విక్షనరీ:బ్రౌణ్య ఆంగ్ల-తెలుగు పదకోశము A1

A; the short a,. అకారము, as in About, Around, Amount, or in the words అవతల, అక్కడ. The broad a, as in Far, Part, half, hard, ఆకారము, as in the words ఆలాగున alaguna, చాలా cala. The articles A or An ; ఇవి Indefinite articles అనిర్డిష్టోసపడములు. a house ఒక యిల్లు. a man ఒక మనిషి ; కొన్ని స్ఠలములలో. A, An వీటికి వొక అనే అర్థము లోపిస్తున్నది, ఏలాగంటే. a house ఇల్లు . an elephant ఏనుగ. 2. A అనే ఉపపదమునకు " కి, కు, " అనే అర్థమవుతున్నది; ఏలాగంటే, he has three hundred a-year వానికి యేడాడికి మున్నూరు వస్తున్నది. thrice a-year సంవత్సరానికి మూడు మాట్లు. twice a-week వారానికి రెండుమాట్లు. twice an hour ఘడియకు రెండుమాట్లు. 3. A అనే ఉపపదమునకు లో -గా- అని అర్థమవుతున్నది. ఏలాగంటే, Asleep నిద్రలో. he is asleep వాడు నిద్రపోతున్నాడు. Athirst దాహముగా. he is athirst వానికి దాహముగా వున్నది. a-row వరసగా. All those pillars are a-row స్తంభములన్ని వరసగా వున్నవి. he came afoot పాదచారిగా వచ్చినాడు, నడిచి వచ్చినాడు. 4. With a participle ; he went a -hunting వేటకు పోయినాడు. they went a-boating జలవిహారమునకు పోయిరి. the cat went a-mousing పిల్లి యెలుకలను పట్టపోయినది. he fell a-laughing నవ్వినాడు. he went a-begging బిచ్చానికి పోయినాడు. 5. how much a yard ? గజమెంత. many a time శానామాట్లు. many a woman శానామంది స్త్రీలు. A. D. or Anno Domini ఖ్రీస్తు పుట్టిన సంవత్సరమునకు సంజ్ఞ. ( ముఖ్యముగా In the year of our Lord 1845 . అని చెప్పుతున్నారు.) A. M. or Anno Mundi ప్రపంచము కలిగిన సంవత్సరము. A. M. or Artium Magister కాలీజులో యిచ్చే వొక పౌరుష నామము.

Aback, Abaft, adv. వెనక, ఇది సముద్ర భాష.

To Abalienate, v. a. పరాధీనము చేసుట.


Abalienation, n. s. పరాధీనము.

To Abandon, v. a. విడిచిపేట్టుట, పరిత్యాగము చేసుట, వర్జించుట, త్యజించుట, మానుకొనుట. She abandoned herself to grief అని వ్యసనమునకు పాలైనది. he abandoned her దాన్ని చెయి విడిచినాడు.

Abandoned, adj. విడవబడ్డ, త్యజించబడ్డ, వర్జించిన, చెయి విడవబడ్డ. or helpless దిక్కుమాలిన. or vicious దుర్మార్గమైన, దుష్ట. * to grief వ్యసనాక్రాంతుడైన.

  • to his lusts మోహపరశుడైన. an * woman భ్రష్టురాలు, చెడ్డది, దుష్టురాలు.

Abandonment, n. s. విడవడము, పరిత్యాగము. of mind విభ్రమము, పరవశత.

To Abase, v. a. వంచుట, అణుచుట, అవమానపరచుట, భంగపరచుట.

Abased, adj. అణిగిన, భంగపడ్డ.

Abasement, n. s. అవమానము, భంగము.

Abashed, adj. భంగపడ్డ, సిగ్గుపడ్డ. he was * వాడికి ముఖము చచ్చినది.

To Abate, v. a. తగ్గించుట, తక్కువచేసుట.

To Abate, v. a. తగ్గుట, మట్టుపడుట.

Abated, adj. తగ్గిన, మట్టుపడ్డ.

Abatement, n. s. తక్కువచేయడము, తక్కువ.

Abba, n. s. అబ్బా, తండ్రి, ఇది దేవుణ్ని గురించి చేప్పేమాట.

Abbacy, n. s. మఠాధిపత్యము, మఅఠము యొక్క మాన్యము.

Abbe, n. s. (pronounced (ab-bay ) ఒక విధమైన పాదిరి.

Abbess, n. s. సన్యసించిన స్తీల యొక్క మఠాధిపత్యము గల స్తీ.

Abbey, n. s. సన్యాసిమఠము, సన్యసించిన పురుషుల యొక్క గాని స్త్రీల యొక్కగాని మఠము, (విహారము is the word used in Burma in Ceylon,) Abbey-lands, n. s.దేవస్థానము యొక్క మాన్యభూమి గుడినేల.

Abbot, n. s. మఠాధిపతి, గురువు.

To Abbreviate, v. a. సంక్షేపము చేసుట, సంగ్రహము చేసు, సంకేతాక్షరముగా వ్రాసుట, అనగా, రాజమాన్య రాజశ్రీ అని వ్రాయడమునకు బదులుగా, రా|| రా|| అని వ్రాసినట్టు.

Abbreviated, adj. సంక్షేపము చేయబడ్డ, సంకేతాక్షరముగా వ్రాసిన, అనగా తర్వాత, అని వ్రాయడమునకు. త|| అని వ్రాసినట్టు, వెలగపూడి, భాష్టకార్లు అని వ్రాయడమునకు వె||భాష్యకార్లు, లేక వె|| భా|| అని వ్రాసినట్టు.

Abbreviation, n. s. సంక్షేపము, సంగ్రహము, సంకేతాక్షరము.

A,B,C, ఏ, బీ,సీ అనే అక్షరములు. he has not learned his A, B, C, వాడికి ఏ, బీ,సీ, రాడు, అనగా అక్షరాలు తెలియవు.

To Abdicate, v. a. త్యజించుట, వర్జించుట, విడిచిపేట్టుట, వదులుకొనుట. the king *d the kingdom రాజు రాజ్యమును త్యజించి పోయినాడు, విడిచిపెట్టిపోయినాడు.

Abdication, n. s. త్యజించడము, వర్జించడము, విడిచిపెట్టడము, అనగా తన రాజ్యమును త్యజించిపోవడము.

Abdomen, n. s. పొత్తికడుపు, క్రీకడుపు, వస్తి.

Abdominal, adj. పొత్తికడుపు సంబంధమైన.

Abdominous, adj. పెద్ద పొట్టగల.

Abduction, n. s. తీసుకొనిపోవడము.

To Abet, v. a. సహాయము చేసుట, అనగా దుర్మార్గమునకు సహాయము చేసుట.

Abetter, n. s. సహాయము చేసేవాడు, అనగా దుర్మార్గమునకు సహాయము చేసేవాడు.

Abeyance, n. s. (a state of suspension, or temporary extinction ) ఊరికే వుండడము, అనుపయోగముగా వుండడము, అనామత్తు. It is in * అది అనామత్తుగా వున్నది. the appointment is now in * ఆ వుద్యోగము యిప్పుడు వూరికే వున్నది. the marriage is now in * ఆ పెండ్లి ప్రస్తుతము నిలిచివున్నది.

To Abhor, v. a. అసహ్యపడుట, చీదర పడుట. he *s it అది వాడికి చీదర, అది వాడికి అసహ్యము.

Abhorrence, n. s. అసహ్యము, చీదర.

Abhorrent, adj. అసహ్యమైన, చీదరగావుండే.

To Abide, v. n. ఉండుట, నివాసము చేసుట, కాపురము వుండుట. or to remain స్టాయిగా వుండుట, స్టిరముగా వుండుట. his grace abode upon them ఆయన అనుగ్రహము వారియందు వుండెను. he abode at home యింట్లో వుండినాడు. the earth abideth for ever భూమి శాశ్వతముగా వుంటున్నది, స్థిరముగా వుంటున్నది. he abode with them వాండ్లతో కూడా వుండినాడు, కాపురము వుండినాడు. I shall * by your decision తమ తీర్పు ప్రకారము నడుచుకొంటాను. he abode by his former decision వాడు మనుపు చెప్పిన తీర్పులోనే నిలిచినాడు.

To Abide, v. a. to wait for కనిపెట్టుకొని వుండుట, ఎదురుచూచుట. to bear or endure వహించుట, ఓర్చుట, పడుట. who shall * his wrath ? ఆయన కోపానికి యెవరు యెదుట నిలుతురు, ఆయన కోపాన్ని యెవరు సహింతురు. I cannot * this punishment నేను యీ శిక్షను పడలేను, తాళలేను. I cannot * him నేను వాడితో పడలేను, వేగలేను.

Abiding, n. s. నిలకడ, స్ఠిమితము, స్ఠిరము.

Abiding, adj. స్ఠిరమైన, నిలకడైన, స్ఠిమితముగా వుండే.

Abigail, n. s. ఆడపాప, ఆయా, పనికత్తె , ఇది పూర్వ కాలమందు వొక స్త్రీ పేరు.

Ability, n. s. శక్తి, సామర్థ్యము, పరాక్రమము. a man of * శక్తివంతుడు; మేధావి.

Abject, adj. తుచ్ఛమైన, నీచమైన, అల్పమైన, * submission అతివినయము. * poverty అతిదారిద్ర్యము.

Abject, n. s. అతిరిక్తుడు, నిరుపేద.

Abjectly, adv. అతినీచముగా, అతితుచ్ఛముగా.

Abjectness, n. s. నీచత్వము, క్షుద్రత.

Abjuration, n. s. ప్రమాణ పూర్వకముగా విడిచిపెట్టడము, శపథము.

To Abjure, v. a. to renounce upon oath, to reject, పరిత్యాగము చేసుట. ప్రమాణ పూర్వకముగా విడిచిపెట్టుట, శపథముచేసుట.

Ablative, n. s. The instrumental * వల్ల, తో, చేత. " by, with, " is in Sanscrit grammar called తృతియా విభక్తి the third case : and the locative * "in " is called సప్తమీ విభక్తి, లో, యందు, the seventh case. The

  • absolute సతిసప్తమి.

Able, adj. శక్తిగల, సామర్థ్యముగల, an * man సమర్థుడు. one who is * to read చదవగలవాడు. he is not * to read వాడు చదవలేడు. I am not * to do it నేను దాన్ని చేయలేను. the affix అంత్య ప్రత్యయము. as "pleasurable " సంతోషకరమైన. notable ప్రసిద్ధమైన. readable చదవగూడిన. saleable అమ్మగూడిన.

Able-bodied, adj. కాయపుష్టిగల, ధృడగాత్రుడైన. an * man కాయపుష్టిగలవాడు.

Ablution, n. s. కడగడము, ప్రక్షాళనము.

Ably, adv. ఘనముగా.

Aboard, adv. వాడలో, వాడమీద. he went * వాడమీదికి పోయినాడు.

Abode, n. s. స్థానము, నివాసము. he made a temporary * there వాడు అక్కడ కొన్నాళ్ళు వుండినాడు. a subterraneous * నేల మాళిగ. The * of a saint ఆశ్రమము.

Abode, the past p|| of Abide ఉండిన, నివాసము చేసిన. See To Abide.

To Abolish, v. a. ఎత్తివేసుట, తోసివేసుట.

Abolition, n. s. ఎత్తివేయడము, తోసివేయడము. after the * of this custom ఈ మర్యాదను తోసివేసిన తరువాత.

Abominable, adj. అసహ్యమైన, రోతగావుండే, చెడ్డ. * conduct దుర్మార్గము.

Abominably, adv. అసహ్యముగా, రోతగా.

To Abominate, v. a. అసహ్యపడుట.

Abomination, n. s. detestation, loating అసహ్యము, చీదర, రోత. the object of destation రోతగా వుండేటిది, అసహ్యముగా వుండేటిది, తలచీదరగా వుండేటిది. wickedness దుష్టత. this is an * ఇది దుష్ట పని, యిది దుర్మార్గము.

Aboriginal, adj. అనాదియైన. * waste అనాదిబీడు. * lords or rulers అనాదిరాజులు.

Aborigines, n. s. plu. The earliest inhabitants of a country ఒక దేశములో అనాదిగా పశుప్రాయులుగా అడవులలో తిరిగేవాండ్లు, చెంచువాండ్లు మొదలయినవాండ్లు.

Abortion, n. s. కడుపు దిగబడడము. * took place గర్భస్రావమైనది. that child is a miserable * ఆ బిడ్డనిండా పీలగావున్నది. or horrible figure, Behind him stands a hideous animal the most horrible * that fancy ever coined. Here it means భీకరమూర్తి, భయంకరమూర్తి.

Abortive, adj. నిష్ఫలమైన, నిరర్థకమైన. an * birth నేలలు తక్కువగా పుట్టిన బిడ్డ.

Above, prep. మీద, పైన, మించిన, అధికమైన. * two hundred యిన్నూటికిపైన, యిన్నూటికి మించి. his conduct is * suspicion అతని నడతను గురించి అనుమానము లేదు. this is an undertaking * his strength యిది అతని శక్తికి మించిన యత్నము. the * story యిందాకటి కథ, పైన చెప్పిన కథ. the * story యిందాకటి కథ, పైన చెప్పిన కథ. the * stated పైన చెప్పిన. while they were * ground వాండ్లు జీవంతులై వుండినప్పుడు. * all ముఖ్యముగా. God is * all అన్నిటికీ దేవుడు వున్నాడు. he is * receiving rent for his house వాడు తన యింటికి బాడిగే తీసుకోవడము తక్కువగా యెంచుతాడు. he is * his business వాడు తన వుద్యోగమును నీచముగా యెంచుతాడు. he is * the world వాడు కలిగిన వాడై వున్నాడు. In the world * పరమందు.

Above-board, adv. బాహాటముగా, బహిరంగముగా.

To Abound, v. n. విస్తారముగా వుండుట. this country *s with mangoes ఈ దేశములో మామిడిపండ్లు విస్తారము.

About, (prep) or round చుట్టూ, చుట్టూరు. they beat him * the head వాడి తల మీద నాలుగు తట్లా కొట్టినారు. those * him అతని వద్ద వాండ్లు. the suburbs * the city వూరి బయిటవుండే పేట. she has no jewels * her దాని వొంటి మీద సొమ్ములు లేవు. he came with a sheet * him దుప్పటి చుట్టుకొని వచ్చినాడు. I have no money * me నా జేబులో రూకలు లేవు. the town is four miles * ఆ పట్టణము చుట్టుకొని వస్తే నాలుగు మయిలుల దూరము వున్నది. all * అంతటా, సర్వత్ర. that road is very far * ఆ దోవ బహు చుట్టు. or concerning గురించి. they asked him * his head వాడి తలను గురించి విచారించినారు. they came * that business ఆ పనికిగాను వచ్చిరి. or nearly కొంచెము, యించుమించు, మట్టుకు, వాసి. It is now * 4 o' clock యిప్పుడు దగ్గిర దగ్గెర నాలుగు ఘంటలు. * this time యింత సేపటికి, యీసేపటికి, యీపాటికి. * half సగము మట్టుకు, సగమువాసి. * two feet కొంచెము యించుమించు రెండడుగులు. a man * 30 ముప్పై యేండ్ల పాటివాడు. a man * his height వాడి అంత పొడుగాటి మనిషి. or employed upon మీద. you must have your senses * you నీవు అజాగ్రతగా వుండరాదు. a cow * to calve యీననైవుండే ఆవు. a man * to die చావబొయ్యే మనిషి, అనగా యిప్పుడో యింకా ఘడియకో అని వుండేవాడు. when I was * to set out నేను బయలుదేరవలెనని వుండగా. * January జనవరి నెల అంతటికి. to bring * a సాధించుట. he brought the affair * ఆ పనిని నిర్వహించినాడు. he drove * the town బండి వేసుకొని వూరి చుట్టూ తిరిగినాడు, వూరంతా తిరిగినాడు. Go * your business నీపాటికి నీవుపో,లేచిపో. he looked * నల్దిక్కుల చూచినాడు, వెతికినాడు. what is he about ? వాడు యేమి చేస్తున్నాడు. the flag was blowing * ధ్వజ పటము గాలికి యిటూ అటూ ఆడుతూ వుండినది,కొడిగాలికి ఆడుతూ వుండినది. the books were all lying * ఆ పుస్తకములు మూలకు వొకటిగా పడివుండినవి. why should you go * to abuse him ? వాణ్ని యెందుకు తిట్టబోతావు. the ship went * వాడ తిరిగినది, మళ్లుకొన్నది.

Abp, Contraction of Archbishop.

Abreast, adv. వరసగా, సరిగ్గా, జోడుగా. the corps advanced four * ఆ పటాలము వరసకు నలుగురేసిగా వచ్చినది. the two palanquins came * ఆ రేండు పాలకీలు సరిగ్గా వచ్చినవి, జోడుగా వచ్చినవి.

To Abridge, v. a. సంగ్రహము చేసుట, సంక్షేపము చేసుట. or to diminish తగ్గించుట. he *d the statement వాడు ఆ సంగతిని సంగ్రహము చేసినాడు. this rule *d the power of the Magistrate యీ చట్టము చేత పోలీసువారికి అధికారము తగ్గినది.

Abridged, adj. సంగ్రహమైన, సంక్షేపము చేయబడ్డ, తగ్గించబడ్డ, తగ్గిన.

Abridgement, n. s. సంగ్రహము, సంక్షేపము, తగ్గించడము, తగ్గడము. on account of this * of his liberty వాడి స్వతంత్రము యిట్లా తగ్గిపోయినందున.

Abroach, adj. తెరిచిన, మొదలుపెట్టిన. to set * తెరుచుట, ఆరంభించుట. after they set the liquor * వాండ్లు సారాయి కారేటట్టు చేసిన తరువాత. he set the pipe

  • ఆ సీసాయికి బెజ్జము చేసి సారాయిని కారనిచ్చినాడు. they set this business * యీ

పనికి మొదలుపెట్టినారు. It is easy to set blood * but who is to stanch it ? నెత్తురు కారేటట్టు చేయడము సులభమే గాని కారకుండా నిలిపేవాడు యెవడు. who set this ancient quarrel new * ? (Shakespeare ) పోయిన జగడాన్ని మళ్లీ మొదలుపెట్టినది యెవరు.

Abroad, adv. బయట. both in the house and * ఇంట్లోనున్ను బయటనున్ను. he travelled * పరదేశము తిరిగినాడు. The people were scattered * జనము నాలుగుతట్లా చెదరిపోయినది. he shed * his grace upon them తనదయను వాండ్లమీద ప్రసరింపచేసినాడు. the secret got * ఆ మర్మము బయటబడ్డది.

To Abrogate, v. a. కొట్టివేసుట, తోసివేసుట.

Abrogated, adj. కొట్టివేసిన, తోసివేసిన.

Abrogation, n. s. కొట్టివేయడము, తోసివేయడము.

Abrupt, adj. ఆకస్మికమైన, అకస్మాత్తైన. or craggy ఒడుదుడుకైన. he gave me * answer ధూర్తత్వముగా వుత్తరవు చెప్పినాడు, కట్టెవిరిచినట్టు వుత్తరము చెప్పినాడు.

Abruptly, adv. ఆకస్మికముగా, ఆకస్మాత్తుగా, దడీలుమని, కట్టెవిరచినట్టుగా.

Abruptness, n. s. ఆకస్మికత.

Abrus precatorious, n. s. గురిగింజ.

Abscess, n. s. విద్రధి, అనగా తేలకుండా వుండే లోనిపుండు.

To Abscond, v. n. ముఖముతప్పించుట, పారిపోవుట, పలాయనమవుట.

Absence, n. s. లేకవుండడము, పరోక్షము. In my * నేను లేనప్పుడు, నాపరోక్షములో. he took leave of * for ten days పది దినములకు లేకుండా వుండడమునకు సెలవు తీసుకొన్నాడు. the pains of * విరహవేదన. * of mind పరాకు, పరధ్యానము.

Absent, adj. లేని, లేకవుండే. he is very * వాడికి నిండా పరాకు, వాడికి పరధ్యానము నిండా. he is * to-day వాడు నేడు లేడు. he was then * వాడు అప్పుడు లేడు.

To Absent, v. a. లేకుండా చేసుట. he *ed himself లేకుండా వుండినాడు.

Absentee, n. s. లేనివాడు, ఉండనివాడు.

To Absolve, v. a. విమోచనము చేసుట, విముక్తిచేసుట. the priest *ed him పాదిరి వాడి పాపవిమోచనము చేసినాడు.

Absolute, adj. సంపూర్ణమైన, స్వతంత్రమైన, స్వేచ్ఛ అయిన, నిరంకుశమైన. an * monarchy నిరంకుశ ప్రభుత్వము. this is * injustice యిది సాక్షాత్తు అన్యాయము వట్టి అన్యాయము. he is * wisdom వాడు జ్ఞానావతారము.

Absolutely, adv. బొత్తిగా, శుద్దముగా, నిరంకుశముగా, అవశ్యముగా. this is * false యిది బొత్తిగా అబద్ధము. he ruled * నిరంకుశ ప్రభుత్వము చేసినాడు.

Absoluteness, n. s. పరిష్కారము, సంపూర్ణత.

Absolution, n. s. విమోచనము, విముక్తి, అనగా పాదిరిచేసే పాపవిమోచనము. the priest granted him * గురువు అతని పాపవిమోచనము చేసినాడు.

To Absorb, v. a. పీల్చుట, ఈడ్చుట, ఆకర్షించుట. the sand *ed the water యిసుక నీళ్ళను యీడ్చుకొన్నది.

Absorbed, adj. పీల్చబడ్డ, ఇనికిన. he was * in grief దుఃఖములో ముణిగి వుండినాడు. he was * in meditation వాడు తదేక ధ్యానముగా వుండెను. these ten officers are to remain at Madras until they are * in different regiments ఆయా రిజిమెంట్లలో యెత్తివేసుకొనే వరకున్ను యీ దొరలు పది మందిన్ని చెన్నపట్టణములో వుండవలసివున్నది.

Absorbent, adj. పీల్చే ఆకర్షించే. the * vessels నరము, తోలు, మొదలైనవి. blotting paper is * యెర్ర కాగితము తడిని యీడ్చు కొంటున్నది.

Absorbing, adj. పీల్చే, ఈడ్చుకొనే. * grief కృశింపచేసే దుఃఖము.

Absorpt, adj. పీల్చిన. See Absorbed.

Absorption, n. s. పీల్చడము, ఈడ్చుకోవడము. * in the deity దేవునిలో లీనము కావడము, ఐక్యము కావడము.

To Abstain, v. n. మానుకొనుట, వదులుకొనుట, వర్జించుట. he *ed from drinking for two days రెండు దినములుగా తాగడమును మానుకొన్నాడు.

Abstemious, adj, abstinent, మితభోజియైన. an * person మితాహారి, మితభోజి.

Abstemiously, adv. మితభోజనముగా.

Abstemiousness, n. s. మిత భోజిత్వము. he shewed great * వాడు మహా మితభోజనము చేసినాడు.

