సహాయం:సూచిక

విక్షనరీ అంటే అంతర్జాలంలో ఉన్న తెలుగు నిఘంటువు.దీనిలో ఒక పదానికి వ్యాకరణం విశేషాలు,పదానికి అర్ధవివరణ,తెలుగులో ఉన్న సమానార్ధాలు,సంబధిత పదాలు,వ్యతిరేల పదాలు మొదలైన విషయాలు ఉంటాయి.ఇది వీకీపీడియాకు అనుబంధమైనది.ఇతర భాషానువాదాలు దీనిలో ఉంటాయి.పదాలను వర్గాలుగా విభజిస్తారు.వీకీపీడియాలాగా దీనిలో ఎవరైనా కొత్తపడాలను సృష్టించవచ్చు.ముందుగా సృష్టించిన పదాలకు కావలసిన సమాచారమూ జత చేయవచ్చు. దిద్దటానికి సభ్యత్వం అవసరం లేకపోయినా ఫైల్ అప్‌లోడ్ చేయటానికి మాత్రం సభ్యత్వం ఉండాలి.కనుక దీనిలో పనిచేయాలని ఆసక్తి ఉన్నవాళ్ళు సభ్యత్వం తీసుకోవడం మంచిది.ఇతర సభ్యులతో సంప్రదించటానికి ఇది అనువుగా ఉంటుంది.పని చేసే సమయంలో సందేహాలు ఉంటే ఇతర సభ్యులను అడిగి సందేహాలు తీర్చుకోవచ్చు,ఇతర సభ్యుల సందేహాలు తీర్చనూ వచ్చు.

విక్షనరీ దిద్దుబాట్లు

సభ్యత్వం తీసుకోవడంసవరించు

విక్షనరీ మొదటి పేజీ పైభాగం కుడి వైపున అక్కౌంట్ సృష్టించు లేదా లాగిన్ అవండి లింకు మీద నొక్కండి ఆతరవాత తెరచుకున్న పేజీ ఎకౌంట్ సృస్టించుకోండి అనే లింకు మీద నొక్కండి ఆతరవాత తెరచుకొన్న పేజీలో మీ వివరాలు కోరుతూ తెరచుకున్న పేజీలో మీవివరాలను ఇవ్వండి ఆతరవాత మీ ఇ మెయిల్ అడ్రసుకు ఒక మెయిల్ పోతుంది దానిని తెరచిచూడండి అంతే మీరు విక్షనరీ సభ్యులైనట్లే.రిఫరెన్స్ మెయిల్ చూడకపోయినా మీ సభ్యత్వం నమోదు ఔతుంది మీ పని నిరభ్యంతరంగా కొనసాగుతుంది.

కొత్తపదాన్ని సృష్టించడంసవరించు

విక్షనరీలో ఎడమవైపు అన్వేషణ అనే పదం కింద ఉన్న ఇన్‌పుట్ బాక్స్‌లో మీరు సృష్టించాలనుకొన్న పదం వ్రాయండి తరవాత వెళ్ళు అనే కమాండ్‌ను నొక్కండి.తరవాత తెరచుకొన్న పేజీలో మీరు వెతికిన పేజీ ఉంటే ఆపేజీ పెరచుకొంటుంది లేదంటే అలాంటి పేజీ లేదని దాన్ని మీరు సృష్టించ వచ్చని సమాచారంతో ఒక్ పేజీ తెరచుకుంటుంది.మీరు వ్రాసిన పదం ఎర్రటి అక్షరాలతో కనబడిందంటే అటువంటి పదం ఇంతవరకు విక్షనరీలో లేనట్లే మీరు దానిని నిరభ్యంతరంగా సృష్టించ వచ్చు.పదాల మూస ఈ లింకుని నొక్కండి అక్కడ ఉన్న కొత్త తెలుగు పదం కింద ఉన్న ఇన్‌పుట్ బాక్స్ లో కొత్తపదాన్ని వ్రాయాలి తరవాత పక్కనే ఉన్న సృష్టించండి అనే కమాండ్‌ని నొక్కండి కొత్త పదం పేజీ సిద్ధం.

