సక్కాయ దిట్ఠి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఒక వ్యక్తి ఏదైనా పని చేసినప్పుడు ‘నేను’ చేస్తున్నానని అనుకోవడం సాధారణ భావన. పారమార్థికంగా బౌద్ధంలో అది భ్రమ. కూర్చొని ఉన్న ఒక వ్యక్తి లేచి నిలుచున్న ఒక ఉదాహరణ తీసుకొందాం. ఆ వ్యక్తి ‘నేను లేచి నిలుచున్నాను’ అనుకొంటాడు. అది సాధారణ భావన. కాని, బౌద్ధం దానికి లోతైన అవగాహన కలిగిస్తుంది. వ్యక్తి లేచి నిలుచొనాలని సంకల్పించడం నుంచి ఒక క్రమంలో కొన్ని పనులు జరుగుతాయి. తొలుత, నిలుచొనాలనే సంకల్పం కలుగుతుంది, అది మనస్సులో కలిగిన ఒక ఆలోచన. అది మెరుపువలె మెరిసి అదృశ్యం కాదు. సంకల్పం కార్య రూపం ధరించే వరకు అది అక్కడ ఆలోచనగానే ఉంటుంది. ఎవరైనా అనుభవ పూర్వకంగా తెలుసుకొనడానికి వీలైన ఈ ఆలోచన ‘నామ కాయ’. సంకల్పం కలిగిన వెంటనే అతడు ప్రయత్నించి లేస్తాడు. అలా లేచి నిలుచొనేటప్పుడు ఏదైనా ఆసరా కోసం చూడవచ్చు. మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని నొప్పి తోచకుండా చూసుకోవచ్చు, అతడి పరిస్థితిని బట్టి మరేమైనా కూడా చేయవచ్చు. ప్రయత్నించి లేచే క్రియ ‘రూప కాయ’. శరీరాన్ని ఈ క్రియలో ఉపయోగించారు కనుక ఇది ‘రూప కాయ’ అనే పద బంధానికి సరిపోయింది. ఈ రెండిటి కలయికే అనుభవం లోని తత్త్వజ్ఞానం. నామ, రూప కాయాల అవగాహన లేనప్పుడు వ్యక్తి ‘నేను చేస్తున్నాను’ అనుకొంటాడు. ఇలా అనుకోవడం సక్కాయ దిట్ఠి. లోకంలో ‘సక్కాయం’ కానిది ఏదీ లేదు. నామ, రూప కాయాల అవగాహన కలగడం ఈ భ్రమను తొలగిస్తుంది. సక్కాయ దిట్ఠి తొలగడం పది సంకెళ్లలో ఒకటి తొలగడం అవుతుంది. సాధకుడు సోతాపన్నుడు అవుతాడు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>