Abstergent, adj. నిర్మలముచేసే, శుభ్రముచేసే. soap is * సబ్బు నిర్మలము చేసేటిది.

Abstinence, n. s. మితాహారము, లఘుభోజనము, ఫలాహారము, ఉపోష్యము, అభోజనము.

Abstinent, adj. మితాహారియైన, లఘుభోజనము చేసే.

To Abstract, v.a. సంక్షేపము చేసుట, క్రోడికరించుట, ఉటంకించుట. or to steal అపహరించుట. or to separate ప్రత్యేకించుట. he *ed the book ఆ గ్రంథమును సంక్షేపముగా చేసినాడు. he *ed his mind from earthly affairs ఐహిక వ్యాపారముల మీద మనస్సును పారకుండా చేసినాడు.

Abstract, adj. సంక్షేపమైన, పరిష్కారమైన, స్పష్టమైన. an * noun భావార్థక శబ్దము, ధర్మవాచక శబ్దము. * mediation తదేక ధ్యానము. this is an * truth యిది కేవల నిజము, యిది పరిష్కారముగా నిజము.

Abstract, n. s. సంక్షేపము, సంగ్రహము. in the * సాక్షాత్కరించి, ప్రత్యక్షముగా. she was chastity in the * అది పాతివ్రత్య స్వరూపము, అది పాతివ్రత్యవతారము.

Abstracted, adj. సంక్షేపమైన, సంగ్రహమైన. or absent పరాకైన, పరధ్యానమైన.

Abstractedly, adv. బొత్తిగా, శుద్ధముగా, పరిష్కారముగా. with absence of mind పరాకుగా, పరధ్యానముగా.

Abstraction, n. s. పరాకు, పరధ్యానము. or disregard of wordly objects విషయ పరిత్యాగము, వైరాగ్యము. or theft &c. అపహారము.

Abstractly, adv. బొత్తిగా, శుద్ధముగా, పరిష్కారముగా.

Abstruse, adj. చిక్కైన, కఠినమైన, గూఢమైన, మర్మమైన, అమోమయమైన.

Abstrusely, adv. చిక్కుగా, కఠినముగా, గూఢముగా, మర్మముగా.

Abstruseness, n. s. చిక్కు, కాఠిన్యము, గూఢము, మర్మము.

Absurd, adj. అవ్యక్తమైన, అనుచితమైన, అసంగతమైన.

Absurdity, n. s. అవ్యక్తత, మూఢత.

Absurdly, adv. అవ్యక్తముగా, మూఢత్వముగా.

Abundance, n. s. విస్తారము, యథేష్టము.

Abundant, adj. విస్తారమైన, యథేష్టమైన.

Abundantly, adv. విస్తారముగా, యథేష్టముగా, శానా.


To Abuse, v. a. or to revile తిట్టుట, దూషించుట. or to use improperly దుర్వినియోగము చేసుట. they * the charity funds అధర్మరూకలను దుర్వినియోగము చేస్తారు, అన్యాయ వ్యయము చేస్తారు. he *d the opportunity given him చిక్కిన సమయాన్ని చెరుపుకొన్నాడు.

abuse, n. s. or reviling తిట్టు, తిట్లు, దుర్భాష. or the ill use of any thing దుర్వినియోగము. or bad practice దుర్మార్గము, దురాచారము, అక్రమము.

Abusive, adj. తిట్టే, దూషించే. * language తిట్లు. Abusively, adv. దూషణగా, తిట్టి, దూషించి.

To Abut, v.n. అనుకొనివుండుట. his house *s upon mine అతని యిల్లు నా యింటిని అనుకొని వున్నది, యిది యెప్పుడున్ను వెనక తట్టున వుండేదాన్ని గురించినది.

Abutment, n. s. ముట్టుగోడ.

Abyss, n. s. అగాధము, పాతాళము. the * of misery అఘోరమైన కడగండ్లు.

బ్రౌణ్య ఆంగ్ల-తెలుగు పదకోశము