వధూమాషమాపనన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

కోడలిచే మాషములు (ధాన్యవిశేషము) పంచిపెట్టించినట్లు. వచ్చినబిచ్చగాని కెల్ల బిచ్చము పెట్టుచుండుట కోర్వక లోభియవు నొకపాఱుడు ఒక్కొక బిచ్చగానికి పిడికెడు వంతున ముష్టి వేయునట్లు భార్యకు కట్టడి చేసెను

కోడలిచే మాషములు (ధాన్యవిశేషము) పంచిపెట్టించినట్లు. వచ్చినబిచ్చగాని కెల్ల బిచ్చము పెట్టుచుండుట కోర్వక లోభియవు నొకపాఱుఁడు ఒక్కొక బిచ్చగానికి పిడికెఁడు వంతున ముష్టి వేయునట్లు భార్యకు కట్టడి చేసెను. అట్లు కొన్నిదినములు జరిగినపిదప భార్యపిడికిలి పెద్దదికావున నెక్కువధాన్యము పట్టు నను నూహచే భార్యను నిషేధించి బిచ్చము పెట్టుపనికి కోడలిని నియోగించెను. ఆమె పిడికిలి చిన్నదే. కాని, ఆమె చాల అందకత్తె యవుట నామెం జూచునిచ్ఛ నయినవారు, కానివారుకూడ బిచ్చమునకు వచ్చుటచే మామూలుకంటె నెక్కువ ధాన్యము ఖర్చుకాఁజొచ్చెను. అధికవ్యయ మభిమతము కామి నది వారింప భార్యను నియోగించియు నిష్టావాప్తి కనుపడమిఁ గోడలిని బురికొల్పిన పాఱునకు వ్యయము తగ్గకపోఁగా పైపెచ్చు మిక్కుట మయ్యెను. రెండవమా ఱొనరించిన ప్రయత్నముచే ఆవిప్రుని భార్యానియోగరూపమవు మొదటిప్రయత్నము సర్వథా బాధింపబడెను. అనఁగా నిష్ప్రయోజనమయ్యెను. అట్లే- సంప్రాప్తమయిన అనిష్టమును పోఁగొట్టుకొనుటకై వేఱొకత్రోవం బోవ ననిష్టనివృత్తి కలుగకపోవుటయే గాక మొదటి యనిష్టమే వెనుకటికంటె మిక్కుటమవుపట్ల నీన్యాయ ముపయోగింపఁబడును. ............ సంస్కృతన్యాయములు (కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>