విక్షనరీ:వర్తమాన ఘటనలు
తెలుగు విక్షనరీ
<small>మార్చు</small>పదముల సహాయము
<small>మార్చు</small>- మన వాడుక భాషలో అనేక తెలుగు పదాలు వున్నాయి.
- ఒక పదానికి అర్ధములు అనేక రకములుగా ప్రయోగిస్తాము.
- ఒకే అర్ధానికి అనేక పదాలు వున్నాయి.
- తెలుగు యాసలు, ప్రాంతాలు ఇలా అనేకం.
- ఒకే అర్ధము వచ్చే తెలుగు పదానికి ఒకే ప్రాంతనికి చెందినది వాడుకులోకి తెస్తే మిగతావి మరుగున పడి పోతాయి. ఆ ఒక్క పదాన్ని తెలుగు ప్రజలు పది రకాలుగా మార్చుతునే వుంటారు. దానికి కారణము ప్రాంతీయ అభిమానము, ఆ నేల మీద వున్న భక్తి భావము..
- పదాలు యెన్ని అవుతాయో లెక్కలు చెప్పాలంటే ఎవరమూ చెప్పలేము.
- పదాలు యెన్ని అయినా వ్రానే వాళ్ళని వ్రాయనీయండి. మనకు కూడా తెలుస్తాయి. తెలుసుకుని ఆ పదాలు కూడా ప్రయోగించేందుకు ప్రయత్నించవచ్చు.
- నేను విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిని. కొత్త తరాల వారు మాండలీకాలు, పర్యాయ పదాలు, నానా అర్ధాలు, ప్రాసాక్షర పదాలు, ఇలా అనేకము తెలుగు పదాలు తెలుసుకో గలుగుతారు.
- అందరినీ ముందు ప్రొత్సహించుదాము. ఆ తరువాత నకలు తయారు ఎలా చేయాలో ఆలోచించవచ్ఛు.
- తెలుగు పదాలు ప్రాంతాల వారీగా ఆ తరువాత తయారు చేసుకోవచ్ఛును.
- ప్రపంచములో అన్ని దేశాలలో తెలుగు వారు వున్నారు. ఒక మాండలీకములో మాత్రమే అర్ధము తెలియజేస్తే వారికి సరి అయిన అర్ధము రాక పోవచ్చును.
- సందర్భాన్ని బట్టి ఒకే పదాన్ని అనేక అర్ధాలుగా పదాన్ని ప్రయోగించవచ్చు. ఇంకా చేయవలసిన పనులు చాలా వున్నాయి.
- ఎవరికి తోచిన విధముగా వారు పదాలను పైకి తీసుకొని వచ్చి, ఆపై వాటి గురించి అలోచనలు తరువాత ఆలోచిద్దాము.
- వంకాయలు వంద రకాలు వున్నాయి. అన్నీ ఒకే చోట చేర్చలేము. అని చెప్పి ఒకే దానికి పరిమితము చేయలేము. ఎందుకంటే ఎవరి వంకాయ వారిది వుంచాలని చూస్తారు. అందరి (అన్ని ప్రాంతాల) వంకాయలు పెట్టనీయండి. వాటిని ఒక చోటకు తరువాత చేర్చవచ్చు. ముందుగానే తీసివేయడము ఎందుకు ?
- ముందు అందరినీ రమ్మని ఆహ్వానిద్దాము. ఆంక్షలు, సలహాలు, సూచనలు, విమర్శలు ఇలా ప్రయత్నించే కంటే ముందు ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటే మనసులు అర్ధమవుతాయి.
- మన ఆశ ఆశయాలు కూడిన మనమందరము ఒకటే అన్నభావము చాలా గొప్పది.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 01:45, 7 నవంబరు 2010 (UTC)
మే-2011-తెవికీవార్తలు
<small>మార్చు</small>http://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_వార్త/201_1-05-29/మే-2011