బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, అవుట, కలుగుట, యిది అనేకచోట్ల.

 • to be or tobecome అని అర్ధమిస్తున్నది యేలాగంటే.
 • when I got home యింటికి చేరినప్పుడు when I got there నేను అక్కడికిచేరేటప్పటికి before I got through the letter జాబు కడవెళ్ళచదవక మునుపే.
 • he got through the difficulty ఆ కష్టమునుదాటినాడు, గడిచినాడు, వాడికి కష్టములు తీరినది.
 • he got through the book ఆ పుస్తకముయను కడవెళ్లా చదివినాడు.
 • how did youget throgh ? నీకు యెట్లా నివర్తి అయినది.
 • he got throthe hole కన్నముగుండా చొరబడినాడు.
 • he got through the pass by sunnet అస్తమానానికి కనమను దాటినాడు.
 • get along అవతలికిపో.
 • he is getting well వాడికి వొళ్లు కుదురుముఖముగా వున్నది.
 • how are you getting on ? నీవు యెట్లా వున్నావు.
 • he is now gettingon very well వాడికి యిప్పుడు బాగా జరుగుతున్నది.
 • it got black నల్లబడ్డది.
 • it got dry యెండినది.
 • the rope got entangled or was entangled ఆ దారము చిక్కుపడి వుండినది.
 • it got wet తడిసినది.
 • he got drunk వాడికి మత్తు యెక్కినది.
 • it got hot కాగినది.
 • it got burnt కాలిపోయినది.
 • it got spoilt చెడిపోయినది.
 • he got shot వాడికి గుండు దెబ్బ తగిలినది.
 • it got well వాడికి వొళ్లు కుదిరినది.
 • he got sick అశక్తపడ్డాడు.
 • he got freeవిముక్తుడైనాడు.
 • వాడి తొందర తీరినది.
 • he got free of the debt ఋణవిముక్తుడైనాడు.
 • I got quit of them soon వాండ్లనుత్వరగా పరిహరిస్తిని.
 • get you gone లేచిపో.
 • my horse got loose and ran away నా గుర్రము విడిపించుకొని పరుగెత్తిపోయెను.
 • we got among them మేము వాండ్లలో పోయిచేరినాము.
 • I cannot get at it అది నాకు అందదు.
 • the rope got between దారము నడుమ చిక్కుకొన్నది.
 • to get down దిగుట.
 • he god down the hill కొండ దిగినాడు.
 • he got down from the horse గుర్రము దిగినాడు.
 • the bird got from him పక్షి వాడి దగ్గరనుంచి తప్పించుకొనిపోయినది.
 • the dog got in his way కుక్క అతనికి అడ్డము వచ్చినది.
 • the wind gets in by this crevice యీ బీటిక గుండా గాలిలోపలికి వస్తున్నది.
 • how did this letter get into this book ?యీ పుస్తకములోకి యీ జాబు యేట్లా వచ్చినది.
 • It got into his head that I was his enemy తనకు నేను శత్రువు అనుకొన్నాడు.
 • he got into bad habits వాడికి దుర్వాడికిలు పట్టుబడ్డవి.
 • he got into the well బావిలో దిగినాడు.
 • he got into the carriageబండి యెక్కినాడు.
 • he got into trouble తొందరలో చిక్కుకొన్నాడు.
 • the liquor got into his head సారాయి అతని తలకెక్కినది, అనగా మైకము వచ్చినది.
 • the water got into the house నీళ్లు యింట్లోకిచొరబడ్డది.
 • they got into a dispute వాండ్లకు వ్యాజ్యమువచ్చినది.
 • one was punished and two got off వొకడికిశిక్ష అయినది, యిద్దరికి విడుదల అయినది.
 • For want of witness he gotoff clear సాక్షులు లేనందున తప్పినారు.
 • they got off the wallగోడ యెక్కి దిగినారు.
 • you cannot getoff without doing soఅట్లా చేయకుంటే నీకు నివృత్తిలేదు.
 • this is a mere get off యిదివట్టి వ్యాజ్యము, వట్టి నెపము.
 • he must pay the money ; there is no get off వాడికి వేరే విధి లేదు, రూకలు చెల్లించవలెను.
 • he got on his horseగుర్రమును యెక్కినాడు.
 • I cannot get on without this యిది లేకనాకు గడవదు.
 • they got over the wall and plundered the houseగోడ యెక్కి దుమికి యింటిని కొల్లబెట్టినారు.
 • that horse gets over the the ground well ఆ గుర్రము బాగా నడుస్తున్నది.
 • he got over the river by sun set అస్తమానానికి యేటిని దాటినాడు.
 • I got out of the house with difficulty ఆ యింట్లోనుంచి బయిటికివచ్చేటప్పటికి బహుతొందరైనది.
 • to escape the police he got out of the town పోలీసువాండ్లకు చిక్కకుండ పట్నము విడిచిపోయినాడు.
 • the news got out ఆ సమాచారము బయటపడ్డది.
 • get out of the wayతొలుగు, దోవతి.
 • he got to sleep soon వాడికి నిద్రపట్టినది.
 • he got under the table మేజ కిందికి చొరబడ్డాడు.
 • he got up into the tree చెట్టెక్కినాడు.
 • he got up లేచినాడు, నిద్రలేచినాడు.
 • the sun got up సూర్యుడు ఉదయించెను.
 • It is added to passives; thus : he got killed or he was killed చంపబడ్డాడు.
 • he got hurt వాడికి గాయము తగిలినది.

