వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి
వియ్యం అనగా పెళ్ళి. కయ్యం అనగా యుధ్ధం, పోరాటం. పెళ్ళి సంబంధం వెతికేటప్పుడు తమ ఆస్తీ అంతస్థులకు సరితూగే కుటుంబాన్ని వెతకాలి. లేదా నూతన వధూవరుల కాపురంలో ఆ అసమానతల కారణంగా కలతలు రావచ్చు. అలాగే ప్రత్యర్థి మనకు భుజబలంలోనూ, బుధ్ధిబలంలోనూ సరిసమానుడైతేనే పోరు రక్తి కడుతుంది. బలహీనుని ప్రత్యర్థిగా ఎంచుకొనడం వీరుల లక్షణం కాదు అని చెప్పటానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.