శంఖన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒకరాజభవనములో నొకశంఖము గలదు. అనుదినము నిర్ణీతసమయమునకు నియమితభటుఁ డొకఁ డాశంఖము నూదును. ఆవేళకు సరిగా సేవకు లందఱు హాజరై తమ తమ పనులలోఁ బ్రవేశింపవలయును. కారణాంతరముఁ నెన్నఁడేని నాశంఖము పూరింపఁబడకపోయినను సేవకులు అదేసమయమునకు అనఁగా శంఖపూరణవేళ నతిక్రమింపక హాజరై తమపనులలో ప్రవర్తింతురు. అట్లు ప్రవర్తింపవలయునుగూడ. అదేవిధమున- "శంఖన్యాయేనోపలక్షకస్యాగ్నీషోమీయ పురోడాశస్యైవాభావేఽప్యుపలక్ష్యే కాలే యాగోఽస్తి యథా శంఖవేలాయా మాగంతవ్య మిత్యాది....." ఒకపురోడాశమున రెండు పురోడాశములు ప్రయోగింపఁ బడవు. ఉద్దిష్టపురోడాశావసరమున కర్తవ్యయాగ మొండు గలదు. అగ్నీషోమీయపురోడాశము ప్రయోగింపఁబడిన పోయినను తదుపలక్ష్యమవు కాలమున నావిహితయాగము నాచరింపవలసి యున్నది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు