doctor
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, వైద్యము చేసుట, చికిత్సచేసుట, యిది నీచమాట,యీ మాటకు చంపుట అని యెగతాళిగా ప్రయోగిస్తారు. నామవాచకం, s, వైద్యుడు, పండితుడు, శాస్త్రి, గురువు.
- a doctor of divinity యిది కొందరు పండితులకిచ్చే పట్టము,పట్టపుపేరు, యిందుకు సంకేతాక్షరములు D.D. అనివ్రాస్తారు .
- a doctor of laws యిదిన్ని కొందరుపండితులకు యిచ్చే పట్టము, పట్టపుపేరు. యిందుకు సంకేతాక్షరములు LL.D.అనివ్రాస్తారు.
- ఈ పట్టపుపేరు నిఘంటుకర్తయైన Dr.Johnson దొరవారికి కద్దు Samuel Johnson కు సంకేతాక్షరములు.LL.D.అన్నిన్ని.
doctor of Medicine కు సంకేతాక్షరములు.M.D.అన్నిన్ని వ్రాస్తారు.
- ముఖ్యముగా యీ సంకేతాక్షరములుపేర్లకు తరువాత వ్రాసివుంటున్నవి, చదవడములో పేర్లకు ముందుగాచదువుకోవలసినది.
- Samuel Johnson LL.D.అనివ్రాసి వుంటే DR.Johnsonఅని చదవవలసినది యిదిన్ని గాక D.D.or LL.D. or M.D. అని వ్రాసినప్పటికిన్ని చదవడములో Doctor అనేపేరు మాత్రమే వస్తుంది, కాలీజులో చదివి యోగ్యతాపత్రికతీసుకున్న తరువాత యీ పేర్లు వస్తున్నవి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).