సతిపట్ఠాన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
[బౌద్ధ]
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సంస్కృత శబ్దం స్మృతి ఉపస్థాన. సంస్కృతంలో సమ్యక్ స్మృతి అని వ్యవహరిస్తున్న ‘సతి’ అష్టాంగ మార్గంలో ఏడవది. దీనికి కూడా ఒక శక్తిగా (బల) గుర్తింపు ఉంది. ఆలోచనలు, కార్యాచరణ, ఆలోచనల వెనుక ఉద్దేశ్యాలు అనే ఈ మూడింటి పట్ల ఎరుక కలిగి ఉండటం సతిపట్ఠాన. ఈ మానసిక స్థితికి పునాదుల వంటి నాలుగు ధ్యాన మార్గాలు ఉన్నాయి. 1. స్మృతి కాయ, 2. స్మృతి వేదన, 3. స్మృతి చిత్త, 4. స్మృతి ధర్మ. (ఈ నాలుగవ అంశం విషయంలో భిన్నమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. మనస్సు దేనిని లక్షిస్తుందో దాని మీద దృష్టి నిలపడం అని ఒక వివరణ ఉంది.) మహాసతిపట్ఠాన సుత్తలోనూ, మజిమ నికాయలోనూ వీటికి వివరణలు ఉన్నాయి. స్మృతి కాయ/ కాయానుపస్సన అంటే ఉదాహరణకు ఆనాపానసతితో పాటు ‘‘పోతూ ఉండటం, కూర్చోని ఉండటం, నిలుచొని ఉండటం, పడుకొని ఉండటం’’ అనే స్థితులను గమనించడం (ఇరియాపథ), చేతనలో స్పష్టత, అవగాహన, శరీరంలోని 32 భాగాలను గురించిన ఆలోచన (కాయగతాసతి), నాలుగు భూతాలు, అంటే పృథివి, వాయువు, అగ్ని, జలం గురించి విశ్లేషణ. భావదృష్టి (వేదనాను పస్సన) అంటే మంచి చెడులతో గానీ, ఇష్టాయిష్టాలతో గానీ నిమిత్తం లేకుండా, ఇంద్రియ సంబంధంగా గానీ, ఇంద్రియా తీతంగా గానీ వచ్చే ఆలోచనలన్నింటిని గమనించడం. చేతనావస్థలో మనస్సు ఆశపడుతున్నదా, ఆశలేకుండా ఉన్నదా, దోవతప్పుతున్నదా, సరైన దోవలో ఉన్నదా, సంకుచితంగా ఉన్నదా, అయోమయంలో ఉన్నదా, ఏకాగ్రంగా ఉన్నదా, విముక్త స్థితిలో ఉన్నదా మొదలైన అంశాలతో నిమిత్తం లేకుండా మనస్సును గమనించడం (చిత్తానుపస్సన). మనస్సు దేనిమీదకు మళ్లుతున్నదో దానిని గమనించడం (ధమ్మానుపస్సన). ధ్యానంలో కలిగే విఘ్నాలను గమనించడం ఇందులో భాగం అవుతుంది. (సతిపట్ఠాన సుత్తలో ఈ వివరాలను పొందుపరిచారు.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు