విషకృమిన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

విషములో పుట్టినపురువు విషమే తిని జీవించునట్లు. చాణక్యనీతిదర్పణమున నీన్యాయము నుద్బోధించుచు నిట్లు నుడువఁబడియున్నది. "విప్రాస్మి న్నగరే మహాన్‌ కథయ కః? తాలద్రుమాణాం గణః; కో దక్షః? పరవిత్తదారహరణే సర్వోఽపి పౌరో జనః; కోదాతా? రజకో, దదాతి వసనం ప్రాత ర్గృహీత్వానిశి; తత్కిం జీవసి హే సఖే? విషకృమిన్యాయేన జీవామ్యహమ్‌." (ఒక బ్రాహ్మణుఁ డొకయూరికి యాచనకై యేఁగి యూరివెలువల కాన్పించిన బ్రాహ్మణుని యూరి పరిస్థితులు దెలిసికొను తలంపున నిట్లు ప్రశ్నించెను. వెనువెంటన ఆ బ్రాహ్మణుఁడుకూడ సమాధానము నిచ్చెను. "ఓ విప్రుఁడా! ఈయూరిలో నందరికన్న గొప్పవాఁడెవఁడు?" -"అదిగో, ఆ కనఁబడు తాడితోపు." "ఇచట సమర్థుఁ డెవఁడు?" - "పరుల ధనమును, భార్యలను అమాంతముగ దొంగి లించుటయం దీయూరివా రందఱును సమర్థులే." "పోనీ, దాత ఎవఁడో వినిపింతువా?" -"చాకివాఁడు. అతఁ డొకఁడే ఈయూర మహాదాత, ఎందువలన నందువా? ఉదయము తీసికొనిపోయిన గుడ్డలను రాత్రికి మఱల తెచ్చియిచ్చున్నాడు." "అయిన నీయూరిలో నెట్లు జీవించుచున్నావోయి?" - "అయ్యా! ఏమి చెప్పను? విషకృమిన్యాయముగా జీవించుచున్నాను." అనగా యీయూరఁ బుట్టినవాఁడ నగుటచే నిచటిప్రకృతి కలవాటుపడి బ్రదుకుచున్నాను అని భావము.) విషములోని పురువునకు విష మిష్టాహారమే. అవిషము దాని కేమియు హాని చేయదు; కాని, యితరులకుమాత్రము హానికర మవును." "What is one man's food is another man's poison." (ఒకనికి ఆహార మయిన వస్తువు మఱొకనికి విషమవును. ఒకరిమేలు మఱొకరికి కీడు.) పై విషకీటన్యాయము, ఈ విషకృమిన్యాయము రెండు నొకటియే.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>