వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామ వాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఒకానొక సంస్కృతకవి. విక్రమార్కుని భ్రాత. (చూ|| చంద్రవర్మ.) ఈయన శాలివాహనుని జననమునకు ముందు నూటముప్పది అయిదు ఏండ్లనాడు ఉజ్జయినీ పట్టణమును ఏలుచు ఉండెను. ఇతఁడు సుభాషిత రత్నావళి అను మహాగ్రంథమును, పాతంజల మహాభాష్య వ్యాకరణ రూపము అగు కారికలను, వాక్యప్రదీపము అను వ్యాకరణగ్రంథమును, ఇరువది రెండు శ్లోకములు గల రాహట కావ్యమును రచియించెను. మఱియు ఇతఁడు చిన్నప్పటి నుండి తపస్వులు యోగులు మొదలగువారి సేవచేయుటయందు ప్రీతి కలవాఁడు అయి ఉండెను. ఇట్టి సద్గుణములు కలిగి ఇతఁడు రాజ్యము చేయుచు ఉండఁగా ఆపట్టణము నందలి సకల మంత్రశాస్త్రములు తెలిసిన ఒక పేదబ్రాహ్మణుఁడు భువనేశ్వరి అను దేవతను ఉపాసించినంతట ఆదేవి ప్రత్యక్షమై ఒక పండును ఇచ్చి దీనిని భక్షించినయెడ ముసలితనమును చావును లేనివాఁడవు అగుదువు అని ఆనతిచ్చి అంతర్ధానము అయ్యెను. అంతట ఆబ్రాహ్మణుఁడు తనలో తాను నేను కేవలము దరిద్రుఁడను ఈఫలమును భక్షించి ఎవరిని రక్షింపపోయెదను. చిరకాలము భిక్షాటనముచేసి జీవించవలసినవాఁడనే కదా! కనుక దీనిని కొనిపోయి రాజునకు ఇచ్చితినేని అతఁడు జరామరణములులేక చిరకాలము ప్రజలను పాలించును. అని విచారించి రాజుకొలువునకు పోయి ఆఫలమును ఆశీర్వచనపూర్వకముగా ఇచ్చి దానిమహిమను చెప్పెను. రాజు దానిని పుచ్చుకొని తనకు ప్రియురాలు అయిన అనంగసేన అనుదానికి ఇచ్చెను. అదితనకు ప్రియుఁడైన గుఱ్ఱపువాఁడు ఒకఁడు ఉండఁగా వానికి ఇచ్చెను. వాఁడు తనకు ప్రేమాస్పదురాలు అయిన ఒకదానికిని అది తన యిష్టుఁడు అయిన ఒక గొల్లవానికిని, ఆగొల్లవాఁడు తన ప్రియురాలు అయిన పేడయెత్తెడు దానికిని ఇయ్యఁగా ఆపేడయెత్తునది ఆపండు పుచ్చుకొని పేడను గంపకు నిండించుకొని దానిపైని ఆఫలమును ఉంచుకొని రాజమార్గమున తన యింటికి పోవుచు ఉండెను. అప్పుడు విలాసార్థముగా బయటవచ్చి విహరించుచు ఉండిన భర్తృహరి దానిని చూచి తాను తన ప్రియురాలికి ఇచ్చినపండు ఈపేడయెత్తెడు దానికి ఎట్లు లభించెను అని దానిని తన సమ్ముఖమునకు రావించి సకలవృత్తాంతమును తెలిసికొని స్త్రీలు ఎంత ప్రియము చూపినను నమ్మతగినవారు కారు అని నిశ్చయించి సంసారము వలన విరక్తుఁడు అయి ఆపండును విక్రమార్కునికి ఇచ్చి తాను వనమునకు పోయి తపస్సుచేయుచు తన వైరాగ్యము విశదపడునట్లు నీతిశతకము, శృంగారశతకము, వైరాగ్యశతకము అను మూడుశతకములు కల సుభాషితరత్నావళిని రచియించెను. అది ఇతనిపేర భర్తృహరి అనియే వ్యవహరింపఁబడుచు ఉన్నది. విక్రమార్కుఁడును ఆఫలమును ఒక ముసలి బ్రాహ్మణుఁడు యాచింపఁగా అతనికి సమర్పించెను.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=భర్తృహరి&oldid=852629" నుండి వెలికితీశారు