నూతన పదసృష్టిసవరించు

అనే లింకులోకి వెళ్ళి నూతన పదాన్ని సృష్టించవచ్చు.సౌలభ్యం కోసం ఆమూసను సభ్యులు తమపేజీలో పెట్టుకొని పదాలను సృష్టించవచ్చు.

కొత్త తెలుగు పదం new english word
గమనిక: ఆంగ్ల పదాలను కేవలం చిన్న అక్షరాలు (lower case) తోనే సృష్టించండి.

ఇదే ఆ మూస ఇది కాకుండా నా అనే లింకులో వెళ్ళి నామవాచక పదాలను సులువుగా సృష్టించవచ్చు.ఆలే చేస్తే

వ్యాకరణ విశేషాలలో దానంతట అదే నామవాచకము అని చూపిస్తుంది.

విక్షనరీలో దిద్దుబాట్లుసవరించు

విక్షనరీలో ముందుగా పద సృష్టి చేయాలి. తరువాత కొన్ని నామవాచక పదాలకు చిత్రాలను అందించగలిగితే చిత్రాలను చేర్చాలి. తరువాత ఒక్కొక్క విభాగములో వివరాలు చేర్చాలి. అన్నీ వివరాలు ఒక్కక్కొక్కరే చేర్చాలన్న నియమము ఏదీ లేదు. కాని నూతన పద సృష్టి చేసే సమయంలో ఏదైన ఒక్క వివరమైనా చేర్చితే ఆ పేజీని సందర్శించే సభ్యులు నిరాశకు గురి కారు. పేజీని చూసి ఏమీ లేదని నిరాశపడడం విక్షనరీని విమర్శించడానికి గురి చేస్తుంది కనుక ఏదైనా కొంత వివరాలు సమర్పించడం నూతన పద సృష్టికర్తల కనీస భాద్యత.

వ్యాకరణ విభాగంసవరించు

ఇక్కడ ఉన్న వ్యాకరణ విభాగములో వ్యాకరణ విశేషాలలో సృష్టించిన పదము ఏవిభాగానికి చెందుతుందో వ్రాయాలి. తరువాత కొన్ని పదాలు విడదీయడానికి వీలు కానివన్న అభిప్రాయం ఉంటే వాటిని మూలపదమని పేర్కొనాలి. అంటే పదాన్ని విడతీసినప్పుడు అర్ధము లేకుంటే ఆ పదము మూల పదము.కొన్ని పదాలు రెండు లేక ఇంకా ఎక్కువ పదముల కలయికగా ఉంటాయి. వాటిని విడదీసి పేర్కొనాలి. ఉదాహరణగా;- వేపచెట్టు అనేది ఒకే పదము. దానిని విడదీసినప్పుడు వేప, చెట్టు అనే రెండు పదములు ఉంటాయి. వాటిని పేర్కొనాలి. ఉదాహరణగా ;- నిధి, పెన్నిధి చూడండి. నిధి అంటే అర్ధము ఉంది. అలాగే పెన్నిధి నిధికి ముందు పె అన్న అక్షరం చేరిం దానికి విభిన్న అర్ధము వస్తుంది కదా ! అప్పుడు నిధి అన్న పదము మూలముగా తీసుకుని పెన్నిధి అన్న పద నిర్మాణం జరిగినట్లే కదా ! కనుక పెన్నిధి అనే పదములో నిధి మూల పదము ఔతుంది అది గమనించి పదము యొక్క ఉత్పత్తిని పేర్కొనాలి. తరువాత ఏక వచనము లేక బహువచనము విభాగము. దానిలో సృష్టించి పదము ఏకవచన పదము అయితే బహువచన పదము వ్రాయాలి. బహువచన పదము అయితే ఏకవచన రూపము వ్రాయాలి. అలాగే వీటికి లింకులు సృష్టించే అవసరం లేదని సీనియరు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే సృష్టించిన పదానికి బహువచన లేక ఏకవచన రూపానికి వివరాలలో తేడా ఉండదు కనుక సభ్యుల సమయం వృధా అవడమే కనుక సర్వర్ల సామర్ధ్యం వ్యర్ధము ఔతుంది. రెండు పదములు ఒక చోట చేర్చి ఒక పేజీని తొలగించడానికి సమయము వృధా ఔతుంది. జాబితా తయారు చేయాలి అనుకున్నప్పుడు బహువచన రూపము తయారు చేసి జాబితా తయారు చేయవచ్చు. ఉదాహరణగా;- చెట్లు, పండ్లు, ఆమ్రేడిత పదాలు లాంటివి ఉన్నాయి కావాననుకున్న సభ్యులు వాటిని సందర్శించ వచ్చు. అలాగే కొన్ని పదాలకు బహువచ రూపము ఉండదు. ఉదాహరణగా :- సూర్యుడు అనే పదానికి బహువచన రూపము లేదు. సూర్యుడి లాంటి అంతరిక్ష వస్తువులు అనేకము ఉన్నా వాటిని నక్షత్రాలు అంటాము. సూర్యుడు అనే నక్షత్రానికి మనము సూర్యుడు అనే పేరు పెట్టుకున్నాము మిగిలినవన్నీ నక్షత్రాలే. అటువంటి పదాలు ఎన్నో ఉంటాయి. వాటికి ఆ విభాగములో లేదు అని పేర్కొన వచ్చు. లేదా వదిలి వేయ వచ్చు.

