వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

సమానపదస్థములగు ప్రత్యయాదులకు విధింపబడిన విధుల క్రమము తప్పక ప్రవర్తించును. అనఁగా మొదటివిధి పదమందలి నిర్దిష్టప్రత్యయములలో మొదటిదానికిని; రెండవది రెండవదానికి; మూడవది మూడవదానికిని. ఇట్లే తక్కినవన్నియు ప్రవర్తించుచుండును. ఈన్యాయము వ్యాకరణమందలిది. "యథాసంఖ్య మనుదేశః సమానామ్‌" అనునది యీన్యాయమునకు మూల మాత్రము. సూత్రార్థము న్యాయముక్రిందనే వివరింపఁ బడినది. ఆ సూత్రప్రవృత్తి ఎట్లన:- "టా జసి ఙసా మినాఽఽత్‌ స్యాః" అని పాణినీయ సూత్రము. టా, ఙసి, ఙస్‌లకు ఇన, ఆత్‌, స్య అనునవి ఆదేశము లగును అని సూత్రార్థము. టా, ఙసి, ఙస్‌లు తృతీయ, పంచమి, షష్ఠి విభక్తి ప్రత్యయములు. ఇన, అత్‌, స్య ఇవి ఆప్రత్యయములకు విధింపఁబడిన కార్యములు. అగుచో, సూత్రమందలి నిర్దిష్టప్రత్యయములలో మొదటిదవు 'టా'కు ఆదేశవిధులలో మొదటిదవు 'ఇన' యును; రెండవ ప్రత్యయమవు 'ఙసి'కి 'ఆత్‌'; మూడవదవు 'ఙస్‌'కు 'స్య' యును క్రమము తప్పక యథాసంఖ్యముగఁ బ్రవర్తించును.

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు