రేచుకుక్క
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కుక్క ఆకారములో నుండు ఒకవిదమైన అడవి జంతువు. / అడవి కుక్క
- (రేచుకుక్కలు బలిష్టమైన సాధారణ కుక్క ఆకారంలో వుండి కుచ్చు తోక కలిగిన అడవి జంతువులు. ఇవి వేటలో గాని సాధారణ సంచారంలో గాని గుంపులు గుంపులుగానే సంచరిస్తాయి. ఇవి ఇతర ఏ అడవి జంతువులకు కూడ బయపడవు. నిర్భయంగా వాటి ముందు సంచరిస్తుంటాయి. అవి కూడ వీటిని ఏమి అనవు. ఇవి పూర్తిగా మాంసాహార జంతువులు. ఇవి గొర్రెలు, మేకల మొదలగు సాధు జంతువుల్ మందలలో పడి చాల వాటిని చంపి క్షణాలో తినేస్తాయి. మనుషులు వాటిని అదిలిస్తున్నా సరే అవి బెదరవు. వాటి పని అవి కానిచ్చి నింపాదిగా వెళ్ళుతాయి. అవి మనుషులకు ఎటువంటి హాని చేయవు. మనుషులు కూడ వీనికి ఎటువంటి హాని చేయరు. ఇవి దేవతా కుక్కలని తలచి ..... గొర్రెల మంలలో పడిన వాటిని బెదర గొట్టాలని ప్రయత్నిస్తారే గానీ వాటిని చంప ప్రయత్నించరు. వాటి బారిన పడిన గొర్రెలను వదలి మిగతావాటిని దూరంగా తరలించే ప్రయత్నం చేస్తారు గాని..... వాటికి దొరికిన గొర్రెను రక్షించాలనే ప్రయత్నం చేయరు. ఎందుకంటే అది వృధా ప్రయాస అని వారికి తెలుసు. అడవి ప్రాంతాలకు దగ్గరిగా వున్న పల్లె వాసులకు ఇది సాధారణ అనుభవమే.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు