విక్షనరీ:బ్రౌణ్య ఆంగ్ల-తెలుగు పదకోశము Bin-Blessing


Bin, n. s. తొట్టి, గాదె. corn * వడ్లకళంజము.

To Bind, v. a. కట్టుట, బంధించుట. they bound him with fetters వాడికి
సంకెళ్ళు వేసినారు. he bound the serpent with spells ఆ పామును 
తడకట్టినాడు. to * a book పుస్తకమును జిల్లుకట్టుట. this food binds the
belly యీ ఆహారము మలమును బంధిస్తున్నది. they bound him over to
prosecute వాడివద్ద ఫిర్యాదు ముచ్చలిక తీసుకొన్నారు. they bound him
over to keep the peace దుష్టతనము చేయకుండా జామీనుపుచ్చుకొన్నారు.
he bound himself by a curse to do this దీన్ని చేస్తానని వొట్టుపెట్టు
కొన్నాడు. this ship is bound to Calcutta యిది కలకత్తాకు పొయ్యేవోడ.
I am bound to confess it నేను దాన్ని వొప్పు కోవలసి వచ్చినది. I will be bound to say he is gone వాడు నిశ్చయముగా పోయి వుండును.
I am bound to him by many ties నేను అనేక విధాల అతనికి బధ్దుడై వున్నాను.
I am your bounden servant నేను తమకు బద్ధుడైన దాసుణ్ని.

Bindes, n. s. కట్టేవాడు. a book * పుస్తకములు జిల్దు కట్టేవాడు.

Binding, n. s. జిల్దు.

Binnacle, n. s. వాడలో కుంబాసు పుండే పెట్టె.

Biographer, n. s. మనిషి యొక్క కీర్తిని, లేక, చరిత్రను వర్ణించేవాడు.

Biographical, adj. మనిషి యొక్క చరిత్ర సంబంధమైన. a * account
of Sancara శంకర విజయము.

Biography, n. s. చరిత్ర, ఒక మనిషి యొక్క చరిత్ర. the * of Nala 
నల చరిత్ర.

Bipartite, adj. ద్విభాగముగా వుండే. a * agreement యిద్దరుగా చేరి
వ్రాసి యిచ్చిన వొడంబడిక, పరస్పరము వ్రాసుకొన్న వొడంబడిక.
the Amaracosa (a certain Vocabulary) is tripartite
అమర కోశము మూడు కాండలుగా వున్నది.

Biped, n. s. ద్విపాజ్ఙంతువు. or man పశుప్రాయుడైన మనిషి 
ద్విపాత్పశువు.

Birch, n. s. ఒక తరహా చెట్టు. or twig చువ్వ, దీనితో పల్లెకూటపు
పిల్లకాయలను కొట్టుతారు. he wielded the * twenty years
యిరువైయేండ్లు పల్లెకూటము చెప్పినాడు.

Birchen, n. s. Birch అనే మానితో చేసిన.

Bird, n. s. పక్షి, పిట్ట. a chintz of bird's eye pattern 
బొట్లు బొట్లుగా వుండే చీటిగుడ్డ. a bird's eye view ఒక తరహా చిత్రము,
ఆకాశమునుంచి చూచే పక్షికి వూరు మొదలైనవి యేరీతిగా అగుబడుతున్నవో
అదే రీతిగా వ్రాసిన పఠము. the * that weaves a hanging bottle-
shaped nest గిజిగాడు. the tailor * జీనువాయిపిట్ట. the maina *
గోరింకపిట్ట. the paddy * బహుదినాలుగా బందేఖానాలో పడివుండేవాడు.

Bird-lime, n. s. జిగురు, బంక, పక్షులను పట్టే పిసును.