అర్ధవివరణసవరించు

ఈ విభాగములో సృష్టించిన పదానికి అర్ధాన్ని వివరించాలి. పదము చిన్నదైనా అర్ధము వివరంగా ఉంటుంది. కనుక వీలైనంతగా వివరణ ఇచ్చినట్లైతే సందర్శకులకు తృప్తి కలుగుతుంది. కొత్తగా భాష తెలుసుకునే ఇతర భాషల వారికి ఇది ఒక పాఠంలా ఉంటుంది. క్లుప్తంగా ఉన్నా పరవా లేదు వివరణ ఇచ్చినా చాలు. ఉదాహరణగా;- భూమి అనే పదానికి ఇది సూర్య కుంటుంలోని ఒక గ్రహము వ్రాయాలి.

పదాలుసవరించు

పదాలు అనే విభాగంలో నానా అర్ధాలు విభాగము మొదటిది. ఇందులో పదానికి సమాన అర్ధాలు మాత్రమే వ్రాయాలి. ఇక్కడ రూప భేదము అర్ధ భేదము లేక ఖచ్చితంగా సమాన అర్ధాలు ఉన్న పదాలు వ్రాయాలి. ఉదాహరణగా;- జలము అనే పదానికి నీరు, ఉదకము అనేది సమాన అర్ధము. అవి వ్రాయాలి. కాని నీటికి కాని, ఉదకముతో ఇలాంటి రూప బేధాలు వ్రాయకూడదు. కనుక అలాగాగే విభిన్న అర్ధాలు ఉన్న పదము అయితే వ్రాయగలిగితే విభిన్న సమాన అర్ధాలు వ్రాయాలి. ఉదాహరణగా;- తెలుపు అనే పదానికి తెల్లని రంగు అనేది ఒక అర్ధము అయితే ఎరిగించుట, తెలుపుట అనేది రెండవ అర్ధము కనుక వివరించ గలిగితే రెండు అర్ధాలను విడి విడిగా వ్రాయాలి. ఒక్క అర్ధము వ్రాసినా పరవాలేదు. తరువాత సంబంధిత అర్ధాలు విభాగంలో పదాలికి ఉన్న విభిన్న రూపాలు,పదాన్ని విభక్తులతో చేర్చి , విశేషణాలతో చేర్చి వ్రాయాలి. ఉదాహరణగా:- రాముడు అనేపదానికి ఇలా వ్రాయాలి రాముడితో, రాముడివటి, రాముని వద్దకు, రాముని వలన సుగుణాభి రాముడు ఇలా ఒక్కొక్క సారి ఆదము ఉపయోగించిన సంబంధిత పదాలు. అంతే కాని సీత, లక్ష్మణుడు, దశరధుడు, కౌసల్య అనేవి వ్రాయ కూడదు. ఈ పదాలు రాముడికి సంభందించినవే కాని రాముడు అనే పద సంబంధితాలు కావు. తరువాతి విభాగము వ్యతిరేకార్ధాలు. ఇక్కడ పదానికి వ్యతిరేకార్ధము ఉంటే వ్రాయాలి లేకుంటే వదిలి వేయాలి. ఉదాహరణగా ;- మంచి అనే పదానికి చెడు అనేది వ్యతిరేక పదము కనుక దానిని పేర్కొనాలి. భూమి అనే పదానికి వ్యతిరేక పదము లేదు కనుక దానికి వ్రాయనవసరం లేదు. అవసరము లేదంటే వ్యతిరేక పదాలు అనే విభాగము తొలగించ వచ్చు. ఉత్సహవంతులు ఈ పదానికి వ్యతిరేక పదము లేదు అని సూచించ వచ్చు.

