భౌతవిచారన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పిచ్చివాని ఆలోచనవలె. పిచ్చివా డొకడు రాజమందిరమునకు బోయెను. సింహద్వారమున నొకమదపుటేనుగు నిలబడియుండెను. దానిని చూచి యాతడీతీరున దలపోసెను- "ఏమిది? చీఁకటియా? కాదు, కాదు. చీకటి చేటలతో బయలు దేరునా? కాకున్న? మేఘము కావచ్చును. ధారగా నీరు క్రుమ్మరించుచున్నది; గర్జిల్లుచున్నది. అబ్బే! అదీ కాదు. మేఘమునకు నలువైపుల నాలుగు స్తంభములుండఁగా నిదివఱకు చూచియుండలేదు. మఱి, రాజుగారి బంధువు కావచ్చును. "రాజద్వారే శ్మశానేచ యస్తిష్ఠతి స బాంధవః- రాజద్వారమున శ్మశానమున నుండువాడు బంధువుడగును" (పంచతంత్రము) అని గదా పెద్దలనుడి. తప్పక రాజబంధువే కావచ్చును. అట్లవుచో, వీనికి చేతిలో వేత్రము (కఱ్ఱ) లేదే!" ఇట్లాతఁడు పలుపోకలు పోయెను. పరిణామ మేమన- ఏనుగు, ఏనుఁగు ధర్మములు పోయి అసంబద్ధవర్ణనముతో అసదృశము లవు నన్యధర్మము లా యేనుఁగున కారోపింపఁబడి తుద కవియు నిరసింపఁబడినవి. వాని ఆలోచన మాత్రము ఇంకను సాగుచునేయున్నది. ద్వారస్థవస్తు వేదియో నిరూపితము కాలేదు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు