బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, యత్నము, ఉద్దేశ్యము, యోచన, అభిప్రాయము, పని.

 • he went therefor purpose of bathing స్నానము చేయడానకై అక్కడికి పోయినాడు.
 • he diverted the money from its right purpose ఆ రూకలను దుర్వినియోగపరచినాడు.
 • he altered his purposeవాడికి వేరే ఆలోచన పుట్టినది.
 • to buy the house is not my purpose ఆ యింటిని కొనవలెననేఅభిప్రాయము నాకు లేదు.
 • the letter was to this purpose that many people were already dead and that the war was going on &c.
 • ఆ జాబు యొక్కముఖ్యమైన తాత్పర్యమేమంటే యిదివరకే చాలా మంది చచ్చినారనిన్ని యింకా యుద్ధముజరుగుతూ వున్నదనిన్ని మొదలైన.
 • he went there with the purpose of buying a horse వొక గుర్రము కొనే నిమిత్తము అక్కడికి పోయినాడు.
 • for that purpose అందుకు, అందునిమిత్తము.
 • he turned it to some purpose దాన్ని సఫలము చేసినాడు, వుపయోగపరచినాడు.
 • he wrote so as to suit his own purpose తన పనికి అనుగుణ్యముగా వ్రాసినాడు.
 • to what purpose యెందుకు, యెందు నిమిత్తము.
 • he learned the language to good purpose వాడుఆ భాషనునేర్చుకొన్నది, సఫలమైనది, మంచిదైనది.
 • he then spoke to the followingpurpose తర్వాత వాడు చెప్పినదేమంటే.
 • It is to no purpose that I weep నేను యేడవడమువ్యర్థము, నిష్ఫలము.
 • he did it on purpose దాన్ని కావలెనని చేసినాడు, ప్రయత్నపూర్వకముగా చేసినాడు, బుద్ధిపూర్వకముగా చేసినాడు.
 • to all intents and purposes అన్నివిధాల.

క్రియ, విశేషణం, యత్నము చేసుట, యోచించుట, ఉద్దేశించుట.

 • do you purpose going there అక్కడికి పోవలెనని యత్నముగా వున్నావా.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=purpose&oldid=941702" నుండి వెలికితీశారు