బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
  • (file)

    క్రియ, విశేషణం, తెచ్చుట, తీసుకొనివచ్చుట, యెత్తుకొనివచ్చుట, పిలుచుకొనివచ్చుట.

    • he brought an acusation or charge against me నా మీద ఒక వ్యాజ్యము తెచ్చినాడు.
    • they brought the ship to వాడను నిలిపినారు.
    • she was brought to bedబిడ్డ కన్నది.
    • a woman who is brought to bed బిడ్డకనివుండే స్త్రీ.
    • they broughtthe matter to a close ఆ పనిని తీర్చినారు, ముగించినారు.
    • To bring the businessto an issue I sued him ఆ పని పైసలా కావడానకై వాడిమీద వ్యాజ్యము వేస్తిని.
    • when this matter was brought to light ఆ సంగతి బయటపడ్డప్పుడు.
    • hiswork was never brought to light అతని గ్రంధము వొక నాడున్ను ప్రసిద్ధపడలేదు.
    • this brought him to his grave యిందువల్ల చచ్చినాడు.
    • this brought himto the edge of the grave యిది వాడి ప్రాణాంత్యమునకు వచ్చినది.
    • thissickness brought him to his end యీ రోగముతో వాడు చచ్చినాడు.
    • he brought the estate to the hammer ఆ సొత్తును యేలము చేసినాడు.
    • they brought himto justice వాడికి శిక్ష అయ్యేటట్టు చేసినారు.
    • after winter the sun brings treesto life చలికాలము పోయిన తరువాత సూర్యుడివల్ల చెట్లకు ప్రాణములువస్తవి.
    • whenI bring this to mind దాన్ని నేను జ్ఞాపకము చేసుకొన్నప్పుడు.
    • I can not now briing it to mind దాన్ని యిప్పుడు జ్ఙాపకమునకు తెచ్చుకోలేను.
    • he broughtthem to nothing వాండ్లను బొత్తిగా చెరిపినాడు.
    • this was brought to nothingఅది చక్కబడలేదు.
    • I brought it to his notice దీన్ని అతనికి తెలియచేసినాను.
    • Extravagance brought him to poverty దూపరదిండితనముచేత దరిద్రుడైనాడు.
    • this brought him to ruin యిందు వల్ల చెడిపోయినాడు.
    • when he was brought to hissenses వాడికి స్మారకము వచ్చినప్పుడు.
    • he brought the matter to a propersettlement ఆ సంగతిని పరిష్కరించినాడు.
    • he brought them to terms వాండ్లనుసమ్మతిపరచినాడు.
    • he brought the prisoners to trial ఆ ఖైదీలను విచారణకుతెచ్చినాడు.
    • he was at legnth brought to confess it తుదకువాడు దాన్ని వొప్పుకొనేటట్టుచేసినారు.
    • God brought it to pass దేవుడట్లా జరిగేటట్టు చేసినాడు.
    • he was brought to sell his house వాడికి తన యింటిని అమ్ముకోవలసివచ్చినది.
    • to bring about సాధించుట, చక్కబెట్టుట.
    • he brought the marriage aboutఆ పెండ్లిని వొనగూర్చినాడు.
    • they brought their enemies down శత్రువులనుసాధించినారు.
    • they brought their enemies down వాడి గర్వము అణిచినారు.
    • tobring forth కనుట, యీనుట.
    • She brought forth a child అది బిడ్డకన్నది.
    • the cow brought forth a calf ఆ యావు దూడవేసినది.
    • he brought forththe prisoners ఖైదీలను బయటికి తీసుకవచ్చినాడు.
    • to bring forth flowers పూచుట.
    • to bring forth fruits కాచుట.
    • When the goods were brought forthఆ సరుకులను బయటపెట్టినప్పుడు.
    • he brought his friends forward తన స్నేహితులనుముందుకు తెచ్చినాడు.
    • he brought her home దాన్ని యింటికి తీసుకవచ్చి చేర్చినాడు.
    • he brought the charges home ఫిర్యాదును సాబతుచేసినాడు.
    • the offence wasbrought home to him వాడిమీ తప్పు పూర్తిగా రుజువైనది.
    • to bring in లోనికితెచ్చుట.
    • they brought him in i.
    • e.
    • into parliament వాణ్ని పార్లెమెంటులోచేర్చుకొన్నారు.
    • this business brought him in a 1000 Rupees యీ వర్తకములోవాడికి వెయ్యి రూపాయలు కలిసివచ్చినది.
    • he brought in the kings name oftenమాటిమాటికి రాజు పేరును వుదాహరించినాడు.
    • he brought them in contactవాండ్లకు సంధిచేసినాడు.
    • he brought the two ships in contact ఆ రెండువాడలను ఒకటిగా చేర్చినాడు.
    • they brought him in guilty వాడి మీద నేరము రుజువైనదన్నారు.
    • they brought me into the business నన్ను ఆపనిలో కలిపినారు.
    • they brought the land into cultivation ఆ నేలను దున్ని పయిరుచేసినారు.
    • he brought them into trouble వాండ్లకు శ్రమవచ్చేటట్టుచేసినాడు.
    • I brought himoff వాణ్ని మోసుకొనివస్తిని, వాణ్ని తప్పిస్తిని, వాణ్ని విడుదల చేయించుకొనివస్తిని.
    • he brought infamy on his family తన కుటుంబమునకు అపకీర్తి తెచ్చినాడు.
    • to bring out బయటికి తెచ్చుట.
    • he brought out the total wrong తప్పుగామొత్తము కట్టినాడు, వెరశి కట్టినాడు.
    • he brought them over in his boatతన పడవలో వాండ్లను తెచ్చినాడు.
    • he tried to bring me over నన్ను పడవలోవాండ్లను తెచ్చినాడు.
    • he tried to bring me over నన్ను వుసలాయించవలెననిచూచినాడు, లోపరచుకోవలెనని చూచినాడు.
    • how could he bring himself to dothis? దీన్ని చేసేటందుకు వాడికి చెయ్యియెట్ల ఆడెనో? As he could not birng himslef to do so.
    • అట్లాచేయడానకు వాడికి మనసురానందున.
    • I couldnot bring myself to dringk the pysic నేనెంత సమాధానము చేసుకొన్నా ఆ మందునుతాగడమునకు నాకు బుద్ధి పుట్టలేదు.
    • he at last brought himself to one meal a-dayతుదకు దినానికి వకసారి భోజనము చేసేటట్టు వాడుక చేసినాడు.
    • how could he bringhimself to say so? అట్లా అనడానకు వాడికి నోరెట్లా ఆడినదో? at last we broughthim to himself తుదకు వాడికిస్మారకము వచ్చేటట్టు చేస్తిమి.
    • he brought themtogether వాండ్లందరిని చేర్చినాడు, పోగుచేసినాడు.
    • he brought up his troopsతన సైన్యమును ముందుకు నడిపించినాడు.
    • he brought up the child very properlyఆ బిడ్డను క్రమముగా పెంచినాడు.
    • the child brought up his dinner ఆ బిడ్డ తిన్నదాన్ని కక్కినది, వాంతిచేసినది.
    • When he brought up the subject వాడు ఆ సంగతిప్రస్తాపము చేసినప్పుడు.
    • bring me word when he comes వాడురాగానే నాకుసమాచారము చెప్పు.

    మూలాలు వనరులు

    <small>మార్చు</small>
    1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bring&oldid=925255" నుండి వెలికితీశారు