యూదుల ఆత్మజ్ఞానసంపద. ఇది మధ్యయుగాల నాటి జ్ఞానమని అంటారు. (కబాలా, కాబలా మొదలైన విధాలుగా పలుకుతారు.) యూదుల పారమార్థిక విజ్ఞానంలో మూడు స్థాయిలు ఉన్నాయి. మొదటిది Pentateuch (పెంటటూక్ అని ఉచ్చారణ.) ఇందులో ఐదు పుస్తకాలు ఉన్నాయి. కబాలా జ్ఞానం పట్ల విశ్వాసం ఉన్నవారందరూ చదివి పాటించే జ్ఞానమార్గం. సాక్షాత్తు దైవం నుంచే ఈ జ్ఞానం లభించిందనీ, మోజెస్ ఈ జ్ఞానాన్ని గ్రంథస్థం చేశాడనీ ఐతిహ్యం. రెండవది- almud (పురోహితవర్గం చదివే పుస్తకాలు). మూడవది- కబాలా. సాధనలో ఒక ఉన్నత స్థాయిని చేరుకొన్నవారికే ఈ రహస్యజ్ఞానాన్ని అందిస్తారు. కబాలా జ్ఞానంలో ప్రతి ఒక్క పదం పవిత్రమైందనీ, అది అర్థం చేసుకొనవలసిందే గానీ, అనువదించదగింది కాదనీ అంటారు. కబాలా గురించి చాలా వ్యాఖ్యానగ్రంథాలు వచ్చాయి గానీ అందులో ఏ ఒక్కటీ సర్వజనామోదం పొందలేదు.