యేన నాప్రాప్తే యో విధి రారభ్యతే స తస్య బాధకో భవతి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

దేనిచేత ప్రాప్తించుచుండగా ఏ మఱొకవిధి ఆరంభింపబడునో అది దానికి బాధక మవును. అనగా- ఒకవిధివాక్యముచే నొకవిధి ప్రవర్తించుచుండగా దాని కపవాదముగా నచ్చో బ్రవర్తింపఁజేయబడు, మఱొకవిధివాక్యము మొదటిదానిని బాధించును. రెండు నఞ్‌లు పదముయొక్క విధ్యర్థమును బోధించుచు దానికి మిక్కిలి బలము (Force) నిచ్చునుగాన అప్రతిహతముగ జరుగునపుడు అని "నాప్రాప్తే" అనుపదమునకర్థము నెఱుఁగునది. దీనినే క్లుప్తీకరించి "యేన నాప్రాప్తిన్యాయము" అందురు. ఉదాహరణమునకు తక్రకౌండిన్యన్యాయమును దీసికొనుండు. "బ్రాహ్మణేభ్యో దధి దీయతామ్‌, తక్రం కౌండిన్యాయ" అను నపు డీవాక్యమున రెండు విధు లున్నవి. మొదటిది- బ్రాహ్మణులకు పెరుగు వడ్డింపుడు- అనునది. కౌండిన్యునకు మజ్జిగ వడ్డింపుడు- అనునది రెండవది. ఇందు మొదటివిధిచే పెరుగే కౌండిన్యునకుఁగూడ లభించుచున్నది. కాని, దానిని బాధించి వానికి మజ్జిగయే పోయవలయునని వ్యవస్థ జేయుచు రెండవ వాక్యము ప్రారంభింప బడుచున్నది. ఈరెండు వాక్యములలో ఆనంతరికవిధికే బలము కావున కౌండిన్యునకు మజ్జిగయే పోయబడుచున్నవి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>