పదప్రయోగాలుసవరించు

ఈ విభాగములో సృష్టించిన పదాన్ని ఉపయోగిస్తూ వాక్యాలు వ్రాయాలి. అలాగే సామెతలను, పద్య పాదాలను, జాతీయాలను, నీతివాఖ్యలను, ప్రముఖుల వాక్యలను ఉదహరించ వచ్చు. ఉదాహరణగా ;- ఆరోగ్యము అనేపదానికి.

 • ఆరోగ్యమే మహా భాగ్యము.
 • ప్రజల ఆరోగ్యరక్షణ ప్రభుత్వ ప్రధాన భాద్యత.
 • ఇలా ఉదహరించ వచ్చు.

రచ్చబండసవరించు

సభ్యులు తమ సందేహాలను ఇక్కడ వ్రాసారంటే ఇతర సభ్యులందరూ చూసే అవకాశం ఉంది కనుక సందేహం తీర్చగలిగిన సభ్యులు ఎవరైనా మీ సందేహం తీరుస్తారు.విక్షనరీ గురించి అనేక ఇతర విషయాలు ఇక్కడ చర్చించడానికి వీలుంది. బొద్దు అక్షరాలు

అనువాదాలుసవరించు

తరువాత విభాగము అనువాదాలు. దీనిలో సృష్టించి పదానికి ఇతరభాషాపదాలను చేర్చవచ్చు. ఈతర భాషలలో ప్రవేశము ఉన్న వారు మాత్రమేది వ్రాయగలరు. ఇది తెలుగు వారికి ఉపయోగపడే విభాగము. ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని ముఖ్యమైన పదాలను అర్ధం చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఇక్కడ ప్రధాన భారతీయ భాషలతో పాటు చైనా, ఫ్రెంచ్, ఆంగ్ల పదాలకు అర్ధము వ్రాయడానికి వీలుగా ఆ భాషలను సూచించే పదాలు ముందుగా అసంకల్పితంగా పదము సృష్టించే సమయయంలో పేజీలో చేరుతుంది. కనుక ఆయా భాషలకు ఎదురుగా ఆయా భాషా పదాలను చేర్చవచ్చు. అలగే ఆ పదాల ఉచ్చారణ తెలుగులో బ్రాకెట్లలో వ్రాసినట్లైతే ఉచ్ఛారణ కూడా తెలుసుకో వచ్చు. ఇది ఆంధప్రదేశం వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారికి కొత్తలో చక్కగా ఉపయోగ పడుతుంది. కొన్ని సార్లు ఇతర భాషా పదాలను చేర్చ లేక పోయినా ఉచ్ఛారణ వ్రాసినా పరవా లేదు. అది పదము అర్ధం చేసుకుని పలకడానికి కొంత ఉపకరిస్తుంది. ఇక్కడ ముందుగా ఇతర భాషా పదాలకు ఎదురుగా ఉన్న లింకులో ఆ పదాలను ఇలా వ్రాయాలి నూనె అనే పదానికి ఆంగ్ల పదము oil కనుక లింకు లోపల [[]]:en:oil|oil అని వ్రాయాలి. బ్రాకెట్లలో ()ఆయిల్ అని వ్రాయాలి. ఇలా వ్రాసినప్పుడు oil అనే పదము ఆంగ్ల విక్షనరీలో ఉన్నట్లైతే oil అన్న ఆంగ్ల పదము oilఇలా నీలి రంగులో కనిపిస్తుంది. అప్పుడు మీరు oil అన్న పదము నొక్కినప్పుడు ఆంగ్లవిక్షనరీ oil పదము ఉన్న పేజీకి వెళ్ళ వచ్చు. ఇలాగే అన్ని పదాలు. అలాకాక [[]] లోపల oil మాత్రమే వ్రాసినప్పుడు కూడా oil అన్న పదము నీలి రంగులో కనిపిస్తుంది కాని అది తెలుగు విక్షనరీ మరొక భాగమైన బ్రౌన్ డిక్షనరీలో ఉన్న oil అన్న పదానికి తీసుకు వెళుతుంది. కాని ఆంగ్ల విక్షనరీ లింకు ఇవ్వడము ఉత్తమము. బ్రౌన్ డిక్షనరీ పేజీకి పేజీ చివరి భాగములో లింకు ఇవ్వ వచ్చు. ఇతర భాషలకు ఇలా ఇచ్చినప్పుడు పదము ఎర్ర రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే విక్షనరీలో ఇతర భాషాపదాలు లేవు. విక్షనరీలో లింకు ఇవ్వాలంటే :: అనే సంకేతము లోపల