Birth, n. s. జన్మము, పుట్టుక. a man of * or a man of high *
కులీనుడు. or childbed ప్రసూతి, ప్రసవము. a leper by * పుట్టు
పాప. or employment ఉద్యోగము. this gave * to many disputes
యిందువల్ల అనేక కలహములు పుట్టినవి. she gave * to a child
అది బిడ్డ కన్నది. he had his * there అక్కడ పుట్టినాడు. new *
పునజ ్న్మము, పునజ ్న్మము. a place in a ship స్థానము, ఉనికిపట్టు.
the soldiers went to their respective births సోజర్లు వాండ్ల 
వాండ్ల స్థానానికి పోయినారు.

Birthday, n. s. పుట్టినదినము.

Birthplace, n. s. జన్మభూమి, పుట్టినచోటు.

Birth-right, n. s. పుట్టుకచేత వచ్చిన స్వాతంత్య్రము. this is my *
యిది నా పిత్రార్జితము.

Biscuit, n. s. బిస్కత్తు, చక్కిలము, పాల కాయవంటిది.

To Bisect, v. a. రెండుగా ఖండించుట, రెండుగా భాగించుట.

Bisection, n. s. రెండుగా ఖండించడము.

Bishop, n. s. ప్రధాన గురువు, పెద్దపాదిరి. (ధర్మాధిపతి. ST ). at
Jerusalem the word is Vakeel! See Robinson's Biblical
Researches in Palestine 3. 456. (A. D. 1841). * at chess
శకటము, రథము, వొంటె.

Bishopric, n. s. ప్రధాన గురుత్వము.

Bishops-weed, n. s. వోమపుచెట్టు, వోమము, ఖురాసానివామము.
The Sansc. name is దీప్యము, కరాలము. (Hyoscyamus)

Bismuth, n. s. తగరమువంటి ఒక లోహము.

Bisnagur, n. s. అనగా విజయనగరము.

Bison, n. s. మనుబోతు, కారెనుము, కార్బోతు.

Bissextile, n. s. or Leap-year అధిక సంవత్సరము, అనగా మూడేండ్లకు
ఒకమాటు ఫిబ్రవరి నెలకు 29 తేదులు వచ్చే సంవత్సరము.

Bister, n. s. a brown colour చామని చాయ.

Bistoury, n. s. సత్రము చేసే కత్తి.


Bit, n. s. తునక, తండు, ముక్క, తునియ. there is not a * of reason
in this యిందులో రవంతైనా న్యాయములేదు. a * of glass అద్దపుతునక.
a * of butter వెన్నపూస. a * of cloth గుడ్డ తునక, పేలిక. a * or
piece of wood మాను, కర్ర, చెక్క. a * of ground కొంచెము నేల. a * of 
food కబళము. I have not eaten a * to-day నేను నేడు ఒక కబళమన్నా
తినలేదు, ఒక మెతుకన్నా తినలేదు. a little * రవంత. every * యావత్తు.
a * of an account కొంచెములెక్క. a * of a child కూన. she did not
stir a * అది రవంతైనా కదలలేదు. * by * he ate all of it రవంత
రవంతగా దాన్ని అంతా తినివేసినాడు. To break to bits పొడిచేసుట.
the * of a bridle కళ్ళెపు కుక్కలు. I have got the * but ro bridle
నోటికి వేసే యినప కళ్ళెము వున్నదిగాని దానికి తగిలించి యీడ్చేవారులేదు.


To Bit, v. a. కళ్ళెము వేసుట, కళ్లెముపెట్టుట.

Bitch, n. s. ఆడకుక్క. a * fox ఆడనక్క.  * of wolf ఆడతోడేలు.
a whore లంజ.

To Bitel, v.  a. కొరుకుట, కరుచుట, కుట్టుట, the snake bit the man
వాణ్ని కొరికింది. the flies * the horse గుర్రాన్ని యీ గెలు 
కుట్టుతవి. the moskitoes bit me నన్ను దోమలు కుట్టినవి. the rats
have bitten this table యెలుకలు యీ ఆవాలు. biting cold
కరిచేచలి, మహత్తైనచలి. biting sarcasm క్రూరమైన తిరస్కారము.
he made a biting remark వాడు అతి తీక్ష్ణమైన ఒక మాట చెప్పినాడు.
or to cheat మోసము చేసుట.   In selling me this horse he bits
me యీ గుర్రమును నాకు అమ్మడములో మోసము చేసినాడు. they bit
the dust చచ్చిరి. he made them * the ground వాండ్లను సంహరించినాడు.


