Bamboo, n. s. (a word taken from the Malay language) వెదురు. a large
* బొంగు . a long * గడ. the male * పోతువెదురు, ఘట్టి వెదురు. the female *
పెంటివెదురు, బొంగు. * colour (an absurd word) చామనిచాయ, పండు వెదురు
వర్ణము.
To Bamboozle, v. a. మోసపుచ్చుట, దగాచేసుట.
Ban, n. s. or curse శాపము. or forbidding నిషేధించడము. Marriage banns
పెండ్లినిగురించిన ప్రకటన, అనగా ఫలానివాడు ఫలానిదాన్ని పెంఢ్లాడబోతాడు
దీనికి యెవరైనా ఆక్షేపించే వారు కద్దా అని పాదిరిచేసే ప్రకటన.
Banana, n. s. or plantain అరటిపండు.
Band, n. s. or bandage, కట్టు, గాయకట్టు. there was a bras * round the top
of the pillar స్థంభము యొక్కకొనకు విత్తళిపొన్ను వేసివుండినది.
a staff with iron bands యినుపకట్లు వేసినకర్ర. a hat * టోపిచుట్టూ కట్టిన నాడా. mourning bands worn at funeral బద్దె, కర్మము చేసేటప్పుడు వేసుకొనే బద్దె.
a straw * or rope వెంటి. a * of gold lace సరిగెట్ట, సరిగెనాడా.
a snake with black bands నల్లకట్లపాము.
connection or union సంబంధము. this marriage formed a * between the two
families యీ వివాహముచేత రెండు కుటుంబములకు సంబంధము కలిగినది.
or company గుంపు, తెగ, కూటము. a * of thieves దొంగలగుంపు, దొంగలతెగ.
a * of soldiers శపాయీలదళము. of musicians మేళము, మేళ గాండ్ల జత.
or cravat పాదుర్లు, లాయర్లు మెడకు కట్టుకొనే ఒక తరహాగుడ్డ.
Bandage, n. s. కట్టు, గాయకట్టు, పుంటికట్టు.
Bandbox, n. s. తేలికైనపెట్టె, కాకితముతో, లేక, తేలికైన కొయ్యతోచేసిన
చులకనైనపెట్టె.
Banded, adj. గుంపుగావుండే, చారలుగల.
Bandicoot, n. s. a great rat, పందికొక్కు.
Bandicoy, n. s. (a certain herb) బెండకాయ.
Bandit, n. s. బందిపోటు దొంగ.
Banditti, n. s. plu. బందిపోటుదొంగలు.
Bandog, n. s. కావలికుక్క, రేచుకుక్క.
Bandy, n. s. a carriage or cart బండి.
To Bandy, v. a. పుట్ల చండాడుట, బదులుకు బదులు చేసుట, ప్రతికి
ప్రతిచేసుట, యిదిదండము, తిట్టు, కొట్లనుగురించినమాట.they
bandied the balls about చెండ్లాడిరి. they bandied compliments
ఒకరిని ఒకరు వందనముచేసుకొన్నారు. they bandied blows
ఒకరిని ఒకరు కొట్టుకున్నారు.
Bandy, adj. or crooked వంకరైన.
Bandy-legged, adj. దొడ్డికాళ్ళుగల.
Bane, n. s. poison విషము. evil చేటు, చెరపు. rats * యెలుకపాషాణము
hares * మొసలిచేటు మొక్క, మొసలిచేదు.
Baneful, adj. విషకారియైన, చెరుపైన, చేటైన, హానికరమైన. his *
advice వాడుచెప్పిన దుర్బుద్ధి. a * custom దుర్వాడిక.
To Bang, v. a. కొట్టుట, మోటుతనముగా మొట్టుట, బాదుట, ప్రహరించుట.
he banged me నన్ను బాదినాడు. he went out and banged the
door after him బయిటికిపోతూ తలుపును దఢాలున మూసినాడు.
Bang, n. s. దెబ్బ, మోటుదెబ్బ. the drug cannabis sativa గంజాయి,
బంగి.
Bangles, n. s. the Indian word for bracelets కంకణకులు,
కడియాలు. or anclets అందెలు.
Banians, n. s. (An old word for Hindus) హిందువులు. banian tree
మర్రిచెట్టు. An old word for Shopkeepers వర్తకులు, శెట్లు,
కోమట్లు. a banian dress సాదావుడుపు. a banian day వొళ్ళు
కుదురు లేకుండా వుండేదినము, యీకాలమందు యీ మాట
నిండా వాడికలేదు.
