సుభగాబాలోదితాఖ్యాయికాన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఒకస్త్రీ బాలునకు చెప్పిన కథవలె. ఒకవనిత పిల్లవాని నాడించుచు నీక్రిందికథను చెప్పెను:- అనగా అనగా ఒకరాజు. ఆరాజుకు ముగ్గురు కొడుకులు. వారిలో ఇద్దరు పుట్టిరి. ఒకడు కడుపులోనే ఉన్నాడు కాని, యింకను పుట్టలేదు. ఆముగ్గురు కొడుకులు కలిసి ఆడుకొంటూ ఉండేవారు. ఒకనాడు వారు ముగ్గురును కలసి ఉళక్కి పట్టణమునకు వేటకు బయలుదేరిరి. త్రోవలో వారికి ఆకాశముమీద పండ్లతో వంగియున్న చెట్టొకటి కంటబడెను. వెంటనే వారాచెట్టు దగ్గఱకు పోయిరి. ఆచెట్టు ఉన్న పట్టణముపేరు భవిష్యన్నగరము. ఆముగ్గురు పిల్లలు ఆభవిష్యన్నగరములో ఇంకను వేటాడుచునే ఉన్నారు." పిల్లవాడు కథ నిజమే అనుకొని ఊఁకొట్టుచూ వినుచున్నాఁడు. అట్లే- సంసారమున బడి స్త్రీ పురుషులు మాయావృత్తులై విహరించుచు అనేకకష్టముల బారింబడి ఆశాపాశములు చుట్ట పాపాచరణమునకుం గడంగి మృతులై కర్మఫలానుకూలముగ మఱొకచో జనించి మఱల నశించుచు సంసారము నిజమే అను నమ్మకమున పడరాని పాట్లు పడుచుందురు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>