మైనాకుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>హిమవంతునికిని మేరుపుత్రి అయిన మేనకకును పుట్టిన సుతుడు. పూర్వము కృతయుగమున పర్వతములకు అన్నింటికి ఱెక్కలు కలిగి ఉండెను. అప్పుడు అవి ఎల్లయెడల అతిరయముతో తిరుగుచు ఉండినందున ప్రాణులకు మిక్కిలి భయము కలుగుచు ఉండెను. అది నిలుపుటకై ఇంద్రుడు తన వజ్రాయుధముచే పర్వతముల ఱెక్కలు తెగకొట్టసాగెను. ఆసమయమున వాయుదేవుని సాహాయ్యకమువలన మైనాకుడు తప్పించుకొని పోయి సాగరములో చొచ్చి డాఁగి ఉండెను. ఆకృతజ్ఞతనుబట్టియే మైనాకుడు, వాయుపుత్రుడు అగు హనుమంతుడు సీతను వెదక లంకకు పోవుచు సముద్రమును దాఁటు నవసరమున, తనపై కొంతసేపు నిలిచి పొమ్ము అని సముద్రము వెలువడి వచ్చి హనుమంతుని ప్రార్థించెను. అది తనకు ప్రియము అయిన కార్యము అగుటచే ఇంద్రుడు మైనాకునితో స్నేహము చేసి అభయము ఇచ్చి పంపెను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు