వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. చేది రాజు మరియు శ్రీకృష్ణుని ద్వేషి.
  2. చేది దేశపు రాజు. దమఘోషునకు వసుదేవుని చెలియలు అయిన శ్రుతశ్రవ వలన పుట్టిన కొడుకు. వీఁడు చతుర్భుజ లలాటనేత్రములతో పుట్టి పుట్టినతోడనే రాసభస్వరమున ఏడ్చుచు ఉండఁగా తల్లిదండ్రులు భయమును విస్మయమును కలవారై ఏమి తోచక ఉండిరి. అప్పుడు అశరీరవాణి ఎవఁడు ఎత్తుకొనునపుడు వీని లలాటనేత్రమును రెండుచేతులును అడఁగిపోవునో వాఁడు వీనిని చంపును. కనుక మీరు ఇందులకు విచారపడక నెమ్మదిని ఉండుఁడు అని పలికెను. అంతట వీని తల్లిదండ్రులు తమ్ముచూడవచ్చిన వారికెల్ల వానిని ఎత్తుకొన ఇచ్చుచుండి, ఒకప్పుడు బలరామకృష్ణులు తమ మేనత్తను చూడరాఁగా వారిచేతికిని ఇచ్చి యెత్తుకొమ్మనిరి. అప్పుడు కృష్ణుఁడు ఎత్తుకోఁగానే వీని నొసటికన్నును రెండుచేతులును అడఁగిపోయెను. అంతటవారు ఆశ్చర్యపడి తమ కొడుకును నూఱు నేరములు చేయునంతవఱకు మన్నించునట్లు కృష్ణుని ప్రార్థించి వరము పడసిరి. పిమ్మట బహుకాలమునకు ధర్మరాజు రాజసూయ యాగము చేయుచు ఉండఁగా అచ్చటికి వచ్చి కృష్ణుని పలుతెఱగుఁల నిందించి అతనిచేతనే చచ్చెను. చూ|| దంతవక్త్రుఁడు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>