 • ఆంగ్లపదానికి :en:
 • హిందీపదానికి :hi:
 • చైనాపదానికి :ci:
 • ఫ్రెంచ్‌పదానికి :fh:
 • సంస్కృతపదానికి :sa:
 • కన్నడపదానికి :kn:
 • మలయాళపదానికి ::
 • మరాఠీపదానికి :mr:
 • పంజాబీపదానికి :pa:
 • తమిళపదానికి :ta:
 • గుజరాతీపదానికి :gu:
 • కాష్మీరిపదానికి :kr:
 • నేపాలీపదానికి :ne:
 • ఉర్దూపదానికి :ur:
 • బెంగాలీపదానికి :bn:
 • ఒరియాపదానికి :or:

మూలాలు వనరులుసవరించు

ఈ విభాగంలో సృష్టించిన పదానికి వనరులు ఉంటే సూచించ వచ్చు. కాని సభ్యులు వనరుల కొరకు ఆందోళన పడవలసిన అవసరం లేదు. మనకు ఎప్పుడూ వాడుకలో ఉన్న సాధారణపదాలకు వనరులు ఉదహరించడం అవసరము లేదు. ఎందు కంటే కొన్ని సరి కొత్త పద ప్రయోగాలకు వనరులు ఉదహరించ వచ్చు. ప్రచురణ మాధ్యమంలో నూతన పద ప్రయోగం జరుగుతూ ఉంటుంది. అలాగే మరుగున పడిన పదాలకు వనరులు ఉంటే ఉదహరించ వచ్చు. లేకుంటే వదిలి వేయ వచ్చు. తాతల కాలం నాడు వాడుకలో ఉండి ప్రస్థుతం మరుగున పడిన ఉన్న పదాలను చేర్చవచ్చు. వీటికి వనరుల అవసరము లేదు.

బయటి లింకులుసవరించు

ఇక్కడ విక్షనరీకి వెలుపలి వాటికి లింకులు ఇవ్వవచ్చు. ఇక్కడ ముందుగానే ఆంగ్ల వీకీకి తెలుగు వీకీకి లింకులు ఉంటాయి. బౌన్ డిక్షనరీకి లీకులు ఇవ్వ వచ్చు. అలాగైతే పేజీని సందర్శించే వారు వారికి కావలసినది చూసే అవకాశం లభిస్తుంది.

