true
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, నిజమైన, సత్యమైన, యథార్థమైన, నిబద్ధియైన, నిశ్చయమైన, వాస్తవ్యమైన.
- he is a true poet వాడు సాక్షాత్ కవి.
- those of the true faith సన్మతస్థులైన.
- this is a truesaying ఇది సద్వాక్యము.
- this is a true pearl, the other is false ఇది మంచిముత్యము అది చిప్ప ముత్యము.
- this is true gold, the other is not ఇది అచ్చమైన బంగారు అది కాకిబంగారు.
- this was true generosity, the other was mere waste ఇది నిజమైన దాతృత్వము అది పాడులో వేయడము, ఇది సద్వినియోగము అది దుర్వినియోగము.
- honest పెద్దమనిషియైన.
- these are the true men and those are the rogues వీండ్లు పెద్దమనుష్యులు వాండ్లు దొంగలు.
- she was ever true to him, అది ఆయన వద్ద యెప్పుడున్ను సత్యముగా నడుచుకొంటున్నది, అనగా అది పతివ్రతగావున్నది.
- exact సరియైన.
- this level is not true యీ నీరు మట్టపలక కరారైనది కాదు, దీనితో నీరు మట్టము కట్టితే సరిగ్గా వుండేది లేదు.
- these scales are not true యీ త్రాసు సరిగ్గా వుండలేదు అనగా యీ త్రాసులో వారడి వున్నది.
- his words were made true వాడి మాటలు నిజమైనవి.
- he has spoken to them; true ! but they will not hear వాడు వాండ్లతో మాట్లాడినదివాస్తవ్యమేగాని వాండ్లు వొప్పరు.
- they are his brothers, true ! but will they help him ? వాండ్లు వాని తోడ బుట్టినవాండ్లయినది నిజమే గాని వానికి వాండ్లు సహాయముచేతురా.
- a true copy యథామాతృకగా వ్రాసిన ప్రతి.
- he is a true born Englishman వాడు నిజమైన ఇంగ్లిషువాడు.
- In astronomy the true place of a planet స్ఫుటగ్రహము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).