సుందోపసుందులు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
నిత్య బహువచనము

అర్థ వివరణ <small>మార్చు</small>

సుందోపసుందులు హిరణ్యకశిపువంశమున పుట్టిన నికుంభుడు అనువాని కొడుకులు. ఈ అన్నతమ్ములు ఇద్దఱు మిగుల ఘోరమైన తపము సలిపి బ్రహ్మవలన కామరూపత్వమును, కామగమనత్వమును, సకల మాయావిత్వమును, అన్యులచేత అవధ్యత్వమును కలుగ వరమును పడసి జనులకు కడుబాధకులుగ ఉండిరి. అపుడు విష్ణువు విశ్వకర్మచే రూపరేఖాసంపన్న అగు ఒక కన్యకను సృజింపఁజేసి వీరి యొద్దకు పంపెను. అప్పుడు ఈ ఇరువురును దాని వలన మోహితులు అయి నీవు మాలో ఎవనిని వరించెదవు అని అడుగఁగా మీరు ఇరువురును నాయెదుట యుద్ధము సలిపితిరేని మీలో జయశాలి అగువానిని నేను వరించెదను అని చెప్పెను. అంతట వారు ఇరువురు దానికయి ఒండొరులతో పోరాడి మడిసిరి. వీరి కొడుకులు శుంభ నిశుంభులు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>