క్రియ, విశేషణం, సంపాదించుట, పొందుట.

 • I got it అది నాకు దొరికినది.
 • the horse has got white legs ఆ గుర్రానికి కాళ్లు తెల్లగా వున్నవి.
 • he got a good name వాడు మంచిపేరు యెత్తుకున్నాడు.
 • he got large profits by it దాని చేత వాడు మంచి లాభమును పొందినాడు.
 • have you got a knife నీ వద్ద కత్తి వున్నదా.
 • he has got a knifeవాడి వద్ద వొక కత్తి వున్నది.
 • I have got no money నావద్ద రూకలులేవు.
 • he has got no sence వాడికి తెలివిలేదు.
 • she has got the small pox దానికి అమ్మవారు పోసివున్నది.
 • she has a sonదానికి కొడుకు పుట్టినాడు.
 • she has got a son దానికి కొడుకువొక కొడుకు వున్నాడు.
 • I got him an employmentవానికి పని యిప్పించినాను.
 • I got them a share వాండ్లకు వొకభాగమును కలగచేసినాను.
 • I got it by heart అది నాకు ముక్యస్థముగావున్నది.
 • I got it leave to go పోవడానికి నాకు శలవు దొరికినది.
 • get those boxes down ఆ పెట్టెలను దించు.
 • they have got hold of the thief దొంగను పట్టుకొన్నారు.
 • he got hold of the propertyఆ యాస్తిని తన స్వాధీనము చేసుకొన్నాడు.
 • I cannot get in a wordనా మాటను చొరనియ్యరు.
 • he got me into this trouble నన్నుయీ తొందరలో తగిలించినాడు.
 • he got the things into the boxఆ పెట్టెలో వాటిని యిమిడ్చినాడు.
 • he got the lands into his own hands ఆ నేలను స్వాధీనము చేసుకొన్నాడు.
 • he got them into the way of doing it దాన్ని చేసేదారిని వాండ్లకు చూపినాడు.
 • he got the thief off ఆ దొంగకు శిక్షలేక తప్పించినాడు.
 • they got off his coat వాని చొక్కాయ తీసివేసినారు.
 • he got on his coat చొక్కాయ వేసుకున్నాడు.
 • I got him out of his troublesవాడి తొందర్లను నివృత్తి చేస్తిని.
 • I got him out of the wayవాన్ని తొలగించినాను.
 • to get out బయిటికి తెచ్చుట.
 • he got the prisoners out ఖైదీలను బయిటికి తీసుకునివచ్చినాడు.
 • he has got over his troublesవాడి తొందర్లు తీరినవి.
 • he got them over the river వాండ్లనుఏటిని దాటించినాడు.
 • he got the witness over ఆ సాక్షులను లోపరుచుకున్నాడు.
 • he got them ready వాటిని సిద్ధము చేసినాడు.
 • to get rid of నివర్తిచేసుకోనుట.
 • he got rid of the debt అప్పును నివర్తి చేసుకున్నాడు.
 • to get rid of the muskitos he smoked the house దోమలు లేకుండాచేయడానికి యింట్లో పొగవేసినాడు.
 • he got up the books పుస్తకములనుపైకెత్తినాడు.
 • he got up a complaint against them వాండ్లమీదఫిర్యాదు చేయించినాడు.
 • he got up the house very well ఆ యింటినిబాగా శృంగారించినాడు.
 • he gets twenty rupees per month వాడు నెలకుయిరువై రూపాయలు దొరుకుతున్నవి, వస్తున్నవి.
 • where will you get he the money to pay for it ? దానికి చెల్లించడానికినీకు రూకలు యెక్కడ చిక్కును.
 • get me that book ఆ పుస్తకమునుయిట్లాతే, ఆ పుస్తకమును తీసుకురా.
 • I have got an appetiteనాకు ఆకలిగా వున్నది.
 • he got a beating వాడికి దెబ్బలు తగిలినవి,he has got a cold వాడికి జలుబు చేసి వున్నది.
 • here we get the breeze యిక్కడ గాలి వస్తున్నది.
 • he got the rope entagled ఆ దారమును చిక్కువేసినాడు.
 • he got possession of the house ఆ యింటిని స్వాధీనము చేసుకొన్నాడు.
 • when he got strength after his fever జ్వరము విడిచి వాడిక సత్తువ వచ్చినప్పుడు.
 • he got her with child దాని వేకటి చేసినాడు, దానికి కడుపు యిచ్చినాడు.
 • he got two children by her.
 • అది వాడికి యిద్దరు బిడ్డలను కన్నది.
 • It is added to passives : thus he got her marriedదానికి పెండ్లి చేయించినాడు.
 • he got them sent వాండ్లనుపంపించినాడు.
 • Get has a causal sense-thus, he got it builtదాన్ని కట్టించినాడు.
 • I will get it done దాన్ని చేయిస్తాను.
 • he got the tents put upon the elephant డేరాలను యేనుగమీదకుయెక్కించినాను.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=get&oldid=932779" నుండి వెలికితీశారు