To Banish, v. a. వెళ్ళగొట్టుట, దేశములోనుంచి వెళ్ళగొట్టుట, దేశాంతరమునకు
పంపివేసుట, త్యజించుట. they banished him వాణ్ణి పరదేశములో
తీసుకొనిపోయి పెట్టినారు. he banished his wife పెండ్లాన్ని త్యజించి
నాడు. he banished these hopes యీ ఆశలను విడిచిపెట్టినాడు.
he banished himself from society అందరిని త్యజించి యేకాంతముగా
వుండినాడు. smoke banishes mosketoes పొగచేత దోమలు పోతవి.
Banished, adj. వెళ్ళగొట్టబడ్డ, దేశభ్రష్టుడైన. long * thoughts బహుదినాలుగా
లేడుండా వుండిన జ్ఙాపకము.
Banishment, n. s. వెళ్ళగొట్టడము, దేశాంతరమునకు పంపివేయడము. he is
now in * దేశత్యాగియైవున్నాడు.
Bank, n. s. కట్ట, గడ్డ, ఒడ్డు, తీరము. he raised a * కట్ట వేసినాడు. my house
is built on the banks of the river మాయిల్లు యేటి అంచున వున్నది. a little
hill తిప్ప, దిబ్బ, మిట్ట. a * for money కొఠీ.
To Bank, v. a. కట్ట వేసుట. they banked up the water నీళ్ళను అడ్డ కట్టినారు.
Banker, n. s. కొఠీదారుడు, సాహుకారు, సరాబు.
Banking, n. s. కొఠీవ్యాపారము, సాహుకారివ్యాపారము.
Bankinghous, n. s. కొఠీ.
Bank-note, n. s. నోటు.
Bankrupt, n. s. దివాలెత్తినవాడు.
Bankrupt, adj. దివాలెత్తిన.
Bankruptcy, n. s. దివాలుయెత్తడము.
Bankshall, n. s. రేవులో సరుకులు దించేగిడ్డంగి.
Banner, n. s. ధ్వజము, కొడి, టెక్కెము, పతాకము. after the * hoisted up
కొడియెక్కించిన తరువాత. a silken * పట్టుకొడి.
Bannian, n. s. See Banians.
Bannister, n. s. మిద్దెమెట్లగ్రాది, చెయిపిడి.
Bannock, n. s. a kind of Scotch bread ఒక తరహారొట్టె
Banus, n. s. See Ban.
Banquet, n. s. విందు.
Banqueting-house, n. s. విందుచేసే యిల్లు.
To Banter, v. a. యెగతాళిచేసుట, పరిహాసముచేసుట.
Banter, n. s. యెగతాళి, పరిహాసము.
Banterer, n. s. యెగతాళి చేసేవాడు.
Bantling, n. s. పిల్ల, యిది తిరస్కార శబ్దము.
Banyan, n. s. See Banians.
To Baptise, v. a. బాప్తీజించుట, బాటీజించుట, బాప్తిస్మమును చేయించుట,
మజ్జనము చేయించుట. The usual phrase in South జ్ఙానస్నానము
చేయించుట. is quite wrong. See Matt. 3. 11. Mark, 1. 4.
Baptism, n. s. బాప్తిస్మము. ( BNT, Or with the French pronunciation)
బాతేము, మజ్జనము. SNT.
Baptismal, a. బాతేమ సంబంధమైన.
Baptist, n. బాప్తిస్తుడు.(మజ్జాయితా SNT.బాప్తాయీజక BNT.స్నాన ్ . Rh.స్నాతకుడు
F.) The sect called Baptists, ఖ్రీస్తు మతములో ఒక మత భేదము. John the *
పూర్వకాలమందు వుండిన ఒక మహాత్ముడు.
Baptistery, n. s. జ్ఙాన స్నానము చేయించే స్థానము.
To Baptize, v. a. బాప్తిస్మమును చేయించుట, జ్ఙానస్నానము చేయించుట.
Bar, n. s. కమ్మి, కంబి, పాళము. a window with iron bars యినపకమ్ములు
వేసిన కిటికి of door గడియ, అర్గళము. of a gate అడ్డకర్ర. or
hinderance అడ్డి, అభ్యంతరము, ఆటండము, consanguinity
formed a * to the marriage వీడికి దాన్ని వివాహము చేయడానకు
జ్ఞాతిత్వము ప్రతిబంధకముగా వున్నది. of a harbour ముఖద్వారమును
మూసుకొనివుండే యిసుక దిబ్బ. In a song చరణము. place for
prisoners in a court ఖైదిని నిలిపేస్థలము. he practises at the
* అతను లాయరు పనిచూస్తాడు. In a tavern సారాయి అంగడిలో
అమ్మేవాడు కూర్చుండే స్థలము. or stripe of colour చార. the
tiger's skin has black bars పెద్దపులి తోలులో నల్లచారలు వున్నవి.
To Bar, v. a. అడ్డగడియ వేసుట. he barred the door ఆ తలుపుకు అడ్డుకర్ర
వేసినాడు, అడ్డగడియవేసినాడు. or to hinder ఆటంకము చేసుట,
అభ్యంతరము చేసుట. the length of time barred his claim కాల
విళంబము వాడి స్వాతంత్య్రమునకు అడ్డి అయినది.
Barb, n. s. చిల్ల, జిట్ట, తగులు. a pointed iron with one * చిల్లాకౌల,
or steed తురుకీ గుర్రము, యిది కావ్యమందు వచ్చేమాట.
Barbacan, n. s. బురుజు, కోటగోడలో ఫిరంగులు పెట్టే స్థలము.
Barbarian, n. s. a rude person అసభ్యుడు, అమర్యాదస్థుడు. a savage
అడివి మనిషి, చెంచువాడు.the * kings చెంచురాజులు. a cruel man
క్రూరుడు, కిరాతకుడు, నిష్కంటకుడు. Dr. Johnson says ( Boswell,
27 March 1772) " The mass of the Greeks and Romans were Barbarians
the mass of every people must be barbarous, where there is no
printing, and consequently knowledge is not generally diffused:
knowledge is diffused among the people by our newspapers. I am
talking of the mass of the people. We see even what the boasted
Athenians were. The little effect which Demosthenes's orations
had upon them shews that they were barbarians." In I Cor. XIV. II
మ్లేచ్ఛ. SNT. and BNT. అన్యులు. R. మూఢుడు. F.
Barbaric, adj. చెంచువాడ్ల సంబంధమైన.
Barbarism, n. s. in language యాచమాట, మిశ్రమభాష
Barbarity, n. s. cruelty క్రూరత్వము, నిష్కంటకత.
Barbarous, adj. rude, uncivilized మోటు. cruel క్రూర, నిష్కంటక. * language
యాచమాటలు. * people క్రూరలు, అడివి మనుష్యులు. In Acts XXVIII.
2. అసభ్యలోకా SNT. అన్యజాతి. F. అన్యులు. R.
Barbarously, adv. అతి క్రూరముగా, నిష్కంటకముగా.
Barbarousness, n. s. క్రూరత్వము, నిష్కంటకత్వము.
Barbecue, n. s. కోయకుండా వున్నది వున్నట్టే కాల్చినపంది.
Barbed, adj. చిల్లలుగల. a * hook చిల్లలుగల గాలము. a * horse
or horse in armour జీరావేసిన గుర్రము.
Barbel, n. s. ఒక తరహా చేప.
Barber, n. s. క్షవరకుడు, మంగలవాడు.
Barberry, n. s. ఒక తరహా పండు.
Bard, n. s. కవీశ్వరుడు.
Bare, adj. ఉత్త, వట్టి. * walis వుత్తగోడలు. they left him * వాణ్ని నిలువు
దోపుడుగా దోచుకొన్నారు. * shouldered భుజములు తెరుచుకొన్న
these labourers go with their bodies * యీ కూలివాండ్లు వొల్లు
తెరుచుకొనివుంటారు, అనగా పైన బట్ట వేసుకోక మొద్దులవలె తిరుగుతారు.
this storm lift the garden * యీ ఘాలివాన తోటను బయలు చేసివేసింది.
they lie on the * ground ఒట్టి నేలలో పండుకొన్నారు. By disease
cattle look very * రోగము చేత గొడ్లు చిక్కివున్నవి. he held out his
* arms చేతిమీద చొక్కాయలేక ఒట్టి చేతులను బయటికి చాచినాడు.
* branches of a tree ఆకులు రాలి మొండిగా నిలిచే కొమ్మలు. he rode
on the * back of the horse జీనిలేక వుత్త గుర్రముమీద సవారి చేసినాడు.
this wound laid the bone * యీ పుంటిచేత మాంసమంతా పోయి వట్టి
యెముక నిలిచినది. the market is * of goods అంగట్లో సరుకులు లేక
తుడిచిపెట్టినట్టు వున్నది. he left her * of money దానికి ఒక దుడ్డు
లేక విడిచిపెట్టి పోయినాడు. he walked * foot జోడులేక వుత్తకాళ్ళతో
నడిచినాడు. they all stood * or * headed అందరు టోపీలు తీసుకొని
బోడి తలలతో నిలిచినారు. these insects cannot be perceived with the
* eye యీ పురుగులు అద్దము లేక వుత్త కండ్లకు అగుపడవు. they
believed it on his * assertion వాడు వూరికె చెప్పినంతనే దాన్ని నమ్మి
నారు. your * promise is sufficient నీవు వుత్తమాట చెప్పితే చాలును.
he paid the * principal వుత్త అసలు చెల్లించినాడు. he behaved to them
with * civility వాండ్లకు మర్యాదగా నడిపించినానని అనిపించినాడు.
To Bare, v. a. తెరిచివేసుట. she bared her breast రొమ్ము మీద బట్ట తీసివేసినది.
he bared his arm చేతిమీది చొక్కాయను తీసినాడు, తొలగ తోసినాడు. he
bared the sword కత్తిని దూసుకొన్నాడు. the Surgeon bared the vein
నరము మీది తోలును దోచివేసినాడు.
Bare, past of Bear, నిభాయించినాడు, మోసినాడు, కన్నది. he * the blame
నింద మోసినాదు. she * a son కొడుకును కన్నది. this is old English
See To Bear, v. a.
Bare-faced, adj. సిగ్గుమాలిన, సిగ్గుచెడ్డ. * lie పచ్చి అబద్ధము.
Bare-facedly, adv. సిగ్గుమాలి, సిగ్గుచెడి.
Bare-foot, adv. ఒట్టికాళ్ళతో, చెప్పులు లేక.
Bare-headed, adj. ఒట్టితలగల, పాగా లేని, టోపిలేని, బోడి.
Barely, adv. or scarcely అరుదుగా, చాలీ చాలక. this is * enough యిది
చాలీ చాలక వున్నది. he is * alive వాడికి ప్రాణము వున్నదో పోయినదో
అనివున్నది. I had * arrived when he died నేను చేరీచేరక మునుపే
చచ్చినాడు.
Bareness, n. s. లేమి, లేకవుండడము. from the * of the trees ఆకులు లేక
చెట్లు బోడిగా వున్నందున.
Bargain, n. s. an agreement, ఒడంబడిక, ఒప్పందము, కరారు, బేరము.
if you do not pay me the money to-day it is no * యీ వేళ రూకలు చెల్లించక
పోతివా ఆ సరుకుకు నీకు సంబంధములేదు. he struck a * with us మాతో
బేరము చేసినాడు. the thing purchased or sold కొన్న, లేక అమ్మినసరుకు
when he brought his * home కొన్న సరుకును యింటికి తీసుకవచ్చేటప్పటికి
he bought the house at a good * యింటిని నయముగా కొన్నాడు. he bought
it at a bad * దానికి అధిక వెల పెట్టినాడు, గిరాకిలో కొన్నాడు. you have a
bad * నీవు చేసిన యుక్తి పిచ్చి పోయినది. he made the best of a bad *
యీ కాలానికి యిట్లా వుండవలసిన దనుకొన్నాడు. into the * సహితము కూడా
పైగా, సమేతు. he bought the house and the garden into the * ఆ
యింటిని తోటతో కూడా కొనుక్కొన్నాడు. he is a liar and a drunkard into
the * వాడు అబద్ధీకుడే కాకుండా తాగుబోతున్ను.
To Bargain, v. a. బేరము చేసుట. he bargained with me but settled nothing
నాతో బేరము చేసినాడుగాని ఒకటీ కుదరలేదు. I will employ you; but I *
one thing, that you must come early నిన్ను పనిలో పెట్టుకొంటాను అయితే
ఒకమాట; నీవు వుదయాన రావలెను. I cannot * with you నీతో నేను బేరము
చేయలేను.
Bargaining, n. s. బేరము, కొనడము, అమ్మడము.
Barge, n. s. ఒక తరహా పెద్దపడవ, విహారమునకు, లేక, వ్యాపారమునకు
ఉపయుక్తమైనది. * man పడవవాడు.
Barilla, n. s. ఒక తరహా క్షారము, వుప్పు.
Bark, n. s. పట్ట, మానిపట్ట, వల్కము. the inner * లోనిపట్ట. the outer *
or day బొబ్బర, బరదు. a medicine జ్వరానికియిచ్చే బార్కు పట్ట చూర్ణము.
or vessel చిన్నవాడ, పడవ. voice of a dog కుక్క మొరుగు.
To Bark, v. a. పట్టవోలుచుట, పట్టకొట్టుట.
To Bark, v. n. మొరుగుట, కుక్క కూసుట.
Barley, n. s. బార్లిబియ్యము. * water బార్లి గంజి. * sugar ఒక తరహా మిఠాయి
యిది చక్కెర గోధుమపిండి కలిపి చేసినది.
Barley-corn, n. s. బార్లిగింజ, అంగుళములో మూడో భాగము.
Barm, n. s. కాడి, దీన్ని రొట్టెలు మొదలైనవి వుబ్బడానకు పులుసుగా
పెట్టుతారు, బీరుసారాయి చేయడములో దీన్నిన్ని పోస్తారు.
Barn, n. s. కణజము, కళంజము, ధాన్యకొఠారు.
Barnacle, n.s. ఒక తరహా నత్తగుల్ల. a bird ఒక తరహా బాతు.
Barometer, n. s. ఘాలి యొక్క ఎచ్చు తగ్గులను తెలియ జేసే ఒక యంత్రము,
దీన్ని బ్రామీటరంటారు.
Barometrical, adj. ఘాలియొక్క హెచ్చు తగ్గులను తెలియజేసే
యంత్రసంబంధమైన.
Baron, n. s. రాజు, దొర, జమీందారు, ఒక తరహా కితాబు గలవాడు.
The proper sense is యజమానుడు .Baronand Feme భార్యాభర్తలు.
Baronet, Viscount అనే దర్జాలకు నడిమిదైన బారన్ అనే కితాబు
గలవాడు.
Baroness, n. s. బారనుయొక్క భార్య.
Baronet, n. s. ఒక తరహా కితాబుకలవాడు, అనగా Baron, Knight అనే
కితాబులకు నడిమి కితాబు గలవాడు.
Barony, n. s. Baron అనే రాజుయొక్క దేశము. Baron అనే కితాబు.
Barrack, n. s. సోజర్లు సిపాయిలు వుండేశాల, దీన్ని బార్కసు అంటారు.
Barrel, n. s. ఒక తరహా పీపాయి. or tube గొట్టము. the * of a gun
తుపాకి గొట్టము. the belly of a horse గుర్రము యొక్క కడుపు.
To Barrel, v. a. గొట్టములో వేసుట.
Barrelled, adj. గొట్టముగల, నాళముగల. a double * gun రెండు గొట్టాల
తుపాకి.
Barren, adj. గొడ్డైన, ఫలించని. or feeble నీరసమైన, జబ్బైన. a *
woman గొడ్రాలు. * land పండని భూమి, చవిటినేల, ఊషరభూమి.
a * tree కాయనిచెట్టు. a * poet జబ్బుకవి.
Barrenness, n. s. గొడ్డుతనము, ఫలించక పోవడము, నీరసము, జబ్బు
. from the * of the soil ఆ నేల పండదు గనక.
Barricade, n. s. అడ్డు, అడ్డము, ఆటంకము, పరులను రానివ్వకుండా
కట్టిన అడ్డకట్టు. the * built with bamboos round the camp kept
the enemy in awe మా శిబిరానకు చుట్టూ వెదురుతో కట్టిన అలవచేత
శత్రువులు ఆచివుండిరి.
To Barricade, v. a. అడ్డుచేసుట, ఆటంకము చేసుట, అడ్డకట్టుట, దోవను
మూసుట. he barricaded the door with empty boxes లోగా యెవరిని
రానియ్యకుండా దారికి పెట్టెలను వేసి మూసినాడు. he barricaded the
street యెవరిని పోనియ్యకుండా వీధికి అడ్డకట్టినాడు.
Barricado, n. s. See Barricade.
Barricadoed, adj. అడ్డకట్టిన, ఆటంకము చేయబడ్డ.
Barrier, n. s. తడ, అడ్డు, ఆటంకము, హద్దు, సరహద్దు.
Barrister, n. s. వకీలు.
Barrow, n. s. for carrying earth & c. ఒంటి చక్రపు చెయిబండి. a hillock
తిప్ప, దిబ్బ.
Bartavelle, n. s. చకోరపక్షి.
To Barter, v. a. మార్చుకొనుట, వినిమయము చేసుకోవడము.
Basalt, n. s. ఒక తరహారాయి.
Base, adj. నీచమైన, తుచ్ఛమైన, అధమమైన, హేయమైన. * language
దుర్భాష. * coin తప్పు నాణెము. * fellow క్షుద్రుడు. * metal మట్ట
లోహము. * or mixed Telugu ఆ భాసాంధ్రము. a man of base extraction
పలు బీజపువాడు, కులగోత్రము లేనివాడు. * note in music మంద్రస్వరము
పాడినాడు.
Base, n. s. అడుగు, పీఠము, అస్థిభారము. in music మంద్రస్వరము.
on the * of friendship స్నేహమునుపట్టి.
To Base, v. a. అస్తి భారము వేసుట, ఆధారముగా చేసుట. this objection
is based on the law యీ ఆ క్షేపణకు చట్టము ఆధారముగా వున్నది.
they based the pillar on the rock ఆ స్తంభమును రాతిమీద నిలిపినారు.
Base-born, adj. పలుబీజమైన, పలువిత్తైన.
Based, adj. ఆధారముగల.
Baseless, adj. నిరాధారమైన.
Basely, adv. నీచముగా, తుచ్ఛముగా, హీనముగా.
Basement, n. s. అడుగు మట్టము, అడుగు పీఠము, మూలము. * floor
తళవరిళ, అడుగు దళము.
Baseness, n. s. నీచత్వము, తుచ్ఛత్వము, హీనత్వము, పోకిరితనము, పలవతనము.
from the * of the silver వెండిమట్టమైనందున.
Bashaw, n. s. పాదుషా, పాచ్ఛా. a pround man గర్విష్టుడు.
Bashful, adj. సంకోచముగల, కొంకుగల, సిగ్గుగల, బిడియముగల.
Bashfully, adv. సంకోచముగా, కొంకుగల, సిగ్గుగల, బిడియముగల.
Bashfulness, n. s. సంకోచము, కొంకు, సిగ్గు, బిడియము.
Basil, n. s. తుళసిచెట్టు.
Basilicon, n. s. ఒక తరహా ప్లాస్తిరి.
Basilisk, n. s. కాలకూటసర్పము, యీ సర్పము యొక్క దృష్టి దేనిమీద తగిలితే అది
భస్మమే పోతుందని ప్రతీతి.
Basin, n. s. a vessel to hold water for washing నీళ్ళ పల్లెము.
a cup గిన్నె. a * or water భోగుణినీళ్ళు . or small pond
చిన్నగుంట. of harbour వాడలు నిలిచే దొరువు. a * round the tree
పాదు ఆలవాలము a* of tea గిన్నెడు తేనీళ్ళు this
town is built in a * of hills యీ వూరు కొండల నడిమి
పల్లములో కట్టివున్నది. the basins of a balance త్రాసు తట్టలు.
Basis, n. s. ఆధారము, ఆస్పదము, మూలము, ఆస్తిభారము, బునాది.
or pedestal పీఠము. of a column స్థంభము యొక్క అడుగు పీఠము.
To Bask, v. a. చలికాచుకొనుట. cats * in the sun పల్లులు యెండలో
చలికాచుకొంటవి. he basked by the fir నిప్పుదగ్గెర చలికాచుకొన్నాడు.
those who * in the royal favour రాజు యొక్క అనుగ్రహము గలవాండ్లు.
Basket, n. s. గంప, బుట్ట, గూడ. a flower * పూలబుట్ట. a very large
and high * for storing grain గాదె, పొణక. a small * పుటిక.
a * box మేదరపెట్టె. a round flat * తట్ట. a * for catching fish
చేపలుపట్టేతిర్రి. a fish * చేపలువేసే బుట్ట. a winnowing *
చేట, శూర్పము. a large winnowing * దాగర. a small winnowing
* used by children మొరిటె. a * boat పుట్ట, పోరగోలు. the * makers
caste మేదరకులము.
Basketful, adj. గంపెడు, బుట్టెడు.
Basket-hilt, n. s. మూతకత్తిపిడి, అనగా చేతికి దెబ్బ తగలకుండా పై మూతగల
కత్తిపిడి.
Bason, n. s. See Basin.
Bas-relief, n. s. ఉబుకుపని. the face that appears upon a rupee is
in * రూపాయమీద అగుపడే ముఖము వుబుకుపనిగా వున్నది.
Bass, n. s. మంద్రస్వనము.
Bassia latifolia, n. s. the name of a tree యిప్పచెట్లు, మధూకము.
Bassoon, n. s. వూదేవాద్య విశేషము, ఒక తరహా వూదుకోవి.
Bass-viol, n. s. ఒక తరహా వీణె.
Bastard, n. s. వుంపుడుదాని కొడుకు, పెట్టుకొన్నదానికి పుట్టినవాడు,
వేశ్యకు పుట్టినవాడు.
Bastard, adj. వుంపుడుదానికిపుట్టిన, జారజుడైన. a * son పెట్టుకొన్న
దానికి పుట్టినవాడు. in a metaphorical sense విశ్వామిత్రమైన,
కృత్రిమమైన. a * dialect సంకరభాష. the * mango అడివి
మామిడి. the * orange అడివికిచ్చిలి. * coral మాయపగడము,
మంటిపగడము. a bastard gem విజాతి రత్నము, విశ్వామిత్రమైన
రత్నము, అనగా మాందాళి కరబోకు తరుపులు మొదలైనవి. * florkin
నేల నెమలిపిట్ట. the word puckally is a * word పకాళి యనేమాట
ఒక దిక్కుమాలిన శబ్దము. * wit పిచ్చియుక్తి. * ochre మట్టగోపి.
a * verse in a poem కొత్తగా చెప్పి చేర్చిన శ్లోకము.
