విక్షనరీ చర్చ:మూలస్వరూపం/ రూపం2/అమ్మ
తాజా వ్యాఖ్య: రూపం టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
- ఇది బాగా ఉంది దీనిని కొనసాగించ వచ్చు.--T.sujatha 07:09, 11 జూన్ 2012 (UTC)
- ధన్యవాదాలు. ఇంకో ఆలోచన సంబంధిత పదాలకు ప్రత్యేకపేజీలు అనవసరం అంటే లింకులు పెట్టనవసరం లేదు అని నా ఆలోచన. వెతికినప్పుడు ఎలాగు అవి వున్న పేజీ కనబడుతుంది.--అర్జున (చర్చ) 08:59, 11 జూన్ 2012 (UTC)
- కొన్ని పదాలకు లింకులు ఉంటే బాగుంటుంది. కొన్ని సార్లు లింకులు చూసి కూడా ఆశక్తి కలుగుతుంది. నేను తెవీకీలో, ఆంగ్లవీకీలో అలా వెతుకుతుంటాను. అది సులువని నా అభిప్రాయం. లింకుల విషయంలో ఎవరికి తోచినట్లు వారు వ్రాయచ్చు కదా. --T.sujatha 12:41, 11 జూన్ 2012 (UTC)
- సంబంధిత పదాలకుకావలసింది వ్యాకరణ విశ్లేషణ మాత్రమే అమ్మ+అమ్మ=అమ్మమ్మ ... సంధి అని. అది మూలపదం పేజీలో రాస్తే సరిపోతుంది. అప్పుడు మన తెలుగు విద్యార్థులకు ఉపయోగపడుతుంది :-). అందుకని ప్రత్యేక వ్యాసం అవసరంలేదని నా అభిప్రాయం
- సంబంధిత పదాలు అంటే వ్యాకరణ విశ్లేషణ కాదు. పాత డిక్షనరీలలో ఉన్నట్లు ఆ పదాన్నికి సంబంధించిన పదాలను చూపడం. విక్షనరీలో ఈ విధమైన పని అంతగా జరగ లేదు. సరి అయిన అవగాహన లేక పోవడమే అందుకు కారణం. ఉదాహరణగా అమ్మ సంబంధిత పదాలు ఇవిగో చూడండి. అమ్మమ్మ, చిన్నమ్మ, పెదమ్మ, అమ్మగారు, ఆటలమ్మ, అమ్మవారు, అమ్మగారూ, అమ్మవంటి, అమ్మలా, అమ్మతో, అమ్మకు, అమ్మకొరకు, అమ్మకే మొదలైనవి. ఇలాంటివి వ్రాయాలి అన్నది నా అభిప్రాయం. --T.sujatha 03:22, 13 జూన్ 2012 (UTC)
- ఇటువంటివాటికి తెలుగు భాష వ్యాకరణం నేర్చుకున్నవారికి, లేక మాట్లాడేవారికి ప్రత్యేక వివరణ అవసరంలేదు. ఎందుకుంటే ఈ పదాలన్నీ విభక్తులు చేర్చటంతో సమాసాలుగానో లేక ఇతర పదాలతో కలసి సంధులుగానో మారినవే. ఇలా రాస్తూవుంటే విక్షనరీలో పేజీల సంఖ్య పెరుగుతూవుంటుంది కాని జ్ఞానం పెరగదు అని నా వుద్దేశ్యం. అదే వేరే వ్యుత్పత్తి నుండి ఏర్పడిన పదాలైతే ప్రత్యేక పద పుట వుపయోగంగా వుంటుంది--అర్జున (చర్చ) 07:14, 13 జూన్ 2012 (UTC)