బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, (French expose) విశదము, వివరము, వయనము, బట్టబయిలు.

  • this paper is a complete expose of their conduct వాండ్ల నడక యావత్తు యీ కాగితముచేత బట్టబయలౌతున్నది.

క్రియ, విశేషణం, బయలుపరుచుట, బయటపెట్టుట, చూపుట, తెరిచి చూపుట,తెరచిపెట్టుట.

  • the Hindu women expose their faces, but the Musulman women do not హిందు స్త్రీలు ముఖమును బయట అగుపరుస్తారు తురక స్త్రీలు అగుపరచరు.
  • he exposed his head to the rian వానలో తల తెరచి పెట్టుకొనివుండినాడు.
  • she exposed the grain to the sun అది ధ్యానమును యెండబోసినది.
  • the Malayala women expose thier breasts మళయాళ స్త్రీలు రొమ్ముల మీద బట్ట వేయరు.
  • In china some people expose thier children సీనా దేశములోకొందరు తమ శిశువులను వీధిలో పారవేస్తారు.
  • they did not burry the body, they exposed it పీనుగను పూడ్చకుండా కుక్కల నక్కల పాలుచేసినారు.
  • this letter exposed him shamefully యీ జాబువల్ల వాడి మానము బయటపడ్డది.
  • you are now going to speak do not expose yourself నీవు అతనితో మాట్లాడపోతావునీ మానము కాపాడుకో.
  • In fever you ought not to expose your feet జ్వరములోకాళ్లను తెరుచుకొని వుండరాదు.
  • If you do this I will expose you నీవుదీన్ని చేస్తివా నిన్ను బయటవేస్తాను.
  • he exposed himself greatly in this యిందులో వాడి మానము బట్టబయలైనది.
  • while you are taking in this foolish wayyou are merely exposing your wife నీవు యిట్లా పిచ్చితనముగా మాట్లాడడములో నీ పెండ్లాన్ని యీడ్చి బయటవేయడమే కాని వేరే యేమి లేదు.
  • In this battle he exposed himself much యీ యుద్ధంలో వాడు బహుశా ముందు నిలుస్తూ వచ్చినాడు.
  • he exposed the gold to the fire ఆ బంగారును కాచి చూచినాడు.
  • he exposed my work to a severe test నేను చేసిన పనిని వాడు మహా కఠిన పరీక్ష చేసినాడు.
  • he exposed himself to much inconvenience వాడు చాలా యిబ్బంది పడ్డాడు.
  • your conduct exposed you to blame నీవు చేసిన పనివల్ల నీకు మాట వచ్చినది.
  • he exposed the goods to sale ఆ సరుకులను అంగట్లో పెట్టినాడు.
  • he exposed it to view దాన్ని కనుపరిచినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=expose&oldid=930840" నుండి వెలికితీశారు