బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, సఫలముచేసుట, యీడేర్చుట, వొనగూర్చుట, నెరవేర్చుట, నిర్వహించుట,కాజేసుట, కొనసాగించుట.

 • I cannot effect this నేను దీన్ని నిర్వహించలేను.
 • shouldyou fail in effecting దీన్ని నీవు నెరవేర్చినట్టయితే.
 • he wrote so as to effect his object వాడు తన కోరిక సఫలము అయ్యేలాగు వ్రాసినాడు.
 • Bathing effected a cure స్నానముఆరోగ్యతను కలగ వేసినది.
 • he effected a cure తుదకు స్వస్తము చేసినాడు.

నామవాచకం, s, ఫలము, ఫలపర్యవసానము, క్రియ, గుణము, కార్యము, ప్రయోజనము,స్వార్థకము .

 • the paleness of his face is the effect of hunger ఆకలిచేత వాడి ముఖముతెల్లబారినది.
 • The effect of this is that he will not come యిందుకు తేలే ఫలముయేమంటే వాడు రాడు.
 • the effect of an evil eye దృష్టిదోషము.
 • the rain had great effect anthe flames ఆమంటలో వాన కురిసింది నిండా సఫలమైనది, ఆ వాన కు మంట అణిగినది.
 • pupose భావము, తాత్పర్యము.
 • he wrote me to that effect అదే భావమునుపట్టి నాకువ్రాసినాడు.
 • he expressed himself to this effect అతను చెప్పిన వైఖరియే మంటే, యీ జాబులోని ఫలితాష్థము యేమంటే.
 • Cause and effect కార్యకారణములు.
 • It has a very prettyeffect or apperance అది సొగసుగా వున్నది, అదిసరసముగా వున్నది .
 • It has a very queer effect అది వికారముగా వున్నది, విరూపముగా వున్నది.
 • the ball took effect on his hand.
 • తుపాకి గుండు వాడి తలమీద తాకినది.
 • his turban prevented the ball from taking effectపాగావల్లగుండు తాకక తప్పినది.
 • the medicine produced no effect ఆ మందు పట్టలేదు.
 • my words had no effect నేను చెప్పిన్ని నిష్ఫలమైనది.
 • the regulation took effectఆ చట్టము పనికి వచ్చినది.
 • your appointment will take effect from the date of hisdeparture నీకు యిచ్చిన వుద్యోగము అతను ప్రయాణమై పొయ్యేదినము మొదలుకొనిచెల్లును .
 • Will the spell take effect on us ఆ మంత్రము మనమీద పారునా.
 • the author evidently use this expression merely for effect మనుష్యులు వూరికే ఆశ్చర్యముపడడమునకైకవి దీన్ని ప్రయోగించినాడు.
 • In effect the two are the same మెట్టుకు రెండు వొకటే.
 • In effect you will have to pay the money తుదకు ఆ రూకలు నీవు యివ్వవలసివస్తున్నది.
 • this in effect adoption యిది తుదకు దత్తని తేలుతున్నది, యేర్పడుతున్నది.
 • the constitut-ional effects of a disease తీరిన రోగము యొక్క వేగము .
 • Effects ( plural ) or property of the decesed చచ్చినవాడిసొత్తులు, సామానులు, ఆస్తి.
 • ( Fielding usesthis for the goods of the living).

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=effect&oldid=929868" నుండి వెలికితీశారు