To Bite, v. n. గాలములో పడుట. the fish * well to-day నేడు 
చాపలు విస్తారము గాలములో పడుతవి. he was bitten with their 
opinions వాండ్ల గుణములు వీడికి బాగా పట్టుబడ్డవి.

Bite, n. s. కాటు.

Bitten, adj.  కొరికిన 

Bitter, adj. చేదైన. the * melon వెర్రి పుచ్చకాయ. or cruel క్రూరమైన.
a * foe క్రూరశత్రువు. or intense అతి, చెడ్డ. he is in * grief 
వాడు అతివ్యాకులముగా వున్నాడు. this was a bitter disappointment 
యిది మహత్తైన భంగము. * cold చెడ్డచలి, పాడుచలి. bitters చేదైన
కషాయము.

Bitterly, adv. క్రూరముగా, అతిశయించి. he reviled her * దాన్ని
నిండా తిట్టినాడు.

Bittern, n. s. తుంపొడిపక్షి, రాయితొలిచే గాడు అనే పక్షి. See Goatsucker.

Bitterness, n. s. చేదు. or malice చలము, పగ, విరోధము, వైరము. 
* of grief మహద్వాకులము. the * of death చావు భయము.

Bitumen, n. s. మట్టితైలము. also a crystallized foliated gypsum
or stalactite శిలాజిత్తు.

Bituminous, adj. మట్టితైల సంబంధమైన.

a Bivalve shell, n. s. కాకిచిప్ప, కప్పచిప్ప, ఆలిచిప్ప.

To Bivouack, v. n. రాత్రిపూట వయిలులో పండుకొనుట. In the Ann. Reg.
for 1809 p. 206. it is rendered a Wake.

To Blab, v. a. బయిట పెట్టుట, రహస్యమును బయిట విడుచుట.

Blabbed, adj. బయిటపడ్డ, బయిలుపడ్డ.

Black, n. s. or Blackness నలుపు కప్పు.  a blackmoor నల్లవాడు, అనగా
సద్దీవాడు. to wear * నల్లవుడుపు వేసుకొని వుండినది. Collyrim కాటుక.

Black, adj. నల్లని, నలుపైన. a large * ant గండుచీమ, కొండచీమ.
a small black ant చలిచీమ. they beat him * and blue వాడి
వొళ్ళంతా కమిలి పొయ్యేటట్టు కొట్టినారు, కందిపొయ్యేటట్టుకొట్టినారు.
the * art శూన్యము, పంపు, a very * crime అఘౌరమైన పాపము.
the * cock అడివికోడి. * earth రేగడభూమి. a * eyed girl
కువలయలోచన. a * eye దెబ్బతాకి కమిలిన కన్ను. he has got a * eye
వాడికన్ను దెబ్బతాకి కమిలి వున్నది. a handsome * girls (meaning
an English girl of dark complexion: Addison's Tatler)
చామని చాయగా వుండేపడుచు. Charles II. of England is described
as being a * man అతను చామని చాయగా వుండేవాడు. he looked * at me
నన్ను చూచి ముకము మాడ్చినాడు.

Black pulse, (name of a sort of gran).  మినుములు.

To Black, v. a. నల్లగాచేసుట, నలుపెక్కేటట్టు చేసుట. by touching
the pot I blacked my hands ఆ కుండను తాకినందున నా చేతులు మసి 
అయినది. he blacked my shoes నా చెప్పులకు నల్లవర్ణము వేసినాడు.

Blackamoor, n. s. అబ్బీవాడు, సిద్దీవాడు. this is never applied to the
people of India.