To Bastardize, v. a. జారజుడని రుజువు చేసుట, పెట్టుకొన్న దానికి
పుట్టినవాడని రుజువుచేసుట. they attempted to * the child
పెండ్లి చేసుకోని దానికి పుట్టిన బిడ్డని రుజువు చేయను యత్నపడ్డారు.
Bastardy, n. s. జారజత్వము.
To Baste, v. a. పచనమౌతూవుండే మాంసము మీద మిళ్లితో కొంచెము
కొంచెముగా నెయ్యిపోసుట. to sew slightly కుట్టు పోయుట,
పోగు పోసుట, టాకావేసుట. to beat కర్రతో పులుముట, బాదుట.
Bastile, n. s. చెరసాల, బందేఖానా, యిందులో అతి క్రూరదండన జరిగేదని
ప్రతీతి.
Bastinado, n. s. కర్రతో కొట్టడము, దెబ్బలు, కర్రతో అరికాలిమీద కొట్టేదనే
తురకలు చేసే ఒక తరహా శిక్ష.
Bastion, n. s. బురుజు, కొత్తళము.
Bat, n. s. గబ్బిలము. a large * called the flying fox బుషిపిట్ట
చీకురాయి. or stick used in games ఆటలో గుండును తట్టే కర్ర.
or brick * యిటికరాయిపొడి. Bat-fowling ఘంట వేట, రాత్రిళ్ళు
ఆడే వేట.
Batch, n. s. ఒకసారిలో కాల్చినది, ఒకతడవలో చేసినది. a * of bread
ఒక సారిలో కాల్చి యెత్తిన రొట్టెలు. these bricks are all of the same
* యిది అంతా ఒక సూళయిటికె లు. this is the best of the * వున్నంతల్లో
యిది వాసి.
Batchelor, n. s. పెండ్లి లేనివాడు. * of arts శాస్త్రి.
To Bate, v. a. తగ్గించుట, తోలసుట. I cannot * a penny నేను ఒక
కాసుతోయను, విడవను.
Bath, n. s. స్నానము, స్నానతొట్టి, స్నానము చేసే స్థలము, స్నానవాటిక
స్నానజలము. he took a * స్నానము చేసినాడు. she gave the child
a * బిడ్డకు నీళ్ళుపోసినది. a warm * వేణ్నీళ్ళు. a cold *
చన్నీళ్ళు .
Bathe, n. s. స్నానము. he took a * స్నానము చేసినాడు.
To Bathe, v. n. స్నానము చేసుట.
To Bathe, v. a. స్నానము చేయించుట, తడుపుట. he bathed the wound
పుంటిని తడిపినాడు. he bathed his hands in milk పాలులో చేతులు
ముంచినాడు.
Bathed, adj. స్నానము చేసిన తడిపిన, తడిసిన, ముంచిన. checks * in tears
కన్నీళ్ళ తడిసిన దవడలు. hands * in blood నెత్తురుతో తడిసిన చేతులు. *
in dew మంచున తడిసిన.
Bathing, n. s. స్నానము.
Bating, prep. వినహా, వినాయించి. * this యిది వినహా, యిదితప్ప.
Baton, n. s. సేనాధిపతి చేతివేత్రము, శెంగోలు.
Batoon, Battoon, n. s. సేనాధిపతి చేతి వేత్రము, శెంగోలు.
Batta, n. s. (an Indian word) బత్తెము, రోజు.
Battalia, n. s. వ్యూహము, సేనావిన్యాసము, దండును నిలిపే క్రమము.
Battalion, n. s. పటాళము.
To Batten, v. a. See To Fatten v. a. they battened down the hatches
వాడమీది తట్టుచేరిన నీళ్ళు తలుపు సందులో దిగకుండా కీలుచాపలు మూసి
బిగించినారు.
To Batten, v. a. See To Fatten, v. n.
Batten, n. s. బద్ద, చట్టము. a * of bamboo వెదురుబద్ద.
To Batter, v. a. కొట్టుట, యిడియగొట్టుట, పడగొట్టుట. he battered the
kettle with a stone రాతితో ఆ బానఅను పగలకొట్టినాడు. they battered the
walls with their guns గోడలను ఫిరంగులతో యడియగొట్టినారు. the
rams battered each others heads పొట్టేళ్ళు ఢీకొట్టు కొన్నవి.
Batter, n. s. తోపా, అనగా గుడ్లు, పాలు పిండి కలిపి చేసినది. they beat it
to the consistency of * కాటుకవలె మెదిపినారు.
Battery, n. s. place for guns మోర్జా, బురుజు. or beating కొట్టడము. he brought
an action of * against them వాండ్లు తన్ను కొట్టినట్టు వాండ్లమీద ఫిరంగుల
తీరుగా యేర్పరచిన సీసాలు.
