strain
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to purify by filtration వడికట్టుట, వడియకట్టుట, వస్త్రఘాలితము చేసుట.
- to strain water from impuritiesనీళ్ళను వడికట్టుట.
- to strain off the water from boiled rice అన్నము వార్చుట.
- rice that is strained till dry వడియవేసినబియ్యము, వార్చిన అన్నము.
- he strained the rope till it broke ఆ దారము తెగేటట్టుగా బలముగా పట్టిలాగినాడు.
- he strained the eyes to read books written on palm leaves తాటాకు పుస్తకాలు చదవడము కంటికి వుపద్రవముగా వుంటున్నది.
- we strained our eyes to see it అది కంటికి అగుపడి అగుపడకుండా పోయినది.
- my eyes were strained in reading this దీన్ని చదవడమువల్ల నా కంటికి వుపద్రవము వచ్చినది.
- he strained his hand వాని చెయ్యి బెణికినది.
- he had strained his neck వాని మెడ యిరుకు పట్టుకొన్నది.
- he strained his voice అరిచినందున వాని గొంతు పగిలినది.
- వాని గొంతు కమ్మినదివాని గొంతు రాసినది.
- he strained his lungs నిండా అరిచినాడు.
- the judge should never strain the law to gratify himself న్యాయాధిపతిగా వుండేవాడుతన యిష్టప్రకారము చేయడమునకై చట్టమునకు అపార్థము చేయరాదు.
- this is a strained meaning of the word యిది సహజమైన అర్దము కాదు, యిది నిండపీకులాడి చేసిన అర్థము.
క్రియ, నామవాచకం, బలవంతము చేసుట, తొందర పడుట.
- he strained to the utmost to get over the difficulty యీ తొందరను సాధించడమునకై తన యావచ్ఛక్తిని చూచినాడు.
- he strained to speak but he could not వాడు యెంతోతొందరపడి మాట్లాడబోతే వాడికి మాట్లాడ కూడలేదు.
- to strain at stool తినుకుట,ముక్కుట.
- Strain, n. s.
- an injury by too much violence బెణుకు, యిలుకు.
- he spoke in a flattering strain స్త్రోత్రరసముగా మాట్లాడినాడు.
- race; generation వంశము.
- those of the royal strain రాజవంశస్థులు.
- disposition, manner రసము.
- song; note; sound గానము, స్వరము.
- turn; tendency భావము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).