of
(Of నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విభక్తి ప్రత్యయం
- యొక్క. the name of the man ఆ మనిషి యొక్క పేరు. the scent of a flower పుష్పము యొక్క వాసన.
- లో. which of them is oldest? వాండ్లలో యెవడు పెద్ధవాడు. one of the books ఆ పుస్తకములలో వొకటి. six of these వీటిలో ఆరు.
- మీద. the love of money రూకల మీద ఆశ.
- చేత, వల్ల, చొప్పున, గూండా. I learned it of him వాడి గూండా విన్నాను.he did this of his merry విశ్వాసము చేత చేసినాడు, విశ్వాసము వల్ల చేసినాడు.
- అనే. he gained the name of a poet కవి యనే పేరును పొందినాడు. a jewel of a book గ్రంధ రత్నము. theflames of of శోకమనే వహ్ని. the village of Vinuconda వినుకొండఅనే వూరు. the kingdom of Persia పర్శియా అనే దేశము. the fool of a doctor తెలివిమాలిన వైద్యుడు, వెర్రి వైద్యుడు. the rogue of agoldsmith ఆ కంసాలి హరంజాద, ఆ వంచకుడయిన కంసాలవాడు. withoutfear of falling పడుతామనే భయం లేకుండా.
- కు. within a mile of their houses వాండ్లిండ్లకు గడియ దూరములో. he made a copy of that paper ఆ దస్తావేజుకు వొక నకలు వ్రాసుకొన్నాడు.
- వద్ద, దగ్గెర. he took leave of his master ఉపాధ్యాయుల వద్ద సెలవు పుచ్చుకొన్నాడు. he bought it of me నా దగ్గెర కొన్నాడు. of whom did you buy it? దాన్ని యెవడి దగ్గెర కొంటివి.
- తో. a box made of gold బంగారుతో చేసిన డబ్బీ, బంగారు డబ్బీ. a box made of horn కొమ్ముతో చేసిన బరిణె, కొమ్ము బరిణె. made of leather తోలుతో కుట్టిన.
- గురించి. I heard of him వాణ్ని గురించి విన్నాను.articles of war దండును గురించి చట్టములు. the life of Ramaరామ కధ, రామ చరిత్ర.
- గల. a man of fifty యాభై యేండ్లు గలవాడు, యాభై యేండ్ల వడు. PHRASES, a bag of gold మొహిరీల సంచి. a man of sense బుద్ధిమంతుడు. a man of learning విధ్వాంసుడు.a woman of beauty అందకత్తె, రూపవతి. all of us మేమందరము. they robbed of all I had నావద్ద వుండినదంతా దోచుకొన్నారు. being of wicked heart దుర్మార్గమునకులోనై. he did it of himself తనకు తానే చేసినాడు, స్వబుద్ధ్యా చేసినాడు. it fell down of itself తనకు తానే పడ్డది. he settled the business out of hand ఆ పనిని తక్షణమే పరిష్కారము చేసినాడు. he sleeps of an afternoon మూడుజాములకు నిద్రపోతాడు. of late they often go there ఇటీవల వాండ్లక్కడికి పదేపదే పోతారు. of old they wore another dress పూర్వ కాలమందు, వాండ్లు వేరే వుడుపు వేసుకొన్నారు. of a poor man he became rich పేదవాడుగా వుండి భాగ్యవంతుడైనాడు. a house of his అతనిది వొక యిల్లు. he has two horses of his own వాడికి స్వంతముగా రెండు గుర్రఆలు వున్నవి. a cup of water గిన్నెడు నీళ్ళు. of course కాక యేమి. first of all తొలుదొలుత, మొట్టమొదట. ten rupees worth of rice పది రూపాయిల బియ్యము. I am in possession of that book ఆ గ్రంధము నా వద్ద వున్నది. I know nothing of it దాని గురించి నాకేమీ తెలియదు. I know of no other carpenter there అక్కడ వేరే వడ్ల వాడు వునట్టు నాకు తెలియదు. what has become of him? వాడేమాయెను. of a morning he rides out తెల్లవారి పూట సవారీపోతాడు. that paper is not of my composing ఆ దస్తావేజు నేను వ్రాశినది కాదు. instead of doing so అలా చేయకుండా. what is the use of keeping it? దాన్ని పెట్టుకోవడము వల్ల యేమి ఫలము. of a truth, they knew he was gone వాడు పోయినాడని వాండ్లకు నిజముగాతెలిసి వుండెను. he knew that of necessity I must come నేను అవశయముగా రావలసినదని వాడికి తెలుసును.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).