బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

 • (file)

  క్రియ, నామవాచకం, to yield or to sink.

  • లోబడుట.
  • వంగుట, కుంగుట.
  • give back తొలగివుండండి.
  • he gave into their plot వాండ్ల కుట్ర లో వీడున్ను కలిసినాడు.
  • he gave into their doctrines వాండ్ల మతము లో పడ్డాడు.

  క్రియ, విశేషణం, యిచ్చుట.

  • he gave no reason for his conduct వాడు చేసిన దానికి సమాధానము చెప్పలేదు.
  • he gave them abuseవాండ్లను తిట్టినాడు.
  • he gave an account of this placeయీ స్థలము ను వర్ణించినాడు.
  • he gave himself airs అహంకరించినాడు.
  • he gave no answer వాడు వుత్తరము చెప్పలేదు.
  • exercise gives appetiteతిరగడముచేత ఆకలిపుట్టినది.
  • he gave bail for her ఆమెకుపూటబడ్డాడు, ఆమెకు జమీను వుండినాడు.
  • to give battle యుద్ధము చేసుట.
  • after she gave birth to suspicion యిందువల్ల సందేహము పుట్టినది.
  • to give a blow దెబ్బ కొట్టుట.
  • will you give mea call to-morrow రేపు మా యింటికి రా.
  • he gave his command ఆజ్ఞాపించెను.
  • give him my compliments నా సలాము చెప్పు.
  • he gave consent to itదానికి సమ్మతించినాడు.
  • this gave him courage యిందుచేత వాడికిధైర్యము వచ్చినది.
  • he gives no credit to these stories ఆ పిచ్చిమాటలనునమ్మడు.
  • he gave a deposition in writing వాజ్మూలము వ్రాయించినాడు.
  • to give a disease రోగమునుతగిలించుట.
  • this gave them the disease యిందుచేత వాండ్లకు రోగము వచ్చినది.
  • he gave ear to them వాండ్లు చెప్పినదాన్నిఆలకించినాడు.
  • grinding gives an edge to the razor నూరడముచేత కత్తి కి పదును వస్తున్నది.
  • he gave them to the edge of the sword వాండ్లను కత్తిపాలు చేసినాడు.
  • he gave her an embrace దాన్నిలకౌగిలించుకున్నాడు.
  • he gave them employ వాండ్లను పనిలోపెట్టినాడు.
  • he gave evidence సాక్షి చెప్పినాడు.
  • give an example of this rule యీ సూత్రము నకు ఉదాహరణ చెప్పు.
  • he gave me a fallనన్ను పడద్రోసినాడు.
  • they gave him a flogging వాన్ని కొట్టినారు.
  • this gives ground for supsicion యిది సందేహానికి ఆస్పదమౌతున్నది.
  • he gave them an invitation వాండ్లకు విందు చేసినాడు.
  • he gave her a kiss దాన్ని ముద్దు పెట్టుకున్నాడు.
  • the horse gave a leap ఆ గుర్రము దుమికినది, గంతులువేసినది.
  • to give leave సెలవు యిచ్చుట.
  • they gave him this name వాడికి యీ పేరు పెట్టినారు.
  • he gave a promise for two hundred rupees యిన్నూరు రూపాయలు యిస్తానన్నాడు.
  • to give punishment శిక్షించుట.
  • this medicine gave relief యీ మందుచేత గుణముకలిగినది.
  • the judge gave sentence న్యాయాధిపతితీర్పు చెప్పినాడు.
  • to give a shout బొబ్బలు పెట్టుట, అరుచుట.
  • she gave a sigh అది నిట్టూర్పు విడిచినది.
  • he gave them the silp వాండ్ల వద్ద నుంచి తప్పించుకొన్నాడు.
  • this gives no sound యిది మోగదు,వాగదు.
  • he gave his statement in writingచెప్పవలసిన దాన్ని వ్రాసి యిచ్చినాడు.
  • to give suck చన్నిచ్చుట.
  • to give tongue అరుచుట, కూసుట.
  • do not give him trouble వాన్ని తొందరపెట్టక.
  • to give vant యెడమిచ్చుట.
  • he gave vent to his feelings మనసులోవుండే దాన్ని వెళ్లగక్కినాడు.
  • he gave vent to anger ఆగ్రహపడ్డాడు.
  • the bridge gave way ఆ వారధి పగిలిపోయినది.
  • they gave way before him వాడికి తొలిగినారు.
  • the cloth or paper gave way ఆ గుడ్డగానికాగితముగాని చినిగినది.
  • the troops did not give way సేన వెనకతీయలేదు.
  • the rope gave way తాడు తెగిపోయినది, పూడినది.
  • his health gave away వాడికి వొళ్లు కుదురులేదు.
  • he gleaned upon the table and it gave way మేజమీద ఆనుకొన్నందున అదివొరిగినది.
  • by reason of the rain the floor gave wayవానవిళ్లు నిలిచినందున తళవరస అనగా పరిచిన రాళ్లు కుంగినది,దిగబడ్డది.
  • the nail gave way ఆ చీల వూడినది.
  • they gave way to ill will కార్పణ్యమును వహించినారు.
  • he gave me his word for it అందుకు నేను వున్నానన్నాడు.
  • Pharasesgive me a man who would act thus యిట్లా చేసేవాడెవడో చూపు.
  • give me to know the truth నాకు నిజమును తెలియచెయ్యి.
  • I have given him to know that he must pay నీవు చెల్లించవలసినదనివాడికి తెలియచేసినాను.
  • Four villages at 200 men each gives 800 గ్రామమువొకటింటికి యిన్నూరు మంది చొప్పున నాలుగు వూళ్లకు యెనమన్నూరుమంది అవుతున్నారు.
  • with prepositions to give away యిచ్చివేసుట.
  • the flower gives forth it s smell ఆ పుష్పము వాసన కొట్టుతున్నది.
  • the diamond gives forth light ఆ వజ్రము మెరుస్తున్నది.
  • he gave out or supplied rice to the army వాడు బియ్యమును దండుకు వేసినాడు.
  • he gave out or cicrulated that the king was dead రాజు చచ్చినాడనివదంతిని పుట్టించినాడు.
  • he gave over the business ఆ పనినిమానుకున్నాడు.
  • the doctor gave the patient over వైద్యుడు,ఆ రోగిని చెయ్యి విడిచిపెట్టినాడు.
  • he gave up the money to the robbers ఆ రూకలను దొంగలకు ధారపోసినాడు .
  • he gave up his life ప్రాణమును విడిచినాడు.
  • at last he gave up the business తుదకు ఆ పనిని మానుకొన్నాడు.
  • he gave up the idea ఆశను వదులుకొన్నాడు.
  • he gave himself up for last వాడు నిరాశ చేసుకొన్నాడు.
  • he gave the money up for lost ఆ రూకలు పోయినదానితో జమగా యెంచుకొన్నాడు.
  • she gave herself up to tears అది వూరికే యేడవసాగినది.
  • he gave himself up to study చదువుమీద పడ్డాడు.

  మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=give&oldid=932848" నుండి వెలికితీశారు