వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం, ఏక వచనం
వ్యుత్పత్తి
  • వారసత్వపు సమాచారాన్ని మోసేది
బహువచనం
  • వారసవాహికలు

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇది ఇంగ్లీషు లోని chromosome అనే మాటకి సరితూగే మాట. ఇంగ్లీషులో ఇది misnomer, అనగా అర్థంతో పొందు కుదరని మాట. జీవకణాలని సూక్ష్మదర్శని కింద పెట్టి అధ్యయనం చేసే కొత్త రోజులలో కణాన్ని ఒక గాజు పలక మీద ఉంచి, ఆ పలకని సూక్ష్మదర్శని లో పెట్టి, కిందనుండి దాని మీదకి కాంతిని ప్రసరింపచేసి చూసేవారు. ఈ అమరికలో పారభాసకంగా ఉన్న అద్దానికీ, దానిమీద పారభాసకంగా ఉన్న కణానికి మధ్య తేడా తెలియక కణ్ంలోని భాగాలు బాగా కనిపించేవి కావు. అందుకని కణానికి ఒక రంగు పూసి చూసేవారు. ఈ రంగు కణం అంతర్భాగంలో ఉన్న అన్ని భాగాలకీ సమానంగా అంయటుకునేది కాదు. కాని రంగు అంటుకున్న భాగాలు నేపధ్యపు వెలుగులో స్పుటంగా కనిపించేవి. ఇలా కనిపించిన పదార్థాన్ని "రంగు పదార్థం" (క్రోమో = రంగు, సోమా = పదార్థం) అని పిలవడం మొదలు పెట్టేరు.

దరిమిలా ఈ విషయం పరిపూర్ణంగా అర్థం అయిన తరువాత ఈ రంగు పదార్థం లుమ్మలు చుట్టుకుపోయిన దారపు ఉండలా ఉందని అర్థం అయింది. మానవుని శరీరంలో ఉన్న జీవకణాలలో కనిపించే ఇటువంటి ఉండలని విడదీసి చూడగా అందులో 23 జతల ఆకారాలు కనిపించేయి. అనగా అప్పటివరకు "రంగు పదార్థం" (క్రోమోజోము) అని పిలవబడుతూన్న "ఉండ" నిజానికి ఈ 23 జతల ఆకారాలు అని తేలింది. అప్పటినుండి ఈ 23 జతల ఆకారాలని క్రోమోజోములు అని బహువచనం ఉపయోగించి పిలచేవారు: క్రోమోజోము 1, క్రోమోజోము 2, ..., క్రోమోజోము 23.

తరువాత అర్థం అయినది ఏమిటంటే ఈ క్రోమోజోములన్నిటిలోను దారంలా ఉన్న పదార్థం అంతా జంటపెన ఆకారంలో ఉన్న డి. ఎన్. ఎ. తప్ప మరేదీ కాదని. అనగా డి. ఎన్. ఎ. లో ఉన్న పదార్థం అంతా ఒక పొడుగాటి దారం అనుకుని, ఆ దారాన్ని 23 ముక్కలుగా కత్తిరించేమనుకుంటే ఆ ముక్కలే 23 క్రోమోజోములు. కనుక డి. ఎన్. ఎ. అన్నా క్రోమోజోములు అన్నా ఒక్కటే. ఈ డి. ఎన్. ఎ. లోనే మన వారసత్వపు సమాచారం అంతా ఇమిడి ఉంది కనుక ఈ క్రోమోజోములని "రంగు పదార్థాలు" అనే కంటె "వారసవాహికలు" అంటే స్వయంబోధకంగా ఉంటుంది.

నానార్థాలు

డి. ఎన్. ఎ., క్రోమోజోములు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
లేవు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

వేమూరి వేంకటేశ్వరరావు, ప్రాణి ఎలా పుట్టింది?, కినిగె ఇ-పుస్తకం, kinige.com

బయటి లింకులు

<small>మార్చు</small>