ్లనంతా జలపరించుకొన్నది, నిక్కపొడుచుకొన్నది.
 • before the sun was up సూర్యోదయాత్పూర్వము.
 • these plants are quickly up యీ చెట్లు శ్రీఘ్రములో పెరుగుతవి.
 • from his youth up చిన్ననాటనుంచి, బాల్యాత్ర్పభృతి.
 • when his blood was up వాడికి కోపము వచ్చినప్పుడు,వాడు రేగినప్పుడు.
 • his credit is up వాడి యందు నమ్మకము తప్పినది.
 • he is awake but he is not yet up నిద్ర మేలుకొన్నాడు గాని యింకా పడక విడిచి లేవలేదు.
 • he is up పడక విడిచి లేచివున్నాడు.
 • he was up all night వాడు రాత్రి అంతా పండుకోలేదు.
 • the game is up with him వాడి పని తీరినది, వాడు చెడిపోయినాడు.
 • they are always upearly వాండ్లు యెప్పుడూ పెందలకాడే లేస్తారు.
 • is your father up ? నీ తండ్రి లేచినాడా, పడక విడిచి యివతలికి వచ్చినాడా.
 • the water was up to the waist మొలమట్టు నీళ్లుగా వుండినది.
 • he is up to any thing పాట్ల మారిగా వున్నాడు, కడగండ్లుపడ్డవాడుగా వున్నాడు.
 • up to that day ఆ దినము వరకు.
 • up to this time యిదివరకు.
 • he isup stairs మిద్దె మీద వున్నాడు.
 • up with the tent డేరా వేయండి.
 • up with the flad జండా వేయి.
 • up with it దాన్ని పైకి తొయ్యి.
 • he came up to the door యింటి వద్దికి వచ్చినాడు, యిల్లు చేరినాడు.
 • come up పైకిరా.
 • to eat up తినివేసుట.
 • he drew up an account వొక లెక్క సిద్ధపరచినాడు.
 • fill the jar up ఆ జాడిని నించు.
 • when he got upవాడు లేచేటప్పటికి.
 • he gave up the business ఆ పనిని మానుకొన్నాడు.
 • he is goneup the country నాటుపురానికి పోయివున్నాడు.
 • he is gone up పైకి పోయి వున్నాడు.
 • he went up the hill కొండ మీదికి యెక్కినాడు.
 • he went up to them వాండ్ల దగ్గిరికిపోయినాడు.
 • he laid up the corn ధాన్యమును కట్టిపెట్టినాడు, చేర్చిపెట్టినాడు.
 • they made up a story వొక కథను కట్టి విడిచినారు, కల్పించినారు.
 • they made up the quarrel సమాధానపడ్డారు, రాజి అయినారు.
 • I added some wood to make up a load వొక మోపు కావడానికి కొన్ని కట్టెలను చేర్చినాను.
 • at last they made up the affair తుదకు రాజి అయినారు.
 • pack them up వాటిని మూటలుగా కట్టు.
 • to pluck up or pull up పీకి వేసుట, పెరుకుట.
 • they plucked up courage and came forward ధైర్యము తెచ్చుకొని బయిలుదేరినారు.
 • to shut up మూశివేసుట.
 • he shut up the gate ఆ వాకిలికి అడ్డముగా గోడపెట్టి వేసినాడు.
 • he shut up the shop అంగడి యెత్తివేసినాడు.
 • the water coming from the river shut up the road ఆ యేట్లో నీళ్ళు వచ్చినందున ఆ దారి మూత పడిపోయినది.
 • to sum up వెరశికట్టుట.
 • speak up బిగ్గరగా మాట్లాడు.
 • to tear up చించివేసుట, పీకివేసుట.
 • she threw the ball up or tossed it up ఆ చెండు యెగరవేసినాడు.
 • he tied up the cow ఆవును కట్టినాడు.
 • he vomited up కక్కినాడు, వమనము చేసినాడు.
 • he was walking up and down ఇటు అటు తిరుగుతూవుండినాడు.
 • the garden is all up and down ఆ తోట అంతా మిట్టలు పల్లాలుగా వున్నది.
 • his writing is all up and down వాడు కొక్కిరి బిక్కిరిగా వ్రాస్తాడు.
 • the ups and downs of life హానివృద్ధులు, మంచిచెడు, కీడుమేలు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=up&oldid=948757" నుండి వెలికితీశారు