compliment
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, ఉపచరించుట.
- in words ప్రియోక్తులు చెప్పుట.
- by actsఉపచారములు చేసుట.
- or to praise స్తుతించుట, మెచ్చుకొనుట.
- the magistrate complimented me with a chair అధికారి నాకు కురిచి యిచ్చి మర్యాద చేసినాడు.
- I cannotcompliment these people upon their probity వాండ్ల పెద్ద మనిషితనమును గురించి ప్రస్తాపము చేయడము యెందుకు, అనగా పెద్దమనుష్యులు కారు.
- I cannot compliment her on her beauty but she is a very good woman ఆమె అందము పడివుండనీ గాని మెట్టుకు ఆమె మహా యోగ్యురాలు.
నామవాచకం, s, ఉపచారోక్తి, మృదువచనము, ప్రియోక్తి, ప్రియభాషణము, వందనము, దండము, సలాము, ఆశీర్వచనము.
- you pay me a compliment వూరికె తమరు దయచేత శలవు యిస్తారు.
- with my compliments నా సలాములు చెప్పి.
- compliments of condolence దుఃఖోపశమనమైన మాటలు, ఉపచారము చెప్పడము.
- compliments of congratulation శుభవార్తలు.
- he presented his compliments దండము పెట్టినాడు, సలాము చేసినాడు.
- these are mere compliments వట్టి ముఖప్రీతి మాటలు.
- empty compliments శుష్కోపచారములు, ముఖప్రీతిమాటలు.
- at the beginning of a Hindu letter వక్కణ.
- We assert that the Hindus have no sense of shame: they return the compliment by saying we have no modesty at all మనము హిందువులకు సిగ్గు లేదంటే మనకే సిగ్గు లేదని అదే మర్యాద చేస్తారు.
- In compliment to your brother I will not punish you మీ యన్నను చూచి నిన్ను శిక్షించక విడిచిపెట్టినాను.
- in compliment to your youth నీ వయస్సు విచారించి, నీ వయస్సును చూచి.
- in compliment to your learning నీ విద్య చూచి.
- by way of compliment ఉపచారముగా.
- as a compliment గౌరవముగా.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).