Battle, n. s. యుధ్ధము, జగడము, పోట్లాట. he lost the * అపజయమును
పొందినాడు. he gained the * జయించినాడు. The battle won కోరిక ఫలమైనది,
తంటా తీరింది, కోరికె నెరవేరినది. the boxers fought a * మల్లులు యుధ్ధము
చేసినారు. the cocks fought a * పుంజులు జగడము చేసినవి. he set the troops
in * array దండును యుద్ధసన్నద్ధముగా నిలిపినాడు. there was a * royal among the
women ఆ యాడవాండ్ల కొకరికొకరికి అఘోరమైన జగడమైనది. a * axe గండ్రగొడ్డలి.
he knows Sanscrit before hand and this is half the * in learning Telugu
వాడికి మునుపే సంస్కృతము వచ్చియుండుటవల్ల తెలుగు నేర్చుకోవడములో సగము తొందర
తీరినది. a line of * ship గొప్ప యుద్ధవాడ.
To Battle, v. n. యుద్ధము చేసుట, జగడము చేసుట, పోట్లాడుట.
Battledore, n. s. చెండుతట్టేకర్ర, అనగా అతిరస పలకవలె కొనను బటువుగా తోలుకట్టి
వుండేకర్ర.
Battlement, n. s. మేలుగోడ, బురుజుపైగోడ, కోటకొమ్ము, దీనిమరుగున సిపాయీలు
వుండి ఫిరంగులు కాలుస్తారు.
Baumble, or Bawble, n. s. గుల్లాగుట్ర, పనికిమాలినవస్తు, గుల్ల కాసు చేయనిది.
Bawbles bought at the fair బెండు చిలకలు గిలకలు మొదలైన కాసు చెయ్యని
వస్తువులు.
the Baubul tree, n. s. తుమ్మచెట్టు, బబ్బుళి. (K).
Baulk, n. s. (between fields) పొలములో దున్నక విడిచిన తుండునేల.
To Baulk, v. a. వ్యర్ధము చేసుట, నిష్ఫలము చేసుట, నిరర్ధకము చేసుట.
Baulked, adj. భంగమైన, భగ్నమైన, నిరర్ధకమైన. Being * in these
attempts యీ యత్నములు భంగమైపోయినందున.
Bavin, n. s. (a bit of wood) కట్టె, పుడక, పుల్ల
Bawd, n. s. కుంటెనకత్తె
Bawdry, n. s. కొంటెకూతలు, బండుబూతు.
Bawdy, adj. సిగ్గుమాలిన, కొంటె, బండ. * language బండకూతలు. * house
గుడిశవేటువాండ్లు వుండే యిల్లు.
To Bawl, v. n. అరుచుట, కూసుట, బొబ్బలిడుట.
Bay, adj. యెర్ర, యిది గుర్రము యొక్క యెర్ర వర్ణమును గురించే ప్రయోగించ
బడుతున్నది.
Bay, n. s. of the sea మూడుతట్లు భూమిగల సముద్రము. (in building )
a * window వింటిబద్ద ఆకారమైన గవాక్షి. the tiger was at * పులి నాలుగు
తట్ల చిక్కుబడి వుండినది. the stag stood at * among the dogs ఆ జింక
కుక్కలనడమ చిక్కుకొని ప్రాణానకు తెగించ వుండినది. the cow kept the
tiger at * ఆ యావు పులిని దగ్గర చేరనియ్యలేదు. we kept the enemy at
* శత్రువులు మామీద వచ్చి పడకుండా బందోబస్తుగా వుంటిమి, జాగ్రత్తగా
వుంటిమి. I am keeping fever at * నేను జ్వరాన్ని రాకుండా
పట్టుతున్నాను. the name of the laurel tree ఒక చెట్టు పేరు.
To Bay, v. n. మొరుగుట. the dogs * at the moon చంద్రుణ్ని చూచి కుక్కలు
మొరుగుతవి.
Baya, (See Tailor bird).
Bayadere, n. s. (from the Persian word) బోగముది.
Bayonet, n. s. సనియను, తుపాకి కొనను తగిలించే బాకు.
Bay-tree, n. s. ఒక వృక్ష విశేషము. he flourished like a green * తామర
దంపముగా వుండెను. the Sanscrit metrical version of the Psalms
says శ్యామవృక్షము. the Tamil version omits it.
Bazaar, Bazar, n. s. అంగడివీధి, సీమలో సొమ్ములు, పుస్తకములు, శాలువలు మొదలైనవి
అమ్మే సంత అంగళ్ళు పెట్టే బ్రహ్మాండమైన ఒక యింటిని బజారంటారు. that is a *
report వదంతి ఘాలి సమాచారము.