 • ఆంగ్లవీకీకి [[]] లోపల ముందుగానే wikipedia:india|india అని ఉంటుంది మనం చేయవలసినదల్లా సృష్టించిన పదానికి సమానార్ధమైన ఆంగ్ల పదాన్ని india అన్న పదాలు ఉన్న స్థానంలో చేర్చడమే.
 • తేవికీకి కూడా అలాగే ముందుగానే [[]] లింకు లోపల w:తెలుగు|తెలుగు అని కానీ w:తేవికీ|తేవికీ కాని ఉంటుంది. మనం చేయవలసినదల్లా సృష్టించిన పదాన్ని తేవికీ చేర్చవచ్చు. అయినా కొన్ని పదాలకు మాత్రమే ఇవి వ్రాయవచ్చు. అన్నిటికీ లింకులు ఇచ్చినటైతే తేవికీలో మొలకలు తయారౌతాయి కనుక దీనిని అనుభవము ఉన్న సభ్యులు మాత్రమే వ్రాస్తే చాలు. లేకుంటే ఈ విభాగాన్ని వదిలి వేయాలి.
 • బ్రౌన్ డిక్షనరీకి లింకు ఇవ్వవచ్చు. అక్కడ అనేక పదాలకు పేజీలు ఉన్నాయి కనుక అన్ని పేజీలు చూపుతుంది కనుక ఈ లింకులు ఇవ్వ వచ్చు.

ఉదాహరణగా ;- మంచి అనే పదానికి good సమానార్ధము కనుక [[]] ఇలాంటి లింకులో good అని వ్రాస్తే చాలు.

వర్గం విభజనసవరించు

అనే విభాగంలో పదము ఏవర్గానికి చెందుతుందో వ్రాయండి. వర్గాలు విభాగాన్ని సందర్శించి అక్కడ ఉన్న వర్గాలను చదివి అర్ధ చేసుకున్న తరువాత వర్గాలను వ్రాయవచ్చు. లేకుంటే వదిలి వేయ వచ్చు. సభ్యులు ఏ ఒక్క పదానికి అన్నీ వివరాలు ఇవ్వనవసరము లేదు. వారికి ఏది తెలుసో అది వ్రాయవచ్చు. ఎంత చిన్నదైనా చాలు.

చిత్రాల అప్లోడ్సవరించు

సభ్యులు తమ స్వంత చిత్రాలను మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయ వచ్చు. వాటిని ఎవరైనా పదములలో ఉపయోగించ వచ్చు. అప్ లోడ్ చేసిన చిత్రాలకు అనుమతి లైసెన్స్ చేర్చండి. అప్‌లోడ్ అనే మీట నొక్కినప్పుడు తెరుచుకున్న పేజీలో వివరాలు చూసి అర్ధము చేసుకుని తరువాత మీ సిస్టములో చేచిన పదాలను చేర్చండి. చేర్చే ముందు చిత్రాలకు మీరు ఆంగ్లములో పేరు మార్చి తరువాత చిత్రాన్ని చేర్చండి. అలా చేస్తే ఆ చిత్రాలను ఈతర ఏవికీలో నైన్ వాడుకునే మార్గం సులువౌతుంది. మీరు చేర్చిన చిత్రాలకు అనుమతి లైసెన్స్ ఇవ్వండి. అప్లోడ్ పేజీలో సారాంశం పక్కన ఉన్న బాక్స్‌లో {{}} అనే మూస లోపల అనుమతి అన్న మాట వ్రాయండి. చిత్రానికి లైసెన్స్ చేరుతుంది కనుక ఆ చిత్రం ఉపయోగంగా ఉంటుంది. లైసెన్స్ చేర్చని చిత్రాలను డి లింకర్ అనే బాటు ఆటో మేటిక్‌గా తొలగిస్తుంది కనుక అనుమతి అనే లైసెన్స్ చేర్చడం అవసరం.

విక్షనరీలో దిద్దుబాట్లుసవరించు

 • సూచన: ప్రయోగాశాల పుటని వుంచగలరు. లేదా తెల్లగా (ఖాళీగా) వుండే పుటను కేటాయించ గలరు. విక్షనరీ లో తెలుగులో ప్రత్యేక ఒక పుటను వ్రాసుకునేందుకు వీలు కల్పించగలరు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 01:28, 18 అక్టోబరు 2010 (UTC)

 • సభులు తమ ప్రయోగాలను ఇక్కడ ఉన్న లింకును నొక్కి తరువాత చేయవచ్చు.

సభ్యుల ప్రయోగాలు