Blackberry, n. s. కలివే పండ్లవంటి ఒక తరహా అడివి పండ్లు.

Blackbird, n. s. కోకిలవంటి వకపక్షి.

Blackbook, n. s. పాప పురాణము.

Blackcattle, n. s. పశువులు, గొడ్లు.

To Blacken, v. a. నలుపుచేసుట. పేరు చెరుపుట, దూరుట. they blackened
his reputation వాడికీర్తిని చెరిపినారు.

To Blacken, v. n. నల్లబడుట, నలుపుట. when a man is hanged his face
blackens తూకులో వెయ్యగానే ముఖము నల్లగా పోతుంది.

Blackened, adj. నల్లబడ్డ. * with smoke పొగచూరిన.

Blackest, adj. మహానలుపైన. the * wickedness చెడు దుర్మార్గము.

Blackguard, n. s. పోకిరి.

Blackguardism, n. s. పోకిరితనము.

Blackguardly, adv. పోకిరితనముగా.

Blackhole, n. s. or dungeon అతి నిర్భంధమైన చెరసాల.

Blacking, n. s. శప్పాతుకు పూసే కాటుక.

Blackish, adj. కొంచెము నలుపైన, పొగురైన.

Black-lead, n. s. నల్ల సీసము.

Blackleg, n. s. పోకిరి, జూదగాడు.

Blackletter, n. s. పాత యింగ్లీషు అక్షరములు, ప్రాచీన యింగ్లీషు లిపి.

Blackmail, n. s. or protection money తమ్మును దోచుకోకుండా వుండడానకై
కాపులు పాళయ గాండ్లకు యిచ్చే కట్ణము.

Blackness, n. s. నలుపు, నైల్యము. from the * of the night రాత్రి
అంధకారముగా వుండినందున.

Blacksmith, n. s. కమ్మరవాడు, కరమలవాడు.

Blackstone, n. s. కత్తెరరాయి, నల్లరాయి.

Blackthorn, n. s. ఒక తరహా అడివి చెట్టు.

Blacktown, n. s. That part of Madras which is within the town
walls చన్నపట్ణము, అనగా ప్రహరికిలోగా వుండే పట్టణము. the *
and it's suburbs చెన్నపట్టణమున్ను దానిచుట్టూ పేటలున్ను.

Blacky, n. s. నల్లవాడు, యిది ప్రయోగించరాని శబ్దము.

Bladder, n. s. మూత్రపుతిత్తి, ఉచ్చబుడ్డ, దీన్ని గాలితో నిండించి మూతిని
బిగించికట్టి నీళ్ళలో వేసుకొని యీదుతారు. the gall * పైత్యపుతిత్తి
Sand in the * సికతామేహము, మూత్రకృఛ్ఛ్ర రోగము.

Blade, n. s. of a weapon అలుగు. of grass & c. ఆకు. when corn is in the
* పయిరు ఆకులో విడిచినప్పుడు. of an oar వడవతోనే కర్రయొక్క కొన ఆకు.
Shoulder * రెక్క. a gay young * సొగసుగాడు, ధీరుడు, ఘట్టి చిన్నవాడు.

Bladebone, n. s. Shoulder-blade రెక్క.

Blain, n. s. బొబ్బ, కురుపు.

Blamable, adj. నింద్యమైన, దూష్యమేన, కారాని, చెడ్డ.

Blamably, adv. తప్పుగా, అతిగా. he was * severe వాడికి అంత క్రౌర్యము
కారాదు. he was * negligent అతి అజాగ్రత్తగా వుండినాడు.

To Blame, v. a. తప్పుమోపుట, నిందమోపుట, నెపము పెట్టుట.

Blame, n. s. నింద, నెపము, తప్పు. this word has no plural.

Blameless, adj. నిరపరాధియైన, నిర్దోషియైన, తప్పులేని.

Blamelessly, adv. నిరపరాధముగా, నిర్దోషముగా, తప్పులేక.

Blamelessness, n. s. నిరపరాధిత్వము, నిర్దోషిత్వము.

Blameworthy, adj. నిందార్హమైన, దూష్యమైన.

To Blanch, v. a. తెలుపుచేసుట. or peel వొలుచుట తోలుతీసుట.
to * almonds బాదామును తోలువొలిచి తెల్ల పప్పుచేసుట. Fear blanched
his cheeks భయముచేత వాడి ముఖము తెల్లబడ్డది. Age blanched her head
ముదిమిచేత దాని తల నెరిసింది. blanched almonds తోలు వొలిచిన 
తెల్లబాదాంపప్పు.

To Blanch, v. n. తెల్లబారుట. their bones blanched in the winds వాండ్ల
యెముకలు ఘాలి చేత తెల్లబడ్డవి.

Bland, adj. శాంతమైన, సౌమ్యమైన, తిన్నని, మృదువైన. * language
మృదువైన మాటలు.

Blandishment, n. s. మృదుభాషణములు, తియ్యనిమాటలు, చల్లనిమాటలు.
or fondling లాలన, బుజ్జగింపు.

Blank, adj. ఉత్త, వట్టి. unwritten వ్రాయని. * paper వట్టి కాకితము,
వ్రాయని కాకితము. Leave a space * here యిక్కడ వ్రాయకుండా
కొంచెము చోటువిడువు. a * cadjan book అలేఖము. he looked very
* వాడి ముఖము వెల వెల బోయినది.    a poem written in * verse
యతి ప్రాసలేక చెప్పిన కావ్యము. a * catridge గుండులేని తోటా.
a * ticket వుత్త చీటి.

Blank, n. s. వ్రాయనిది, వ్రాయక విడిచిన స్థలము. he left blanks for 
the names పేర్లకుగాను వుత్తచోట్లు విడిచి పెట్టినాడు. his life is now
a perfect * వాడు యిప్పుడు మిక్కిలి నిర్విణ్నుడై వున్నాడు. In a lottery
ఉత్తచీట్లు. 

Blanket, n. s. కంబళి, గొంగళి.

To Blare, v. n. అరుచుట.

Blaring, adj. అరిచే, వాగే.

blarney, n. s. humbug వట్టి నోటిమాటలు, మాయమాటలు, బుజ్జగింపు మాటలు.

To Blaspheme, v. a.  (the literal meaning of this word is misapplication)
అప్రయోగము, దుష్పరయోగము.)  to speak irreverently of God దేవుణ్ని 
గురించి అమర్యాద మాట్లాడుట, దైవదూషణచేసుట. SNT. and BNT.
say నిందచేయుట. F. and R. say దూషించుట.

Blashphemer, n. s. దేవుణ్ని గురించి అమర్యాదగా మాట్లాడేవాడు, దూషణగా
మాట్లాడేవాడు. (SNT. and BNT. నిందకుడు.)

Blasphemously, adv. అమర్యాదగా, దైవదూషణగా. he spoke * దైవదూషణగా
మాట్లాడినాడు.

Biasphemy, n. s. దైవదూషణ, దైవనింద.    (F. and R. say దూషణము. SNT.
and BNT. say ఈశ్వరనింద.) Observe, that the common Hindu expressions
of adulation "you are my father and my mother; you are my God, 
are blasphemy in the judgment of the English: this is * నీవు నా
తండ్రి, తల్లి, నా దేవుడు అని పరులను అనడము తన తండ్రి, తల్లి, దేవుణ్ని
అవమానము    చేయడముగా వున్నది.

Blast, n. s. of wind ఘాలి దెబ్బ. he blew a * on the trumpet తుత్తార
వూదినాడు. or Blight కాటుక, ధాన్యగింజలకు పట్టే కాటుక.

To Blast, v. a. ధ్వంసము చేసుట, నాశము చేసుట. this, wind blasted
the corn యీ ఘాలిచేత పయిరు నశించినది.   the lightning has blasted
this tree ఆ చెట్టుమీద పిడుగుపడి యెండిపోయినది.  this blasted 
his hopes యిందువల్ల వాడి యాశ విఫలమైనది.

Blasted, adj. ధ్వంసమైపోయిన, చెడిపోయిన. It was * by a curse
శాపముచేత చెడిపోయినది. * ears of corn తాలు.

Blaze, n. s. జ్వాల, మంట. the house was in a * ఆ యిల్లు మండుతూ
వుండెను. I saw a great * ఒక మంటను చూస్తిని. or splendour 
కాంతి, తేజస్సు. these words put him in a * యీమాటలకు మండిపడ్డాడు.
She was then in the * of beauty అప్పట్లో అది అందముతో వెలుగుతూ
వుండెను.  the * of his fame వాడి కీర్తి యొక్క ప్రకాశము. the whole
town was in a * with the news ఆ సమాచారము పట్టణమంతా యేక గుబ
గుబలుగా వుండినది.

To Blaze, v. n. మండుట, జ్వలించుట. or shine ప్రకాశించుట.  the
blazing noon మిట్ట మధ్యాహ్నము.

To Blaze, v. a. ప్రచురభము చేసుట, ప్రకటన చేసుట, ప్రసిద్ధ పరచుట.
they blazed his charity aborad అతని ధర్మమును పొగిడిరి.

Blazing, adj. జ్వలించే, ప్రకాశించే, ప్రచురమైన.

To Blazon, v. a. వర్నించుట. to paint a coat of arms వంశ బిరుదాంకమునకు
వర్నము పెట్టుట. they blazoned his fame abroad వాడి కీర్తిని వర్నించినారు.

Blazon, Blazonry, n. s. వర్నన.

To Bleach, v. a. తెలుపుచేసుట, చలవచేసుట.
Age bleached her hair వృద్ధాప్యముచేత దాని తల నెరిసినది. to * cloth
చలవచేసుట.

To Bleach, v. n. తెల్లబారుట. their bones bleached on the earth 
నేలబడివుండే వాండ్ల యెముకలు తెల్లబారినవి.

Bleached, adj. తెల్లబారిన, చలవచేయబడ్డ.

Bleak, adj. జిల్లుమనివుండే. a * wind పండ్లు కట్టుకొనిపొయ్యే చలి.
a * place అతి శీతల ప్రదేశము.

Bleakness, n. s. అతి శీతలము.

Blear, adj. పుసులు కట్టిన, మసకగావుండే, మబ్బుగావుండే. * eyed
అవిటికండ్లుగల, జబ్బుదృష్టిగల. * eyedness దృష్టి మాంద్యము.

Bleared, మాశిన. * with weeping యేడ్పుతో యెర్రపారిన.

To Bleat, v. n. కూసుట, యిది మేకనుగురించిన మాట.

Bleat, n. s. మేకకూత.

Bled, the past of To Bleed.

To Bleed, v. n. నెత్తురకారుట, నెత్తురువచ్చుట. he bled much at the
nose వాడికి ముక్కులో విస్తారము నెత్తుర కారింది. his heart bled to see
her misery దాని అఘోరము చూచి వాడి గుండెలు పగిలినవి. he bled
to the extent of thirty guidness వాడికి ముప్పైగనీలు దాక చేయి
వదిలింది.

To Bleed, v. a. (or open a vein.) నెత్తురు తీసుట, కత్తివాటు వేసుట.

Blemish, n. s. కళంకము, దోషము. or defect కొరత. his character is
without * వాడి పేరుకు వక తక్కువలేదు.

Blemished, adj. కళంకముగల, దోషయుక్తమైన.

To Blench, v. n. జంకుట, సంకోచించుట.

To Blend, v. a. కలుపుట, మిశ్రమము చేసుట.

To Blend, v. n. కలుసుట, మిశ్రమమౌట

To Blended, v. n. కలపబడ్డ, మిశ్రమమైన.

To Bless, v. a. దీవించుట. అనుగ్రహించుట. to praise స్తుతించుట. Men * God,
God blesses men మనుష్యులు దేవుణ్ని స్తుతిస్తారు, దేవుడు మనుష్యులు
దేవుణ్ని స్తుతిస్తారు, దేవుడు మనుష్యులను అనుగ్రహిస్తాడు. (The Hindus imagine
it absurd that men should bless God) God blessed them with a son
స్వామివాండ్లకు ఒక కొడుకును కృపచేసినాడు. God blessed his efforts 
అతని యత్నములను దేవుడు వొనగూర్చినాడు. God * your Majesty     దేవుడు
తమను అనుగ్రహించుగాక. At last his native country blest his eyes 
తుదకు తన దేశమును మళ్ళీ చూచేటప్పటికి వాడి కండ్లపండుగ అయినది. * me!
అయ్యో అయ్యో, * your simplicity! అయ్యో పిచ్చివాడా, యివి రెండున్ను
తుచ్ఛ మాటలు.


----------------------------------------------------------------
98                           BLE                               
----------------------------------------------------------------   

To Bless, v. a. దీవించుట, అనుగ్రహించుట. to praise స్తుతించుట. 
Men * God, God blesses men మనుష్యులు దేవుణ్ని స్తుతిస్తారు, దేవుడు 
మనుష్యులు దేవుణ్ని స్తుతిస్తారు, దేవుడు మనుష్యులను అనుగ్రహిస్తాడు. [The 
Hindus imagine it absurd that men should bless God.] God 
blessed them with a son స్వామివాండ్లకు ఒక కొడుకును కృపచేసినాడు. 
God blessed his efforts అతని యత్నములను దేవుడు వొనగూర్చినాడు. 
God * your Majesty దేవుడు తమను అనుగ్రహించుగాక. At last his 
native country blest his eyes తుదకు తన దేశమును మళ్ళీ 
చూచేటప్పటికి వాడి కండ్లపండుగ అయినది. * me! అయ్యో అయ్యో. * your 
simplicity! అయ్యో పిచ్చివాడా, యివి రెండున్ను తుచ్ఛ మాటలు.

Blessed, adj. శ్రీ, శ్రీమత్, శుభమేన, దీవించబడ్డ, పుణ్యమేన, దివ్యమైన,
పావనమైన. that * book ఆ పావనమైన గ్రంధము. a * man or saint 
మహాపురుషుడు, సిద్ధుడు. a * day పుణ్యదివసము. * is the man that 
feareth God దేవుడికి భయపడేవాడు పుణ్యపురుషుడు. * are the merciful
దయారసము గలవాండ్లు ధన్యులు. SNT. The other versions say భాగ్యవంతులు.
he was * with a child స్వామి కటాక్షముచేత వాడికి ఒక బిడ్డ కలిగినది. 
his endeavours were * with success వాడి ప్రయత్నములు సఫలమైనవి. the 
* ముక్తులు. the realms of the * i. e. heaven పుణ్యలోకము, దేవలోకము. 
* bread ప్రసాదము.

Blessedness, n. s. Happiness భాగ్యము, సౌఖ్యము, సుఖము. heavenly
ముక్తి, మోక్షము. sanctity పరిశుద్ధత, పావనత. single * వివాహములేక
వుండడము, బ్రహ్మచర్యము, కన్నెరికము.

Blessing, n. s. దీవెన, ఆశీర్వాదము. or benefit వరము, అనుగ్రహము,
భాగ్యము, శ్రేయస్సు, శుభము, మంగళము. the blessings that God upon 
us దేవుడు మాకు వొసగిన వరములు. he is a * to the poor వాడు 
పేదలకు కల్పవృక్షము. the priest pronounced the * పురోహితుడు అనుగ్రహము 
చెప్పినాడు.