సైంధవుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సింధుదేశపు రాజు. దుర్యోధనుని చెల్లెలు అగు దుస్సల మగఁడు. ఇతని తండ్రి వృద్ధక్షత్రుఁడు.
ఇతడు పాండవులు వనవాసము చేయుకాలమున తాను ఒక రాచకూఁతురును వివాహము చేసికొని వారు ఉన్న వనముగుండ తన పట్టణమునకు పోవుచుండి ఆశ్రమమున ఏకాకియై ఉండిన వారిపత్ని అగు ద్రౌపదిని చూచి వారులేకుండుట తెలిసి బలాత్కారముగా పట్టి తన రథముమీఁద పెట్టుకొని పోవుచు ఉండెను. ఇంతలో ఈవర్తమానమును ఎఱిఁగి పాండవులు వచ్చి వీనిని చక్కఁగ మర్దించి అవమానించి పంపిరి. అంతట వీఁడు దానికి ప్రతికారము చేయ సమకట్టి ఉగ్రతపము సలిపి అర్జునుఁడు తక్క తక్కిన పాండవులను ఒక్కదినమున జయించునట్లు వరము పడసి భారతయుద్ధము జరుగునపుడు పాండవులను పద్మవ్యూహము భేదించిన అభిమన్యునికి తోడుపడకుండ అడ్డగించి గెలుపుకొనెను. కనుక పదుగురు యోధులు ఒక్కటిగాచేరి అభిమన్యుని చంపిరి. ఆవృత్తాంతము సంశప్తకులతో పోరాడపోయి ఉండిన అర్జునుడు విని ఆమఱునాడు సూర్యుఁడు అస్తమించునంతలో సైంధవుని తల నఱకుదును అని ప్రతిజ్ఞచేసి ఆప్రకారము నడపెను.
మఱియు ఇతఁడు అర్భకుడై ఉండు కాలమున ఒకనాడు అశరీరవాణి వీఁడు సంగ్రామమున ఏమఱి తల తునుమఁబడును అని ఆదేశింపఁగా అది అతని తండ్రి అగు వృద్ధక్షత్రుఁడు విని ఎవఁడు వీనిమస్తకమును మహిమీఁద పడవైచునో అట్టివాని శిరము సహస్రశకలములు అగుఁగాక అని సకలజనుల వీనులకు గోచరము అగునట్లు పలికెను. ఆహేతువునుబట్టి భారతయుద్ధమున అర్జునుఁడు సైంధవునితల శమంతపంచక సమీపమున తపము ఆచరించుచు ఉండిన వృద్ధక్షత్రుని గుండ మహీతలమున పడునట్లు పాశుపతాస్త్రప్రయోగమున చేసెను. నా|| జయద్రథుఁడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు