షష్ఠీ విభక్తి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి.
- శేషం అంటే సంబంధం. సంబంధం కనిపించినప్పుడు 'యొక్క' అనే విభక్తి వస్తుంది.......ఉదా: నా యొక్క మిత్రుడు; వాని యొక్క తమ్ముడు.
- నిర్ధారణ షష్ఠికి 'లోపల' వర్ణకం వస్తుంది. జాతి, గుణ, క్రియ, సంజ్ఞల చేత - ఒక గుంపు నుండి ఒకదాన్ని విడదీయడాన్ని నిర్ధారణ అంటారు.......ఉదా: మనుష్యుల లోపల క్షత్రియుండు శూరుండు.
- షష్ఠీ విభక్తిలోని 'ఒక్క' శబ్దము 'ఒ' యను ప్రణష్టధాతువుయొక్క ధాతుజన్య విశేషణము. ఇక్కడ ఒ = కూడు, లేక చేరు అని తెలుపును.ఈ ధాతువునకు అరవమున స్వతంత్ర ప్రయోగము కలదు. అరవమున ఈధాతువనకు 'కూడిన,చేరిన,ఒప్పిన' అని అర్ధము కలదు. లోపల- ఇది ఒక్క శబ్దము.ఇది నిర్ధారణ షస్ఠియందు వచ్చుచున్నది.దీని అర్ధమును బట్టి ఇది సప్తమిరూపమనియే చెప్పుచున్నారు.కాని సంస్కృతమున నిర్ధారణమున షష్ఠి ప్రయోగింపబడును.కావున, సామ్యమున ఇది వైయ్యాకరణలుచే ప్రవేశపెట్టినట్లుగా తోచుచున్నది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు