భాస్కరరామాయణము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>భాస్కరుని వలన అయిన రామాయణము. ఇది భాస్కరుఁడు, అతని కొమారుఁడు అగు మల్లికార్జున భట్టు, శిష్యుఁడు అగు కుమారరుద్రదేవుఁడు, స్నేహితుఁడు అగు అయ్యలార్యుఁడు, ఈనలుగురు కవులచేతను రచియింపఁబడినది. అయినను వారిలో భాస్కరుఁడు ముఖ్యుఁడు అగుటచేత ఈగ్రంథము భాస్కరరామాయణము అన నెగడి ఉన్నది. ఇది ఇట్లు రచియింపఁబడుటకు కారణము, ఆకాలమునందు ఇతనికి ఆశ్రయుఁడు అయి ఉండిన రాజుయొద్ద అతని బంధువు అయిన రంగనాథుఁడు అనునాతఁడు రాజుయొక్క ఆజ్ఞను పొంది ద్విపదరామాయణము రచియింప పూనుకొనఁగా, అతనియందు తనకు కల సహజమత్సరముచేత రాజుతో నీఘనతకు ద్విపదకావ్యము తగినదికాదు, నేను పద్యకావ్యమును చేసికొని వచ్చెదను, దానిని పరిగ్రహింపుము; అనఁగా అతఁడు చెప్పిన మాట తప్పుట యుక్తముకాదు కనుక రంగనాథుని గ్రంథమునే కైకొనుతలంపున ఎవరు ముందుతెత్తురో వారికృతిని గ్రహించెదను అని చెప్పిపంపెను. అప్పటికి రంగనాథుని రామాయణము మూడుపాళ్లు తీరి ఉండెను కనుక ఇతఁడు అది ముగియుటకు ముందే తన రామాయణమును ముగించికొని పోవ ఎంచి మీఁదచెప్పిన ముగ్గురి సహాయముచే త్వరితముగా ముగించి కొనిపోయెను. అప్పటికి రంగనాథుఁడు తన రామాయణమును ముగించి ఆస్థానమునకు తెచ్చి ఉండెను. అదిచూచి రాజు రంగనాథుని తట్టు కుడిచేతిని భాస్కరునితట్టు ఎడమచేతిని చాఁపెను. అందులకు భాస్కరుఁడు కోపగించుకొని పక్షపాతము కల నీవంటి రాజునకు ఇచ్చుటకంటె నాకృతిని ఒక గుఱ్ఱపువానికి ఇచ్చుట మేలు అని పలుకుచు ఆస్థానమునుండి వెడలిపోవుచు ఉండఁగా, ఆరాజుయొక్క గుఱ్ఱపువాఁడు కవిసార్వభౌమా ఆడినమాట తప్పవద్దు అని దారికి అడ్డముగా వచ్చి మ్రొక్కెను. అంతట అతఁడు వానికి తన కృతిని అంకితముచేసెను. కనుకనే గ్రంథాదియందు సాహిణిమారా అని సంబోధించి చెప్పఁబడి ఉన్నది...........................పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు