షడధ్వలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>శైవ సంప్రదాయంలో సాధనకు సంబంధించిన ఆరు అధ్వాలు ఉన్నాయి. అధ్వం అంటే మార్గం. ఆరు ఇవీ : 1. కళాధ్వం, 2. భువనాధ్వం, 3. తత్వాధ్వం, 4. వర్ణాధ్వం, 5. సదాధ్వం, 6. మంత్రాధ్వం. కళాధ్వంలో నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, శాంత్యతీత అని ఐదు విధాలైన కళలు ఉన్నాయి. భువనాధ్వంలో భద్రకాళి మొదలైన అనేక భువనాలు ఉన్నాయి. తత్వాధ్వంలో ప్రకృతి, పృథివి, బుద్ధి, మొదలైన 36 తత్వాలు ఉన్నాయి. వర్ణాధ్వంలో అం, ఆం, ఇం, ఈం మొదలు క్షం వరకు 51 వర్ణాలు ఉన్నాయి. పదాధ్వంలో మహాదేవ, సద్భావేశ్వర మొదలైన 81 పదాలు ఉన్నాయి. మంత్రాధ్వంలో సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం, హృదయం, శిరస్సు, శిఖ, కవచం, నేత్రం, అస్త్రం అనే పదకొండు విధాలు ఉన్నాయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు